Jump to content

వసుంధర విజ్ఞాన వికాస మండలి

వికీపీడియా నుండి

వసుంధర విజ్ఞాన వికాస మండలి[1] (రి.నెం.4393/96) తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, గోదావరిఖనిలో స్థాపించబడిన సామాజిక, సాంస్కృతిక, సేవా సంస్థ.[2] ఈ సంస్థ వ్యవస్థాపకుడు వైద్యుల మధు ధర్మారెడ్డి (madhukar vydhyula).[3]


స్నేహం!                                     ప్రేమ!!                                       సేవ!!!

వసుంధర విజ్ఞాన వికాస మండలి

(సామాజిక,సాంస్కృతిక యువ చైతన్య వేదిక)

స్థాపితం: 1993, రి.నెం:4393/96

యైటింక్లయిన్ గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం  

-------------------------------------------------------

సామాజిక సేవ, సాంస్కృతిక త్రోవ, సాహితీనావ

వసుంధర విజ్ఞాన వికాస మండలి 27ఏండ్ల ప్రస్థానం

-వేలాది కార్యక్రమాల నిర్వహణ

-నాటికి నేటికి అదే ఒరవడి

తొలి అడుగు ఎప్పుడూ ఒక్కటే...ఆ అడుగులు నలుగురికోసం సాగితే మరో నలుగురు తోడు వస్తారు. సమాజం నాకేమిచ్చిందని కాకుండా సమాజానికి నేనేం చేయగలను అని ఆలోచిస్తే ఎన్నో దారులు తెరుచు కుంటాయి. అలాంటి ఆలోచనతో పురుడు పోసుకున్న సామాజిక సాంస్కృతిక యువ చైతన్య వేదిక ‘వసుంధర విజ్ఞాన వికాస మండలి.’

నిత్య చైతన్య స్రవంతి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం. అనేక రాజకీయ, కార్మిక, సామాజిక ఉద్యమాలకు పుట్టినిల్లు. ఆ ఉద్యమాలకు సమాంతరంగా సమాజహితమే పరమావధిగా 1993లో ఆవిర్భవించిన సామా జిక సంస్థ వసుంధర విజ్ఞాన వికాస మండలి. పారిశ్రామికప్రాంతంలో భాగమైన యైటింక్లయిన్ పిడి కెడు మందితో ప్రారంభమై పుట్టేడు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటీవలె సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను  జరుపుకున్నది.

నల్లబంగారాన్ని పండిస్తున్న భూగర్బ బొగ్గుగనులు, ఉపాధిభాటలో తరిస్తున్న వందలాది మంది కార్మికులు, విద్యాజ్ఞానాన్ని పంచేందుకు గల్లిగల్లీన వెలసిన ప్రైవేటు విద్యాసంస్థలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ పేరుతో పుట్టుకొచ్చిన విద్యార్థి సంఘాలతో సందడిగా ఉండే కాలం 1993. అటువంటి కార్యక్షేత్రంలో అన్ని వర్గాల వారి సేవలో తరించాలనే దృఢసంకల్పంతోచ విద్యార్థులను సాహిత్యం, సాంస్కృతిక రంగాల పట్ల అవగాహన కల్పించాలనే సంకల్పంతో నాడు పదవతరగతి చదువుతున్న మధుధర్మారెడ్డి (మధుకర్ వైద్యుల) ఆలోచనలతో 1993లో మొగ్గతొడిగింది వసుంధర సంస్థ.    

ఒక్కటిగా చేరి ఉప్పెనగా సాగి...

సమాజసేవ, సాంస్కృతికత్రోవ, సాహితి నావ అనే మూడు అంశాలే లక్ష్యాలుగా, స్నేహం, ప్రేమ, సేవ ఆయుధాలుగా సంస్థకు రూపకల్పన చేశారు మధు. అయితే అవసరమైన సమయంలో ఆ ఆలోచనలకు భిన్నంగా కూడా సంస్థ స్పందించిన సందర్భముంది. సామాజిక సేవ, సాహితి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ సంకల్పంతో ఆవిర్భివించినప్పటికీ వారు సృశించని అంశమంటూ లేదంటే అతిశయోక్తికాదు. పర్యావరణం, విద్యార్థి సమస్యలు, సామాజిక సమస్యలు, కార్మిక సమస్యలు, తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్ల ఒక్కటని అన్నిట్లోనూ తన ముద్ర కనిపిస్తుంది. సంస్థ ప్రారంభించిందే తడవుగా కాలనీలోని నిరాక్షరాస్యులకు చదువు చెప్పే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరు నెలల పాటు శ్రమించి సుమారు 300 మందికి అక్షరజ్ఞానం అందించారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూనే సాంస్కృతిక, స్వచ్ఛంధ కార్యక్రమాలపై సంస్థ దృష్టి సారించింది. సంస్థ ప్రారంభించిన తర్వాత తొలి ప్రయత్నంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, పాటలు, జనరల్ నాలెడ్జీ రంగాలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించింది. ప్రతి సంవత్సరం విద్యార్థులకు వరసగా క్రీడా పోటీలు, విజ్ఞాన పోటీలు నిర్వహించడంతో పాటు  స్థానిక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించింది. నిరాక్షరాస్యత నిర్మూలన కోసం అవగాహన ర్యాలీలు, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీలు నిర్వహించి ఆకట్టుకున్నారు. 1999లో జరిగిన కార్గిల్ పోరాట సమయంలో జవానులకు స్పూర్తినివ్వడం కోసం ఐదువేలమంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలి నిర్వహించి ఉగ్రవాద దిష్టిబొమ్మను దహనం చేశారు.కోనసీమ వరద బాధితులకు విరాళాలు, బట్టలు సేకరించి పంపించింది.

సమస్యలున్న ప్రతి చోట...

