Jump to content

లా కమిషన్ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి

ఇంగ్లీష్ వికీపీడియా లోని లా కమిషన్ ఆఫ్ ఇండియా చూడు.

లా కమిషన్ నివేదికలు. 2009 సంవత్సరం వరకు 18 లా కమిషన్లు, భారతీయ చట్టాలను, న్యాయ వ్యవస్థ పనితీరును పరిశీలించి, 236 నివేదికలను (రిపోర్టులను ) ఇచ్చాయి. ప్రస్తుతం, 19వ లా కమిషన్, జస్టిస్ పి.వి రెడ్డి అధ్యక్షతన పనిచేస్తుంది. 19వ లా కమిషన్ పదవీ కాలం 2009 నుంచి 2012 వరకు.

స్వాతంత్ర్యానికి ముందు ఆంగ్లేయులు నియమించిన నాలుగు లా కమిషన్లు

[మార్చు]
సంవత్సరం కమిటీ పేరు వివరాలు
1834 బ్రిటిష్ ఇండియాలో 1833 ఛార్టర్ చట్టం ఇచ్చిన అధికారంతో, మొదటి లా కమిషన్ ఏర్పడింది. మొదటి లా కమిషన్ ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్చె కోడ్, మరికొన్ని చట్టాల గురించి సిఫార్సు చేసింది. ఇండియన్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, ఇండియన్ కంట్రాక్ట్ చట్టం, ఇండియన్ ఎవిడెన్స్ చట్టము, ఆస్తి బదలాయింపుచట్టము వంటి చట్టాలు ఈ నాలుగు లా కమిషన్ల కృషి మాత్రమే.
1834 మొదటి లా కమిషన్ నివేదిక (బ్రిటిష్ ఇండియా) మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు) మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో, అమలులోకి వచ్చింది.లార్డ్ మెకాలే, నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే రెండు ప్రామాణిక గ్రంథాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ 'చిత్తుప్రతి' ని తయారుచేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతిని కూడా నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో, ఆ నాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాలకంటే, నాటి భారత దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్స్తుతో 'ఇండియన్ పీనల్ కోడ్' చిత్తుప్రతి తయారు చేశాడు. 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం, నేటికీ చెక్కు చెదరలేదు. దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈ నాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు. చూడు: భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్. మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. 2 మే 1837 న పీనల్ కోడ్ మీద రిపోర్ట్ ఇచ్చాడు.
1853 రెండవ లా కమిషన్ నివేదిక (బ్రిటిష్ ఇండియా) రెండవ లా కమిషన్ ఛైర్మన్ - సర్ జాన్ రొమిల్లీ
1861 మూడవ లా కమిషన్ నివేదిక (బ్రిటిష్ ఇండియా) మూడవ లా కమిషన్ ఛైర్మన్ - సర్ జాన్ రొమెల్లీ.
1879 నాలుగవ లా కమిషన్ నివేదిక (బ్రిటిష్ ఇండియా) నాలుగవ లా కమిషన్ ఛైర్మన్ -డాక్టర్ విట్నీ స్టోక్స్. మొదటి లా కమిషన్ ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్చె కోడ్, మరికొన్ని చట్టాల గురించి సిఫార్సు చేసింది. ఇండియన్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, ఇండియన్ కంట్రాక్ట్ చట్టం, ఇండియన్ ఎవిడెన్స్ చట్టము, ఆస్తి బదలాయింపుచట్టము వంటి చట్టాలు ఈ నాలుగు లా కమిషన్ల కృషి మాత్రమే.

స్వాతంత్ర్యం తర్వాత నియమించిన లా కమిషన్లు

[మార్చు]
సంవత్సరం కమిటీ పేరు వివరాలు
1955-1958 మొదటి లా కమిషన్ నివేదిక మొదటి లా కమిషన్ ఛైర్మన్. అప్పటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండీయా ఎమ్.సి. సెతల్వాడ్.
1958-1961 రెండవ లా కమిషన్ నివేదిక రెండవ లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ టి.వి. వెంకటరామ అయ్యర్.
1961-1964 మూడవ లా కమిషన్ నివేదిక మూడవ లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ జె.ఎల్. కపూర్.
1964-1968 నాలుగవ లా కమిషన్ నివేదిక నాలుగవ లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ జె.ఎల్. కపూర్.
1968-1971 ఐదవ లా కమిషన్ నివేదిక ఐదవ లా కమిషన్ ఛైర్మన్ - కె.వి.కె. సుందరం, ఐ.సి.ఎస్.
1971-1974 ఆరవ లా కమిషన్ నివేదిక ఆరవ లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ డాక్టర్ పి.బి. గజేంద్రగడ్కర్.
1974-1977 ఏడవ లా కమిషన్ నివేదిక ఏడవ లా కమిషన్ ఛైర్మన్

- జస్టిస్ డాక్టర్ పి.బి. గజేంద్రగడ్కర్.

1977-1979 ఎనిమిదవ లా కమిషన్ నివేదిక ఎనిమిద లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ హెచ్. ఆర్. ఖన్నా.
1979-1980 తొమ్మిదవ లా కమిషన్ నివేదిక తొమ్మిదవ లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ పి.వి. దీక్షిత్.
1981-1985 పదవ లా కమిషన్ నివేదిక పదవ లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ కె.కె. మాథ్యు.
1985-1988 పదకొండవ లా కమిషన్ నివేదిక పదకొండవ లా కమిషన్ ఛైర్మన్ - జుస్టిస్ డి.ఎ. దేశాయ్.
1988-1991 పన్నెండవ లా కమిషన్ నివేదిక పన్నెండవ లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ ఎమ్.పి. థక్కర్.
1991-1994 పదమూడవ లా కమిషన్ నివేదిక పదమూడవ లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ కె.ఎన్. సింగ్.
1995-1997 పదునాలుగవ లా కమిషన్ నివేదిక పదునాలుగవ లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ కె. జయచంద్ర రెడ్డి.
1997-2000 పదిహేనవ లా కమిషన్ నివేదిక పదిహేనవ లా కమిషన్ ఛైర్మన్ - జుస్టిస్ బి.పి. జీవన్ రెడ్డి.
2000-2001 2002-2003 పదహారవ లా కమిషన్ నివేదిక పదహారవ లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ బి.పి. జీవన్ రెడ్డి (2000-2001), జస్టిస్ ఎమ్. జగన్నాధ రావు (2002-2003).
2003-2006 పదిహేడవ లా కమిషన్ నివేదిక పదిహేడవ లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ ఎమ్. జగన్నాధ రావు.
2006-2009 పద్దెనిమిదవ లా కమిషన్ నివేదిక పద్దెనిమిదవ లా కమిషన్ ఛైర్మన్ - డాక్టర్ జస్టిస్ ఎ.ఆర్. లక్ష్మనన్.
2009-2012 పంతొమ్మిదవ లా కమిషన్ నివేదిక పంతొమ్మిదవ లా కమిషన్ ఛైర్మన్ - జస్టిస్ పి.వి. రెడ్డి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

లింకులు

[మార్చు]