వట్టివాగు ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వట్టివాగు ప్రాజెక్టు
వట్టివాగు ప్రాజెక్టు is located in Telangana
వట్టివాగు ప్రాజెక్టు
వట్టివాగు ప్రాజెక్టు స్థలం
దేశంభారత దేశం
ప్రదేశంపహాడిబండ, ఆసిఫాబాద్
అక్షాంశ,రేఖాంశాలు19°15′09.4″N 79°16′28.4″E / 19.252611°N 79.274556°E / 19.252611; 79.274556Coordinates: 19°15′09.4″N 79°16′28.4″E / 19.252611°N 79.274556°E / 19.252611; 79.274556
ఆవశ్యకతసాగునీరు
స్థితిపనిచేస్తోంది
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరువట్టివాగు
Elevation at crest233.5 మీ.
Spillways6
జలాశయం

వట్టివాగు ప్రాజెక్టు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం లోని పహాడీబండ గ్రామం సమీపంలో వట్టివాగుపై 1976లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఆసిఫాబాదు, రెబ్బన మండలాల్లోని 32 గ్రామాల్లో 24,500 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. గోడావరి బేసిన్లో, ప్రాణహిత ఉపబేసిన్లో ఉన్న ప్రాజెక్టు ఇది.

వట్టివాగు ప్రాజెక్టు జలాశయం విస్తీర్ణం 1124 హెక్టార్లు. పూర్తి స్థాయి నీటి మట్టం 239.5 మీటర్లు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.896 టిఎం‌సిలు. ప్రాజెక్టు నుండి సాగునీరు సరఫరా చేసేందుకు రెండు కాలువలున్నాయి. ఎడమ కాలువ 7 కి.మీ. కాగా, కుడి కాలువ 21.6 కి.మీ. ఉంటుంది.[1]

ప్రాజెక్టుకు ప్రధాన నీటి వనరు తిర్యాని మండలం లోని ఎన్‌టిఆర్ సాగర్ ప్రాజెక్టు జలాశయం నుండి పొర్లి వచ్చే నీరు. ఇతర వాగుల నుండి కూడా ప్రాజెక్టు లోకి నీరు చేరుతుంది. సింగరేణికి చెందిన ఖైరిగూడ బొగ్గుగని తవ్వకంలో భాగంగా 2005 లో ఎన్‌టిఆర్ సాగర్ ప్రాజెక్టు నుండి ఈ జలాశయానికి వచ్చే కాలువను మళ్ళించారు. ఈ గని నుండి తవ్వి పోసే పైమట్టి కారణంగా జలాశయం పూడుకుపోయి నిల్వ సామస్ర్థ్యం తగ్గిపోయింది.[2]

మూలాలు[మార్చు]

  1. "Irrigation Projects in Telangana". irrigation.telangana.gov.in. Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-17.
  2. "వట్టివాగు కాలువ మరోసారి మళ్లింపు". ఈనాడు. Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-17.