లాలుపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాలుపురం
—  గ్రామం  —
లాలుపురం is located in Andhra Pradesh
లాలుపురం
లాలుపురం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°19′07″N 80°26′25″E / 16.318492°N 80.440149°E / 16.318492; 80.440149
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం గుంటూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ కాటూరి శ్రీనివాసరావు
పిన్ కోడ్ 522017
ఎస్.టి.డి కోడ్ 0863

లాలుపురం గుంటూరు జిల్లా గుంటూరు మండలం లోని గ్రామము. పిన్ కోడ్ నం. 522 017., యస్.టీ.డీ. కోడ్ = 0863. [1]

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

  1. ప్రాథమిక పాఠశాల,
  2. కాటూరి పబ్లిక్ స్కూల్.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కాటూరి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ యడ్లపల్లి రాధాకృష్ణ ఎన్నికైనారు. శ్రీ కాటూరి శ్రీనివాసరావు, ఆ తరువాత గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం, ప్రోగ్రాం కమిటీ ఛైర్మన్ గా ఎన్నికైనారు. [1]&[10]
  2. ఈ గ్రామ పంచాయతీ సర్పంచి శ్రీ కాటూరి శ్రీనివాసరావు, 2015, డిసెంబరు-16వ తేదీనాడు నిర్వహించిన జిల్లా సర్పంచిల సంఘం, సర్వసభ్య సమావేశంలో, జిల్లా సర్పంచిల సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [11]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

లాలుపురం గ్రామంలో మొదట రెండు దేవాలయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం 11 దేవాలయాలు ఉన్నాయి. పది సంవత్సరాలలో గ్రామస్థులు, చేయీ చేయీ కలిపి, తలా కొంత సొమ్ము వెచ్చించి, ఆలయాలను నిర్మించి, ప్రతి సంచత్సరం ఉత్సవాలు నిర్వహించుటయేగాక, ప్రత్యేకపూజలతోపాటు, అన్నదానం గూడా నిర్వహించుచున్నారు. ఈ గ్రామంలో ఏ మూల చూసినా, ఏదో ఒక ఆలయం దర్శనమిస్తుంది. ఈ గ్రామంలో శివాలయం, శ్రీకృష్ణదేవాలయం, శాకంబరీఅమ్మవారి ఆలయం, ఆంజనేయస్వామి దేవాలయం, షిర్డీసాయిబాబా మందిరం, శ్రీ లక్ష్మీతిరుపతమ్మ సమేత గోపయ్యస్వామి ఆలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించుకున్నారు. వెలివెల్లివారిపాలెం, వీరన్నపాలెం గ్రామాలలో ఆంజనేయస్వామి ఆలయాలు నెలకొల్పినారు. తూర్పు బజారు చెరువుకట్ట ప్రాంతములో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం నిర్మించారు. [6]

శ్రీ శాంకరీ సమేత సిద్ధ గణపతి, సాయిబాబా ఆలయం[మార్చు]

లాలూపురం గ్రామములోని శ్రీ శాంకరీ సమేత సిద్ధ గణపతి, సాయిబాబా ఆలయంలో జీవ, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు 2014, ఫిబ్రవరి-22, శనివారం నుండి మూడురోజులపాటు జరిగినవి. శనివారం ఉదయం నవగ్రహాలు, ఉత్సవమూర్తులతోపాటుగా ఆంజనేయస్వామి, కుమారస్వామివార్ల విగ్రహాల ఊరేగింపు జరిగినవి. ఆదివారం దీక్షాహోమం, జలాధివాసం, ప్రధాన దేవతా జపాలు జరిగినవి. సోమవారం ఉదయం 10-46 గంటలకు, జీవధ్వజస్తంభంతోపాటుగా, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, తదనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ మూడురోజులూ రాత్రికి భజన కార్యక్రమం జరిగింది. [2]

ఈ ఆలయ వార్షికోత్సవం, 2016, మార్చి-4వ తేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారలకు అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు, హోమాలు, అలంకారాల్లను ఏర్పాటు చేసారు. భజనలు చేసారు. [14]

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం[మార్చు]

