లాహోర్ ఖలందర్స్ అనేది పాకిస్తానీ ప్రొఫెషనల్ క్రికెట్ ఫ్రాంచైజీ జట్టు. ఇది పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతుంది. పాకిస్థాన్ ప్రావిన్స్ పంజాబ్ రాజధాని లాహోర్‌కు ఈ జట్టు ప్రాతినిధ్యం వహిస్తుంది.[1] గడ్డాఫీ స్టేడియం ఆ జట్టు సొంత మైదానం. ఈ టీమ్ రానా బ్రదర్స్ సొంతం. జట్టుకు ప్రస్తుతం షాహీన్ అఫ్రిది కెప్టెన్‌గా, మాజీ పాకిస్తానీ క్రికెటర్ ఆకిబ్ జావేద్ కోచ్‌గా ఉన్నారు.[2]
లాహోర్ ఖలందర్స్ రానా సోదరుల యాజమాన్యంలో ఉంది. ఇది పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండవ అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ, అంతర్జాతీయ కంపెనీకి విక్రయించబడిన కొన్ని జట్లలో ఒకటి.[3] 2020 ఎడిషన్‌లో ఫైనల్‌లో మొదటిసారి కనిపించడానికి ముందు, జట్టు పిఎస్ఎల్ మొదటి నాలుగు సీజన్‌లలో ప్రతిదానిలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జట్టు 2022 పిఎస్ఎల్ ఎడిషన్‌లో మరోసారి కనిపించి సీజన్‌ను గెలుచుకుంది.