వల్లభనేని బాలశౌరి
వల్లభనేని బాలశౌరి | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 నుండి ప్రస్తుతం | |||
ముందు | కొనకళ్ళ నారాయణరావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | మచిలీపట్నం నియోజకవర్గం | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2004 – 2008 | |||
ముందు | ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | ||
నియోజకవర్గం | తెనాలి నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మోర్జంపాడు, మాచవరం మండలం , గుంటూరు జిల్లా | 1968 సెప్టెంబరు 18||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | జోజయ్య నాయుడు , తమసమ్మ | ||
జీవిత భాగస్వామి | భానుమతి | ||
సంతానం | వల్లభనేని అనుదీప్, వల్లభనేని అరుణ్ , వల్లభనేని అఖిల్ |
వల్లభనేని బాలశౌరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాడు.
జననం, విద్యాభాస్యం[మార్చు]
వల్లభనేని బాలశౌరి 18 సెప్టెంబర్ 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా , మాచవరం మండలం , మోర్జంపాడు గ్రామంలో జోజయ్య నాయుడు , తమసమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేశాడు.[1]
రాజకీయ జీవితం[మార్చు]
వల్లభనేని బాలశౌరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో తెనాలి లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు. ఆయన 2009లో నరసరావుపేట లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. బాలశౌరి అక్టోబర్ 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి,[2] 2014లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019లో మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం నుండి గెలిచి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]ఆయన ప్రస్తుతం సభార్డినెట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు.
పోటీ చేసిన స్థానాలు[మార్చు]
- తెనాలి లోకసభ నియోజకవర్గం 2004 గెలుపు
- నరసరావుపేట లోకసభ నియోజకవర్గం 2009 ఓటమి
- గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం 2014 ఓటమి
- మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం 2019 గెలుపు
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్". Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.
- ↑ Sakshi (13 October 2013). "వైఎస్సార్ సీపీలో చేరిన బాలశౌరి, కనుమూరి". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
- ↑ Sakshi (2019). "Machilipatnam Constituency Winner List in AP Elections 2019 | Machilipatnam Constituency Lok Sabha Election Results". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
http://164.100.47.194/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4021