లాలుపురం చెరువుకట్ట సమీపంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం మాఘశుద్ధపౌర్ణమికి శ్రీ గోపయ్యస్వామి, శ్రీ లక్స్మీతిరుపతమ్మ అమ్మవారల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో, 2014, జూన్-24, మంగళవారం నాడు, ఈ ఆలయ నాల్గవ వార్షిక వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు, తొమ్మిది రకాల అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం, తుళ్ళూరు మండలం, నెక్కల్లు బృందం వారిచే, అమ్మవారి బుర్రకథా కార్యక్రమాన్ని, ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [5]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

లాలూపురం వీరన్నపాలెంలోని శ్రీ అభయాంజనేయస్వమివారి ఆలయంలో, ప్రథమ వార్షికోత్సవాలు, 2014, మే-18 నుండి 25 వరకు నిర్వహించెదరు. [3]

శ్రీ కృష్ణమందిరము[మార్చు]

ఈ మందిర మొదటి వార్షికోత్సవ వేడుకలు, 2014, జూన్-1,2,3 తేదీలలో నిర్వహించారు. ఈ మూడురోజులూ స్వామివారికి ప్రత్యేకపూజలు, అలంకారాలు ఏర్పాటు చేయడమేగాక, విష్ణుసహస్రనామ పారాయణ తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయప్రాంగణంలో రాధాకృష్ణ, శ్రీకృష్ణుని లీలలకు సంబంధించిన పలు చిత్రాలను ఏర్పాటు చేసారు. ఆఖరిరోజు మంగళవారం నాడు భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ప్రతిమను గ్రామవీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. [4]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం[మార్చు]

గతంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరటంతో, గ్రామస్థుల విరాళాలతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. ఆలయంలో సీతారాములతోపాటు, గణపతి, ఆంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ఠకు, మూడు ఉపాలయాలను గూడా అంతరంగా నిర్మించారు. 2015, ఏప్రిల్ లో శ్రీరామనవమికి, విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయ మొదటి వార్షికోత్సవం 2016, ఫిబ్రవరి-2వ తేదీ, బుధవారంనాడు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహంచెదరు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించెదరు. [7]&[13]

శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం గ్రామంలోని గాంధీ విగ్రహం కూడలిలో ఉంది.

శ్రీ పోలేరమ్మ తల్లి తల్లి ఆలయం[మార్చు]

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం[మార్చు]

ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాలు, 2016, ఫిబ్రవరి-26వ తేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. [12]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

ఈ గ్రామములోని రైతులు జొన్న, మిరప, ప్రత్తి, కూరగాయలు మొదలగునవి పండించెదరు.

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ తోట రామకృష్ణ, "లోటస్ టెక్నాలిజీస్" అను ప్రముఖ కంప్యూటర్ కంపెనీని స్థాపించారు.

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామం మొత్తం ప్రధాన గ్రామ సడక్ యోజన పథకం ద్వారా సి.సి రోడ్లు నిర్మించబడ్డాయి.
  2. ఈ గ్రామంలో చెత్త సేకరించి రవాణా చేయడానికి సరియైన వాహనాలు లేక చెత్త తరలింపు ఒక సమస్యగా మారడంతో, గ్రామస్థులంతా చందాలు వేసికొని ఒక ఆటో కొని చెత్త సమస్యను తామే శాశ్వతంగా పరిష్కరించుకున్నారు. ఇప్పుడు గ్రామంలో చెత్త సమస్య లేకపోవడంతో గ్రామం చాలా పరిశుభ్రంగా ఉంటున్నది.
  3. ఈ గ్రామములో కాటూరి దానమ్మ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 108 సంవత్సరాల వయస్సులో, 2015, ఆగస్టు-28వ తేదీనాడు, కాలంచేసారు. ఈమె ఇప్పటి వరకు తన పనులు తానే చేసుకుంటూ ఉత్సాహంగా ఉండేవారు. గత రెండు రోజులగా అస్వస్థతకు గురై తనువు చాలించారు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
"https://te.wikipedia.org/w/index.php?title=లాలుపురం&oldid=2709673" నుండి వెలికితీశారు