Jump to content

లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్

వికీపీడియా నుండి
(లుపెక్స్ నుండి దారిమార్పు చెందింది)
లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (LUPEX)
మిషన్ రకం
  • ల్యాండరు
  • రోవరు
ఆపరేటర్
మిషన్ వ్యవధి6 నెలలు (ప్రణాళిక) [1]
అంతరిక్ష నౌక లక్షణాలు
తయారీదారుడులాంచరు, రోవరు: JAXA
ల్యాండరు: ఇస్రో
లాంచ్ ద్రవ్యరాశి≈ 6,000 కి.గ్రా. (13,000 పౌ.) [2]
పే లోడ్ ద్రవ్యరాశి≈ 350 కి.గ్రా. (770 పౌ.) (రోవరుతో పాటు ల్యాండరు) [3]
శక్తివాట్లు
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ2025-26 (ప్రణాళిక) [4]
రాకెట్H3 రాకెట్టు[5]
లాంచ్ సైట్తనెగాషిమా అంతరిక్ష కేంద్రం, యోషినోబు లాంచ్ కాంప్లెక్స్
కాంట్రాక్టర్మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్
చంద్రుడు ల్యాండర్
అంతరిక్ష నౌక భాగంRover
"location" should not be set for flyby missionsచంద్రుని దక్షిణ ధ్రువం
Moon రోవర్
చంద్రయాన్-5[6] →
 

లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ (LUPEX) లేదా చంద్రయాన్-4 అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) లు సంయుక్తంగా చేపడుతున్న ప్రణాళికాబద్ధమైన చంద్ర యాత్ర.[7][8][9] 2026 లో గాని, ఆ తరువాత గానీ ప్రయోగించే ఈ యాత్రలో చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి మానవరహిత చంద్ర ల్యాండరు, రోవరులను పంపుతారు.[10][5] జాక్సా, తాను అభివృద్ధి చేస్తున్న హెచ్3 ప్రయోగ వాహనాన్ని, రోవరునూ అందించే అవకాశం ఉంది. ఇస్రో ల్యాండరు తయారు చేస్తుంది.[11][12]

చరిత్ర

[మార్చు]

2017 డిసెంబరులో ఇస్రో ప్రీ-ఫేజ్ A, ఫేజ్ A అధ్యయనం కోసం ఒక ఇంప్లిమెంటేషన్ అరేంజ్‌మెంట్ (IA) పై సంతకం చేసింది. నీటి కోసం చంద్రుని ధ్రువ ప్రాంతాలను అన్వేషించడానికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) [13] తో కలిసి 2018 మార్చిలో సాధ్యాసాధ్యాల నివేదికను పూర్తి చేసింది.[14] 2025 తరువాత ప్రయోగించే ఉమ్మడి చంద్ర ధ్రువ అన్వేషణ మిషన్ (లుపెక్స్)తో దీన్ని చేపడతారు.[10][15][16]

ఇస్రో, జాక్సా లు 2018 డిసెంబరులో జాయింట్ మిషన్ డెఫినిషన్ రివ్యూ (JMDR) నిర్వహించాయి. 2019 చివరి నాటికి, జాక్సా దాని అంతర్గత ప్రాజెక్టు సంసిద్ధత సమీక్షను ముగించింది.[17]

2019 సెప్టెంబరులో ల్యాండింగ్ ప్రయత్నంలో చంద్రయాన్-2 లోని ల్యాండరు చంద్రునిపై కూలిపోయినందున, భారతదేశం లుపెక్స్ కోసం అవసరమైన ల్యాండింగ్ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మరో ప్రయత్నంగా చంద్రయాన్-3 అనే కొత్త చంద్రయాత్ర జరపడంపై అధ్యయనం చేయడం ప్రారంభించింది.[18]

2019 సెప్టెంబరు 24 న జాక్సా, NASA సంయుక్త ప్రకటనలో NASA భాగస్వామ్య అవకాశాల గురించి కూడా చర్చించాయి.[19]

