హస్తప్రయోగం

వికీపీడియా నుండి
(హస్త ప్రయోగం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హస్తప్రయోగం
హస్తప్రయోగం
యోనికసంభోగం (ఆంగ్లం: నాన్ పెనెట్రేటివ్ సెక్స్)

ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు. పురుషులు తమ పురుషాంగాన్ని ఒరిపిడి కలిగించుకోవడము ద్వారా తృప్తి చెందితే, స్త్రీలు యోని మార్గాన్ని తాకడం, వేళ్ళుదూర్చుకుని రాపిడి కలిగించడం, ఇతర మెత్తని వస్తువులని (అరటి పండు, వంకాయ, పురుషాంగాన్ని పోలిన పరికరాలు) యోనిలో దూర్చుకుని స్వయం తృప్తి చెందుతారు. పరిమిత స్వయంతృప్తి, ఆరోగ్యకరమనీ, అత్యంత సురక్షితమైనదని, వైద్యశాస్త్రంలో ధ్రువీకరించడమైనది. హస్త ప్రయోగంపై వివిధ సంస్కృతుల్లో మరియు దేశాలలో అనేక అపోహలు ఉన్నాయి వ్యాధులు కారణమవుతాయి. హస్త ప్రయోగం ఒంటిగా చేసుకుని స్వయంతృప్తి పడటం ఒక పద్ధతి. జంటగా ఒకరికొకరు (సహకరిస్తూ) హస్తప్రయోగం ద్వారా తృప్తి కలిగించడం మరో పద్ధతి. వాత్సాయనుడు, 'కామశాస్త్ర' గ్రంథంలో జంట, ఒకరికొకరు తృప్తి కలిగించడంలో చిట్కాల్లో ఈ పద్ధతి విశదీకరించాడు.

సహకార హస్త ప్రయోగం మొగ-ఆడ జంటలకే పరిమితం కాలేదు. ఆడ-ఆడ, లేదా మొగ-మొగ జంటలు కూడా సహకార హస్తప్రయోగంలో పాల్గొనడం ముఖ్యంగా స్వలింగ సంభోగుల్లో పరిపాటి

భార్య-భర్తల సహకార హస్తప్రయోగానికి కారణాలు:

♥జంటలో ఒకరు సంభోగానికి సిద్ధంగా లేనప్పుడు
♥భర్త అంగం, సంభోగానికి సరిపడా స్తంబన (గట్టిదనం) కలగనప్పుడు
♥భార్యలో వాంఛ, సంభోగేచ్చ తగ్గినప్పుడు
♥అనారోగ్యం వల్ల జంటలో ఒకరు అయిష్టంగా ఉన్నప్పుడు
♥భార్య నిండుగర్బిణిగా ఉన్నప్పుడు
♥గర్భం వద్దనుకున్నప్పుడు

సహకార హస్తప్రయోగం గావిస్తున్న జంట. వర్ణ చిత్రం గీసిన వారు: జాన్ నెపోముక్ 1840.

ఇవి కూడా చూడండి

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.