వందన కటారియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వందన కటారియా
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నవందన కటారియా
వ్యక్తిగత వివరాలు
జననం (1992-04-15) 1992 ఏప్రిల్ 15 (వయసు 31)
రోష్నాబాద్, ఉత్తర ప్రదేశ్
(ఇప్పుడు ఉత్తరాఖండ్, భారతదేశం)
ఎత్తు 1.59 మీ
ఆడే స్థానము ఫార్వర్డ్
జాతీయ జట్టు
2010–ప్రస్తుతం భారతదేశం 218 (58)

వందన కటారియా (జననం 15 ఏప్రిల్ 1992) ఒక భారతీయ ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి. ఆమె భారత జాతీయ జట్టులో ఫార్వర్డ్ క్రీడాకారిణి. [1]

కటారియా 200కు పైగా అంతర్జాతీయ మ్యాచ్ లలో జాతీయ జట్టు తరఫున ఆడింది. ఆమె 2014 సంవత్సర ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించి, 2016 సంవత్సర రియో ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన భారత జట్టులో సభ్యురాలు.

భారత ప్రభుత్వం 2022లో ఆమెను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. [2]

ప్రారంభ జీవితం[మార్చు]

కటారియా 15 ఏప్రిల్ 1992న ఉత్తరప్రదేశ్ లోని రోష్నాబాద్ లో (ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో) జన్మించింది. ఆమె తండ్రి నహర్ సింగ్ హరిద్వార్ లోని బిహెచ్ఇఎల్ లో మాస్టర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు.

కెరీర్[మార్చు]

కటారియా 2006 సంవత్సరం లో భారత జూనియర్ జట్టులో ఎంపికయ్యింది, ఆమె 2010 సంవత్సరం లో సీనియర్ జాతీయ జట్టులో కి వచ్చింది. జర్మనీలోని ముంచెంగ్లాడ్‌బాచ్ లో జరిగిన 2013 జూనియర్ ప్రపంచ కప్ లో కాంస్యం గెలుచుకున్న జట్టులో సభ్యురాలు. కటారియాను 2014 సంవత్సరంలో హాకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. [3] 2018 సంవత్సరం లో జరిగిన ఆసియా ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు ఒక రజతం గెలుచుకుంది. వందన కటారియా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకుంది. [4]

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ వందన కటారియాను రాష్ట్ర మహిళా సాధికారత , శిశు అభివృద్ధి విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. ఆగస్టు 8, 2021న, వందన కటారియాను కేంద్రం ప్రభుత్వ 'బేటీ బచావో, బేటీ పడావో ఆందోళన్' కు హరిద్వార్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. [5]

అవార్డులు[మార్చు]

  • పద్మశ్రీ పురస్కారం

మూలాలు[మార్చు]

  1. IANS. "Indian hockey team stronger with Vandana Kataria: Poonam Rani". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-11.
  2. "'Play With An Open Heart,' Says Padma Shri Winner Vandana Katariya". News18 (in ఇంగ్లీష్). 2022-02-05. Retrieved 2022-02-11.
  3. Majumdar, Subhashish. "Women's World Cup 2018: Battling poverty, self-doubt, striker Vandana Katariya surpasses the magic 200 mark". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-11.
  4. Majumdar, Subhashish. "Asian Champions Trophy 2018: Tournament gives us self-confidence with an eye on Asian Games gold, says Sjoerd Marijne". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-11.
  5. Aug 9, MS Nawaz / TNN /; 2021; Ist, 04:11. "Hockey star Vandana Katariya made Uttarakhand's brand ambassador for women & child dept | Dehradun News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)