లతికా కుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లతికా కుమారి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లతికా కుమారి సంగ్వాన్
పుట్టిన తేదీ (1982-01-05) 1982 జనవరి 5 (వయసు 42)
ఢిల్లీ, భారతదేశము [1]
ఎత్తు5 అ. 5 అం. (1.65 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 17)2009 జూన్ 11 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2015 15 జులై - న్యూజిలాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.15
కెరీర్ గణాంకాలు
పోటీ WT20I
మ్యాచ్‌లు 6
చేసిన పరుగులు 61
బ్యాటింగు సగటు 10.16
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 36
వేసిన బంతులు -
వికెట్లు -
బౌలింగు సగటు -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు -
అత్యుత్తమ బౌలింగు -
క్యాచ్‌లు/స్టంపింగులు 2/-
మూలం: Cricinfo, 19 April 2020

లతికా కుమారి ఒక భారతీయ క్రికెటర్.[2] ఆమె ఢిల్లీలో 1992 జనవరి 5 న జన్మించింది. ఆమె పూర్తిపేరు లతికా కుమారి సంగ్వాన్.[3]

ఆమె కుడి చేతివాటం బ్యాటర్. ఆమె బౌలింగ్ శైలి కుడి చేతి మీడియం. ఆమె 2009 నుండి 2016 వరకు భారత మహిళల జట్టు తరపున దేశీయ, అంతర్జాతీయ టి20ఐ క్రికెట్ ఆడింది.

లతికా కుమారి ఢిల్లీ ఉమెన్, ఉమెన్ ఇండియా-బి, ఇండియా బ్లూ ఉమెన్, ఇండియా ఉమెన్ వంటి ప్రధాన జట్లలో పాల్గొని ఆడింది.[4] 2009 జూన్ 11న టి20ఐలో ఆమె మొదటగా భారత మహిళల జట్టు తరపున ఇంగ్లాండ్ మహిళల జట్టుతో టౌన్టన్లో ఆడింది.[4] ఆమె తన చివరి టీ20ఐ 2015 జూలై 15న న్యూజిలాండ్ మహిళా జట్టుతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆడింది.

కుమారి 2009లో బబితా మండ్లిక్, ఆఫ్ స్పిన్నర్ డయానా డేవిడ్ అనే మరో రెండు కొత్త సభ్యులతో పాటు పదిహేను మంది జట్టులో చేర్చబడింది.[5]

దేశీయ మ్యాచ్ లు బెంగాల్, మహారాష్ట్ర, రైల్వేస్, హైదరాబాద్ మహిళా జట్లతో ఆడింది.[6] పాండిచ్చేరి జట్టుకి ప్రారంభ క్రికెటర్ (ఓపెనర్) గా లతికా కుమారి 110 బంతుల్లో 15 బౌండరీలతో 122 పరుగులు, 110.91 స్ట్రైక్ రేట్‌తో తన తొలి శతకాన్ని నమోదు చేసింది.[7]

సూచనలు

[మార్చు]
  1. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2023-07-09.
  2. "Latika Kumari". ESPN Cricinfo. Retrieved 6 April 2014.
  3. "Latika Kumari ..." Starsunfolded. Retrieved 15 August 2023.
  4. 4.0 4.1 "Latika Kumari". Cricinfo. Retrieved 15 December 2018.
  5. "Three new inclusions in India's Twenty20 squad". Cricinfo (in ఇంగ్లీష్). 28 April 2009. Retrieved 15 December 2018.
  6. "Latika Kumari". ESPNCricinfo. Retrieved 15 August 2023.
  7. "LATIKA KUMARI HITS TON". Cricket Association of Pondicherry. Retrieved 15 August 2023.