జాక్సా తన దేశీయ సిస్టమ్ రిక్వైర్‌మెంట్ రివ్యూ (SRR) ని 2021 ప్రారంభంలో పూర్తి చేసింది.[20] 2023 ఏప్రిల్‌లో ల్యాండింగ్ స్థల విశ్లేషణ, చంద్రునిపై ల్యాండర్, రోవర్ల స్థానాన్ని అంచనా వేసే పద్ధతులు, కమాండ్, టెలిమెట్రీల కోసం భూస్థిత యాంటెన్నాలపై సమాచారాన్ని పంచుకోవడానికి లుపెక్స్ వర్కింగ్ గ్రూప్ 1, భారతదేశానికి వచ్చింది.[21]

అవలోకనం

[మార్చు]

చంద్రుని ధ్రువ ప్రాంతాలలో వాహన రవాణా, అక్కడ సుస్థిరమైన అన్వేషణ కోసం, రాత్రిపూట మనుగడకు అవసరమైన కొత్త అన్వేషణ సాంకేతికతలను ఈ లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ ప్రదర్శిస్తుంది.[22][12] ఖచ్చితమైన ల్యాండింగ్ కోసం ఇది జాక్సా వారి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (SLIM) మిషన్ నుండి తీసుకున్న ఫీచర్ మ్యాచింగ్ అల్గారిథమ్‌ను, నావిగేషనల్ పరికరాలనూ ఉపయోగించుకుంటుంది. ల్యాండర్ పేలోడ్ సామర్థ్యం కనీస స్థాయిలో 350 కి.గ్రా. (770 పౌ.) ఉంటుంది.[1][23] రోవరులో ఉపరితలం నుండి 1.5 మీటర్ల లోతులో నమూనాలను సేకరించడానికి అవసరమైన డ్రిల్‌తో సహా జాక్సా, ఇస్రో లు అందించే బహుళ పరికరాలను తీసుకువెళుతుంది.[24][1] నీటి కోసం పరిశోధన, విశ్లేషణ ఈ మిషన్ లక్ష్యాలుగా ఉండవచ్చు.[11][25]

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి PROSPECT మిషన్ లోని ఎక్సోస్పిరిక్ మాస్ స్పెక్ట్రోమీటర్ L-బ్యాండ్ (EMS-L) వాస్తవానికి రష్యా వారి లూనా 27 లో పేలోడ్‌గా పంపించాలని ప్రణాళిక చేసారు.[26][27] అయితే ఆ EMS-L ఇప్పుడు లుపెక్స్ మీద వెళ్తుంది. 2022 లో ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి వలన, రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయ సహకారం కొనసాగుతుందో లేదో అనే సందేహం కలిగింది. [28] ఇతర స్పేస్ ఏజెన్సీల నుండి పేలోడ్ ప్రతిపాదనలు కోరవచ్చు.[8]

పేలోడ్లు

[మార్చు]

ఇస్రో, ESA ల సాధనాలతో పాటు కొన్ని ఎంపిక చేసిన జపనీస్ సాధనాలు, జాక్సా ద్వారా ఆహ్వానించబడిన అంతర్జాతీయ సహకారుల సాధనాలు ఇవి. [20]

  • గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR): రోవర్ ప్రయాణంలో 1.5 మీటర్ల వరకు భూగర్భ రాడార్ పరిశీలన. (ఇస్రో)
  • న్యూట్రాన్ స్పెక్ట్రోమీటర్ (NS): రోవర్ ట్రావర్స్ సమయంలో ఒక మీటర్ వరకు భూగర్భ న్యూట్రాన్ (హైడ్రోజన్) పరిశీలన. (నాసా)
  • అడ్వాన్స్‌డ్ లూనార్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ (ALIS): H
    2
    O
    </br> H
    2
    O
    /OH ఉపరితలం, డ్రిల్లింగ్ రెగోలిత్ పరిశీలన.
  • లుపెక్స్ (EMS-L) కోసం ఎక్సోస్పిరిక్ మాస్ స్పెక్ట్రోమీటర్: ఉపరితల వాయుపీడనం, రసాయన జాతుల కొలత. (ESA)
  • రిసోర్స్ ఇన్వెస్టిగేషన్ వాటర్ ఎనలైజర్ (REIWA): ఇది నాలుగు పరికరాలుండే ప్యాకేజీ.
    • లూనార్ థర్మోగ్రావిమెట్రిక్ ఎనలైజర్ (LTGA): డ్రిల్లింగు చేసి తీసిన నమూనాలలో నీటి జాడ తెలుసుకునేందుకు చేసే థర్మోగ్రావిమెట్రిక్ విశ్లేషణలు.
    • ట్రిపుల్-రిఫ్లెక్షన్ రిఫ్లెక్ట్రాన్ (ట్రిటాన్): మాస్ స్పెక్ట్రోమెట్రీ ఆధారంగా డ్రిల్లింగు చేసి తీసిన నమూనాలలో రసాయన జాతుల గుర్తింపు.
    • ఆప్టికల్ రెసొనెన్స్ (ADORE) ఉపయోగించి ఆక్వాటిక్ డిటెక్టర్: క్యావిటీ రింగ్-డౌన్ స్పెక్ట్రోమెట్రీ ఆధారంగా డ్రిల్ చేసిన నమూనాలలో నీటి కంటెంట్ కొలత.
    • ఇస్రో నమూనా విశ్లేషణ ప్యాకేజీ: డ్రిల్ చేసి తీసిన నమూనాల్లో ఖనిజాల, మూలకాల కొలత. (ఇస్రో)
  • పర్మిటివిటీ అండ్ థర్మో-ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ ఫర్ మూన్స్ ఆక్వాటిక్ స్కౌట్ (ప్రతిమ): [29] లూనార్ రెగోలిత్‌తో కలిపిన నీటి-మంచును ఇన్-సిటు డిటెక్షన్, క్వాంటిఫికేషన్ కోసం
  • ఆల్ఫా పార్టికల్ స్పెక్ట్రోమీటర్ (APS) [29]
  • తక్కువ శక్తి గామా రే స్పెక్ట్రోమీటర్ (LEGRS): [29] కాడ్మియం జింక్ టెల్యురైడ్ (CZT) డిటెక్టర్‌లతో చంద్రునిపై అస్థిర రవాణాను అధ్యయనం చేయడానికి తక్కువ శక్తి (46.5 కెవి) గామా కిరణ రేఖను కొలవడానికి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "国際協力による月探査計画への参画に向けて参考資料" (PDF). MEXT.GO. 29 August 2019. Archived (PDF) from the original on 14 October 2019. Retrieved 10 March 2021.
  2. "月離着陸実証(HERACLES)ミッションの紹介 と検討状況" (PDF). 28 January 2019. Archived (PDF) from the original on 15 November 2019. Retrieved 10 March 2021.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ActaAstro_2020 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "ISRO's next Moon mission in collaboration with Japanese space agency gathers steam". THE ECONOMIC TIMES. 23 August 2023.
  5. 5.0 5.1 Shimbun, The Yomiuri (30 July 2019). "Japan, India to team up in race to discover water on moon". Archived from the original on 28 డిసెంబరు 2019. Retrieved 10 March 2021.
  6. "Next mission to Moon is with Japanese, more of Chandrayaan". The Indian Express. 24 August 2023.
  7. "Chandrayaan-3 on Moon: India to shift focus on Chandrayaan-4 with Japan". INDIA TODAY. 24 August 2023.
  8. 8.0 8.1 "India's next Moon shot will be bigger, in pact with Japan". 8 September 2019. Retrieved 10 March 2021. For our next mission — Chandrayaan-3 — which will be accomplished in collaboration with JAXA (Japanese Space Agency), we will invite other countries too to participate with their payloads.
  9. "Global Exploration Roadmap - Supplement August 2020 - Lunar Surface Exploration Scenario Update" (PDF). NASA. August 2020. Retrieved 10 March 2021.  This article incorporates text from this source, which is in the public domain.
