వర్గం చర్చ:తనికెళ్ళ భరణి చిత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వర్గంతో సమస్య[మార్చు]

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ వర్గంతో ఒక సమస్య ఉంది: ఇందులో భరణి నటించడం గానీ, గానీ, మాటల రచన గానీ, రచన గానీ, దర్శకత్వం గానీ ఏదో ఒకటి మాత్రమే చేసిన సినిమాలు ఉంటాయా? లేదా వీటిలో ఏ రెండు మూడైనా ఒకే సినిమాలో చేస్తే అవి కూడా ఉంటాయా? లేక వీటన్నిటినీ ఒకే సినిమాలో చేస్తే అలాంటి సినిమాలు ఉంటాయా? ఈ విషయంలో స్పష్టత కోసం - తనికెళ్ళ భరణి నటించిన సినిమాలు, తనికెళ్ళ భరణి దర్శకత్వం చేసిన సినిమాలు, తనికెళ్ళ భరణి రచించిన సినిమాలు, తనికెళ్ళ భరణి మాటలు రాసిన సినిమాలు అంటూ విడివిడిగా వర్గాలు చేసి ఆ వర్గాలను ఈ వర్గంలో చేరిస్తే బాగుంటుంది. అవసరమనుకున్న చోట్ల వీటి కాంబినేషను వర్గాలు కూడా పెట్టుకోవచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 02:19, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం చదువరి గారు, గతంలో నేను వర్గాలు సృష్టించడం విరివిగా చేస్తుండేవాన్ని. ఎక్కువ వర్గాలు చేస్తే వికీపీడియా నిర్వహణ కష్టం అవుతుందని సహా సభ్యులు సూచించడంతో వర్గాలు సృష్టించడం ఆపేసాను. నిజానికి ఒక వ్యక్తి లేదా ఒక అంశానికి సంబంధించి ఎక్కువ వర్గాలు ఉన్నప్పుడు వాడుకరులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 03:06, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ గారూ, ఎక్కువ వర్గాలు చేస్తే వికీపీడియా నిర్వహణ కష్టం అవడం, ఎక్కువ వర్గాలు ఉన్నప్పుడు వాడుకరులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండడం - ఈ రెండింటి గురించి జనరిక్‌గా ఇక్కడే చర్చిస్తే ఈ చర్చ విస్తృతి పెరిగిపోద్దనే ఉద్దేశంతో నేను ఈ అంశాలను స్పృశించడం లేదు. అయితే, ఈ వర్గానికి మాత్రమే సంబంధించి పై రెండు అంశాలను చూద్దాం.
(ముందుగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినది - వర్గీకరణ ఉద్దేశం, వాడుకరులు సమాచారాన్ని తేలిగ్గా శోధించే (బ్రౌజు చెయ్యడం) వీలు కలిగించడం.)
"తనికెళ్ళ భరణి మాటల రచన మాత్రమే చేసిన సినిమాలు" లేదా "తనికెళ్ళ భరణి నటన మాత్రమే చేసిన సినిమాలు" లేదా "తనికెళ్ళ భరణి దర్శకత్వం మాత్రమే చేసిన సినిమాలు" ఏమేంటో చూద్దామనుకుంటే, ఈ వర్గం ద్వారా తెలుస్తుందా? ఈ ప్రశ్నకు "లేదు" అని మీరూ అంగీకరిస్తారు.
ఇలా కాకుండా, ఈ మూడు నాలుగు వర్గాలు విడివిడిగా ఉండి ఉంటే పై సమాచారం తేలిగ్గా తెలుస్తుంది. వాటికి పైనుండే వర్గాలను సృష్టించుకోవడం కూడా బహు తేలిక. ఎంచేతంటే కొన్ని "వర్గాలను" కలిపే మాతృవర్గాన్ని సృష్టించుకోవడం అనేది చిటికెలో - సెమీ ఆటోమాటిగ్గా లేదా ఆటోమాటిగ్గా - చేసెయ్యొచ్చు. కానీ, మాతృవర్గం నుండి కింది వర్గాలను సృష్టించడం అనే పని అలా చెయ్యలేం - ఆయా వ్యాసాలను "చదివాక" మాత్రమే, "మానవికంగా" మాత్రమే ఆ పని చెయ్యగలం. అంటే ఈ వర్గం ద్వారా పాఠకుడికి శోధనలో సౌలభ్యం తక్కువగా ఉందని అర్థమౌతోంది. కాబట్టి ఈ సందర్భంలో ఎక్కువ వర్గాలు (ఈ ఒక్క వర్గం కంటే విడివిడిగా నాలుగు వర్గాలు) ఉంటేనే మంచిదని మనం గ్రహించవచ్చు.
అయితే.., వర్గాల పట్ల మీ అభిప్రాయం ఏర్పడడానికి సరైన కారణాలే ఉన్నాయని నేను భావిస్తాను - పేజీలో ఒక కీవర్డును తోసుకుని కొత్త వర్గాన్ని సృష్టించడం (అందులో ఆ ఒక్క పేజీయే ఉంటుంది - అనేక వర్గాలున్నాయి ఇలాంటివి), మాతృ వర్గాన్ని దాని కిందివర్గంలో చేర్చడం (కుక్కతోక వర్గీకరణ - కుక్క తన తోకను నోటితో పట్టుకోవాలని గుండ్రంగా తిరుగుతూంటుంది, కానీ అది ఎప్పటికీ అందదు) లాంటి వర్గీకరణల వల్ల మీరు చెప్పిన అయోమయం కలుగుతుంది. నిర్వహణ కూడా కష్టమే.
కానీ తార్కికంగా ఉండాల్సిన వర్గాలు లేకపోతే సమాచారాన్ని వెతకడం కష్టమౌతుంది. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 03:38, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, 'వాడుకరులు సమాచారాన్ని తేలిగ్గా శోధించే (బ్రౌజు చెయ్యడం) వీలు కలిగించడం' అన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. తనికెళ్ళ భరణి గారి సినిమాల విషయంలో పైన మీరు పేర్కొన్న వర్గాలు కూడా ఉంటే వర్గీకరణ సులభమవుతుంది. అలాగే చేద్దామండీ.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:50, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి , ప్రణయరాజ్, గార్ల అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 06:09, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.