వట్టి కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వట్టి కుమార్
జననం
వట్టి కుమార్

1982
మరణం30 ఏప్రిల్, 2021
జాతీయత భారతదేశం
వృత్తిదర్శకుడు

వట్టి కుమార్ తెలుగు సినిమా దర్శకుడు.[1] ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, నర్సన్నపేట గ్రామం.[2]

సినీ ప్రస్థానం[మార్చు]

వట్టి కుమార్ సుప్రీం మ్యూజిక్ కంపెనీలో అసిస్టెంట్ ఎడిటర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ దగ్గర 35 సినిమాలకు సహాయకుడిగా పనిచేశాడు. సురేష్ ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్‌లో కూడా పనిచేశాడు.[3]

దర్శకుడు పరశురామ్ దగ్గర ఆంజనేయులు, సోలో, సారొచ్చారు వంటి చిత్రాలకు వట్టి కుమార్ అసిస్టెంట్‌ డైరెక్టర్ గా పనిచేశాడు.[4] సోలో సినిమాకు పని చేసే సమయంలో శ్రీవిష్ణుతో పరిచయం వల్ల 2017లో మా అబ్బాయి[5] సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. ఆయన మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

మరణం[మార్చు]

వట్టి కుమార్, గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్‌లో కరోనాతో చికిత్స పొందుతూ 2021, ఏప్రిల్ 30న మరణించాడు.[6][7][8]

మూలాలు[మార్చు]

  1. Eenadu (1 May 2021). "సినీ దర్శకుడు వట్టి కుమార్‌ మృతి". www.eenadu.net. Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
  2. TV9 Telugu (1 May 2021). "Director Vatti Kumar: టాలీవుడ్‏లో విషాదం.. కరోనాతో యంగ్ డైరెక్టర్ మృతి.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు.. - young hero sree vishnu movie maa abbayi cinema director kumar vatti passes away due to corona". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (1 May 2021). "విషాదం: టాలీవుడ్‌ యువ దర్శకుడు కరోనాతో మృతి". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
  4. News18 Telugu. "Director Kumar Vatti: టాలీవుడ్‌లో ఆగని కరోనా మరణ మృదంగం.. తాజాగా కోవిడ్‌తో మరో దర్శకుడు కన్నుమూత." Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Deccan Chronicle (15 March 2017). "A new beginning". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
  6. The New Indian Express (1 May 2021). "Maa Abbayi director Kumar Vatti succumbs to Covid-19". The New Indian Express. Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
  7. andhrajyothy (1 May 2021). "కరోనాతో దర్శకుడు కుమార్ వట్టి కన్నుమూత". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
  8. 10TV (1 May 2021). "Kumar Vatti : టాలీవుడ్‌లో మరో విషాదం, కరోనాతో యువ డైరెక్టర్ మృతి | Director Kumar Vattis Dies With Corona" (in telugu). Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)