వర్గం చర్చ:సుప్రసిద్ధ ఆంధ్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరు సుప్రసిద్ధ ఆంధ్రులు కారు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు ఆత్మార్పణం చేసిన పొట్టిశ్రీరాములు, బ్రిటీష్ వారికి ముప్పుతిప్పలు పెట్టి ఆంధ్రుల అభిమానం పొందిన అల్లూరి సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతకై తన ముఖ్యమంత్రి పదవినే వదులుకున్న బూర్గుల రామకృష్ణారావు లాంటివారిని సుప్రసిద్ధ ఆంద్రులంటే నమ్మవచ్చు కాని, ఒక్క సారి శాసనసభ్యుడుగానో, పార్లమెంటు సభ్యుడుగానో ఎన్నికైనంత మాత్రాన, ఒక్క పుస్తకం వ్రాసినంత మాత్రాన, ఏదో కొద్ది పేరు పేరుకున్నంత మాత్రాన వారు సుప్రసిద్ధ ఆంద్రులు కాలేరు. మనం వారిని ఈ వర్గంలో చేర్చడం సమంజసం కానేకాదు. ఈ విషయం నేను ఎప్పుడో గుర్తించి చాలా వ్యాసాలను వర్గం మార్పు చేసి ఆయా జిల్లా ప్రముఖుల వర్గాలలో చేర్చాను. ఇంకనూ చేర్చాల్సిన వ్యాసాలు చాలానే ఉన్నాయి. అందరినీ ఒకే గాటకట్టడమంటే అసలైన సుప్రసిద్ధ ఆంధ్రులను చిన్నచూపు చూడటమే. కనీసం రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకుంటే కాని ఈ వర్గంలో చేర్చే అవసరం లేదనుకుంటా. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:34, 27 డిసెంబర్ 2008 (UTC)

మామూలు వ్యక్తులకు కూడా సుప్రసిద్ధ ఆంధ్రులు వర్గం ఇవ్వడం బాగుండదు. తొలిగించినట్లు ఈ వర్గంలో వ్యాసాలు చేరుతూనే ఉన్నాయి. అందరు తెలుగు వ్యక్తులకు సుప్రసిద్ధ వర్గంలో చేర్చడం వల్ల అసలైన సుప్రసిద్ధులను, మామూలు వ్యక్తులను కలిపేసినట్లవుతుంది. మామూలు వ్యక్తులను ఆయా జిల్లా ప్రముఖులలో చేరిస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:36, 13 సెప్టెంబర్ 2013 (UTC)

వర్గం పేరు మార్పు[మార్చు]

వర్గీకరణ వ్యాసంలో సాధారణ విశేషణాలు వాడని పేర్లు వర్గానికి వాడాలని సూచించారు. దానిని బట్టి సుప్రసిద్ధ ఆంధ్రులు అనేది ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు గా మారుద్దామని ప్రతిపాదన. 31 మే 2012 లోగా స్పందించండి.--అర్జున (చర్చ) 10:38, 25 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా మార్చండి. మీకేది సమంజసం అనిపిస్తే అది చేయండి. ఇక సుప్రసిద్ధులైన ఆంధ్రులకు వేరుగా వర్గం ఉండదు. అంతేకదా.Rajasekhar1961 (చర్చ) 13:46, 25 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండి. --అర్జున (చర్చ) 10:54, 28 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే వర్గంలో ప్రముఖులు అనివుంటే , దానిని కూడా వ్యక్తులు గా మార్చాలని ప్రతిపాదన.--అర్జున (చర్చ) 10:56, 28 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
సుప్రసిద్ధ ఆంద్రులు వర్గం ఉండాలి. అది ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వర్గంలో ఉప వర్గంగా ఉండాలి. వ్యక్తులలో ఎన్నో వర్గాలుంటాయి. అందులో ఒకటి సుప్రసిద్ధులు. కాకుంటే ఇప్పుడున్నట్లు అందరినీ సుప్రసిద్ధుల నుంచి తొలిగించి నిజమైన "సుప్రసిద్ధు"లనే ఈ వర్గంలో చేర్చాలి. మామూలు వ్యక్తులు కేవలం వ్యక్తుల వర్గంలో మాత్రమే ఉంటే సుప్రసిద్ధులు వ్యక్తులతో పాటు సుప్రసిద్ధుల వర్గంలోనూ ఉంటారు. వ్యక్తులలో వందలు, వేల పేర్లు చూడటం ఇబ్బంది. కాబట్టి సుప్రసిద్ధులకు ప్రత్యేకంగా వర్గం ఉండటం మేలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:32, 29 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని వేమన చెప్పినట్లు వ్యక్తులందు సుప్రసుద్ధులు వేరు. అలాంటివారిని కూడా మామాలు వ్యక్తులతో కలిపేయడం కాకుండా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. తెవికీ పాఠకులకు అది సౌలభ్యంగా ఉంటుంది. రత్నాలను మట్టిలో కలిపేయడం బాగుండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:58, 30 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:తెలుగు ప్రజలు అని ఒక వర్గం, వర్గం:తెలుగు ప్రముఖులు అని ఒక వర్గం, వర్గం:సుప్రసిద్ధ తెలుగువారు అని మరొక వర్గం ఉన్నవి కావున, సాధారణ పౌరుల గురించి వర్గం:తెలుగు ప్రజలు లో, తెలుగు వారందరికో లేక కొందరికో తెలిసిన వాళ్ళ గురించి వర్గం:తెలుగు ప్రముఖులు లో, (ఉదా: సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు), జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో సుప్రసిద్ధులైన తెలుగు వారి గురించి వర్గం:సుప్రసిద్ధ తెలుగువారు లో వ్రాయటం మంచిదనుకొంటాను . ఇలా చేస్తే సుప్రసిద్ధుల గౌరవానికి భంగం కలగకుండా ఉంటుంది. దీని పై ఒక ఏకాభిప్రాయానికి వస్తే వర్గీకరణ సులభం అవుతుంది. - శశి (చర్చ) 14:26, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు ప్రజలు, తెలుగు ప్రముఖులు, సుప్రసిద్ధ తెలుగువారు - ఈ మూడు వేరువేరు వర్గాలే,ఇలా ఉండాల్సిందే, కాని ఏ వ్యక్తి వ్యాసం ఎందులో చేర్చాలో సభ్యులకు అవగాహన లేకపోవడంతో గందరగోళం ఏర్పడుతున్నది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:23, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]