  10. 10.0 10.1 "ISRO to handhold private sector to create innovative space ecosystem in the country: S. Somanath, Chairman". Geospatial World (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-11. Retrieved 2022-05-09. We are working with JAXA on developing a payload, as well as a mission to go to moon. This will be launched using Japan's launch vehicle, but the spacecraft will be jointly developed by ISRO and Japan. A lander which will land on the moon. This will be after Chandrayaan 3 It will take three, four, five years to develop.
  11. 11.0 11.1 "Episode 82: JAXA and International Collaboration with Professor Fujimoto Masaki". Astro Talk UK. 4 January 2019. Retrieved 10 March 2021.
  12. 12.0 12.1 Hoshino, Takeshi; Ohtake, Makiko; Karouji, Yuzuru; Shiraishi, Hiroaki (May 2019). "Current status of a Japanese lunar polar exploration mission". Archived from the original on 25 July 2019. Retrieved 10 March 2021.
  13. "Welcome to Embassy of India, Tokyo (Japan)". www.indembassy-tokyo.gov.in. Retrieved 2021-03-20.
  14. Harding, Robin; Kazmin, Amy (4 January 2018). "India and Japan prepare joint mission to the moon". Financial Times. Archived from the original on 4 January 2018. Retrieved 2021-03-20.
  15. Malvika Gurung (20 May 2019). "After Mars, ISRO to Set a Date with Venus". Trak.in. Retrieved 10 March 2021.
  16. Goh, Deyana (2017-12-08). "JAXA & ISRO to embark on Joint Lunar Polar Exploration". SpaceTech Asia (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-03-20.
  17. "Progress Of Lunar Polar Exploration Mission" (PDF). October 2020. Retrieved 24 March 2021.
  18. "ISRO Will Embark on Chandrayaan 3 by November 2020 for Another Landing Attempt". The WIRE. 14 November 2019. Retrieved 10 March 2021.
  19. "JAXA - Joint Statement on Cooperation in Lunar Exploration". JAXA - Japan Aerospace Exploration Agency. 24 September 2019. Retrieved 10 March 2021.
  20. 20.0 20.1 "Current Status Of The Planned Lunar Polar Exploration Mission Jointly Studied By India And Japan" (PDF). 18 March 2021. Retrieved 24 March 2021.
  21. "Japanese team reviews Lunar Polar Exploration mission with ISRO". The Hindu (in Indian English). 2023-04-27. ISSN 0971-751X. Retrieved 2023-04-29.
  22. Sasaki, Hiroshi (17 June 2019). "JAXA's Lunar Exploration Activities" (PDF). UNOOSA. p. 8. Retrieved 10 March 2021.
  23. "Objective and Configuration of a Planned Lunar Polar Exploration Mission" (PDF). 1 February 2020. Retrieved 10 March 2021.
  24. "Japan Sets Sights on Moon with NASA and India". Space.com. 23 October 2019. Retrieved 10 March 2021.
  25. "Six-day cruise lies ahead for India's Chandrayaan-2 probe before the real lunar shenanigans begin". The Register. 14 August 2019. Retrieved 10 March 2021.
  26. "ESA - Exploration of the Moon - About PROSPECT". exploration.esa.int. Retrieved 2022-04-14.
  27. "LUNAR DRILL | Astronika". astronika.pl (in పోలిష్). Archived from the original on 25 November 2018. Retrieved 2018-11-24.
  28. "Redirecting ESA programmes in response to geopolitical crisis". www.esa.int. Retrieved 2022-04-14.
  29. 29.0 29.1 29.2 "Instrument Details ISRO-JAXA LUPEX Rover". Archived from the original on 10 August 2022.