వర్గం చర్చ:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సీఆర్‌డీఏ గ్రామాల వ్యాసాలలో ఈ సమాచారం అవసరం లేదు[మార్చు]

సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామ వ్యాసాల పేజీలలో ఈ దిగువ తెలిపిన ఒకే విషయ సంగ్రహం అన్ని పేజీలలో కూర్పు చేసారు.ఇది ప్రతి గ్రామ పేజీలో అవసరంలేని విషయసంగ్రహం. గ్రామ చరిత్ర


"ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

చందర్లపాడు మండలం

చందర్లపాడు మండలంలోని ఉస్తేపల్లి, ఏటూరు, కోనాయపాలెం, కొడవటికల్లు, కాసరబాద, గుడిమెట్ల, గుడిమెట్లపాలెం, చందర్లపాడు, చింతలపాడు, తుర్లపాడు, తోటరావులపాడు, పట్టెంపాడు, పున్నవల్లె, పొక్కునూరు,పొప్పూరు, బొబ్బెళ్లపాడు, బ్రహ్మబొట్లపాలెం, మేడిపాలెం, మునగాలపల్లె, ముప్పాల, విభరీతపాడు, వెలది, గ్రామాలు ఉన్నాయి."


ఆ గ్రామాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు అనే వర్గంలో చేర్చబడినవి."ఇంకా అవసరమయితే ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో చేరింది" అని మూలం పెడితే సరిపోతుంది.ఆ వాక్యంరాసి పై విషయసంగ్రహం తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 06:53, 22 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, నాదీ మీ అభిప్రాయమే. ప్రతీ గ్రామం పేజీలోనూ పై సమాచారం పెట్టే అవసరం లేదు. "ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో భాగం" లాంటి వాక్యం ఒకటి మూలంతో పాటు రాస్తే చాలు. __చదువరి (చర్చరచనలు) 01:07, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]