Jump to content

వంగా నారాయణ గౌడ్

వికీపీడియా నుండి
(వంగా మోహన్ గౌడ్ నుండి దారిమార్పు చెందింది)
వంగా నారాయణ గౌడ్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1967 - 1978
ముందు పి.మహేంద్రనాథ్
తరువాత శ్రీనివాసరావు
నియోజకవర్గం నాగర్‌కర్నూల్ నియోజకవర్గం
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983 - 1985
ముందు శ్రీనివాసరావు
తరువాత నాగం జనార్ధన్ రెడ్డి
నియోజకవర్గం నాగర్‌కర్నూల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1925 నవంబరు 5
ఎండబెట్ల గ్రామం, నాగర్‌కర్నూల్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2010 ఫిబ్రవరి 14
నాగర్‌కర్నూల్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పకీరయ్య గౌడ్
సంతానం వంగా మోహన్ గౌడ్
వృత్తి రాజకీయ నాయకుడు

వంగా నారాయణ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

వి.ఎన్.గౌడ్ 1953లో ఎండమెట్ట గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత 1954లో నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై 1956 నుండి 1967 వరకు బిజినేపల్లి సమితి అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]

వి.ఎన్.గౌడ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1978లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 1981లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జెడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికై 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నిలకు తిరిగి 1985లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Eenadu (17 November 2023). "స్వతంత్రులుగా సత్తా చాటారు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.