వసుంధర సంస్థ సమస్యలేవైన కార్యక్షేత్రంలో దుంకి వాటి పరిష్కారానికి కృషి చేసింది. సుమారు 50వేల జనాభా ఉన్న యైటిక్లయిన్ విద్యార్థుల సౌకర్యం కోసం గ్రంథాలయం కావాలని తొమ్మిది సంవత్సరాల పాటు ఉద్యమించి సాధించింది. మరోవైపు కాలనీలో వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడంతో జి.ఎం కార్యాలయం ముందు ధర్నా కూడా నిర్వహించింది. ప్రస్తుతం మోడల్ కాలనీలో భాగంగా వివేకానంద విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా సంస్థ కృషిలో భాగమే. పాఠశాలలకు సమీపంలో మద్యం దుకాణాలు, బార్ వ్యతిరేకంగా, బస్ షెల్టర్ వినియోగించాలని డిమాండ్ చేస్తూ అనేక ఆందోళనలు చేసింది. సంస్థ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ స్థాయి సాంస్కృతికోత్సవాలు నిర్వహించింది. సంక్రాంతి, ఉగాది పర్వదినాల సందర్భంగా ప్రముఖకవులు సదాశివుడు, జాకబ్, ఏలేశ్వరం వెంకటేష్, కనుకుంట్ల వెంకటేష్, రవీందర్ రాంప్రసాద్ వంటి వారితో కవి సమ్మెళనాలు నిర్వహించి సాహితి సేవకు శ్రీకారం చుట్టింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2007లో యువకులకు 5కె రన్ నిర్వహించింది. వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి నెలలో ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు యువజన వారోత్సవాలు నిర్వహిస్తూ మహిళలకు,యువకులకు, విద్యార్థులకు, పిల్లలకు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించడం చేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల కోసం వెల్ షో నిర్వహించి ప్రముఖ వైద్యుల సమక్షంలో వారికి వైద్య పరీక్షలు ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసింది.సింగరేణి యాజమాన్యం స్థానిక చిన్నతరహ వ్యాపారస్తులపై కక్ష సాధింపుకు పాల్పడగ వారికి మద్దతుగా నిరాహార దీక్ష, భారీ ర్యాలీలు, రాస్తారోకో నిర్వహించి వారి సమస్య పరిష్కారానికి కృషి చేసింది.

కార్మికులకు మద్దతు

సింగరేణి కార్మికులకు బకాయి పడ్డ వేజ్ డబ్బులను ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కాలనీ నుండి గోదావరిఖని సింగరేణి జిఎం కార్యాలయం వరకు మండు వేసవిలో పాదయాత్ర చేసి సంచలనం సృష్టించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత కాలనీ నుండి వివిధ గ్రామాల మీదుగా సెంటినరికాలనీ వరకు పాదయాత్ర చేసి అందరిని ఉద్యమానికి సమాయత్తం చేసింది.

పర్యావరణ పరిరక్షణ ర్యాలీలు, మొక్కలు నాటడం, ఎయిడ్స్ నివారణ ర్యాలీలు, పుస్తక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అక్షరాస్యత, క్రీడాపోటీలు, కార్గిల్ దివాస్ కాగడాల ర్యాలీలు, సంక్రాంతి ముగ్గుల పోటీలు, ప్రముఖుల జయంతి, వర్థంతి సభలు, సంతాప సభలు, పుస్తక వారోత్సవాలు, జాతీయ యువజన వారోత్సవాలు ఇలా ఇప్పటి వరకు వెయ్యికి పైగా కార్యక్రమాలు గతంలో, భవిష్యత్తులోనూ ఎవరు చేయలేనంతగా నిర్వహించి అందరిని ఆకట్టుకుంటున్నది. గతేడాది సింగరేణి కళోత్సవాలను నిర్వహించి కార్మికుల్లో ఉన్న కళాకారులను ప్రోత్సహించింది. అదే ఏడాది నుంచి రాష్ట్రస్థాయి కవితల పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులు అందజేస్తున్నది

.

ఉగాదికి రాష్ట్రస్థాయి పోటీలు

ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో కవితల పోటీలను నిర్వహిస్తున్నది. ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కవితలు వస్తున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహించిన పోటీలకు విశేష స్పందన వచ్చింది. విజేతలకు నగదు బహుమతులు అందిస్తున్నది. ఈ ఏడాది పాఠశాల స్థాయి విద్యార్థులకు కూడా పోటీలు నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. మొదట ఐదు బహుమతులు అని ప్రకటించినప్పటికీ వారిలో పది మందిని ఎంపిక చేయడం జరిగింది. ఇక పెద్దవారిలో ఆరుగురిని ఎంపిక చేసిన సిల్వర్ ఉత్సవాల్లో బహుమతులు అందించాము. ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కవి సమ్మేళనాలు నిర్వహించడం ఆనావాయితీగా వస్తున్నది.

సిల్వర్ జూబ్లీ వేడుకలు  

ఈ ఏడాది ఎప్రిల్ 9న స్థానిక యైటింక్లయిన్ సీఈఆర్ వసుంధర సంస్థ తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నది. ఈ కార్యక్రమానికి  గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, డిప్యూటి మేయర్ సాగంటి శంకర్, కార్పొరేటర్లు కోండ్రస్టాలిన్ కిషన్ ఎంపీటీసీలు వెంకటరమణారెడ్డి, స్రవంతి లక్ష్మి నరసయ్య, యాంకర్లు శిల్పిక, కావ్యలతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ఉగాది కవితల పోటీల విజేతలకు బహుమతులు, పలు రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి సత్కారం, సంస్థ పూర్వ కార్యకర్తలకు సన్మానం  చేశాం.

స్మారక పురస్కారం, ఆత్మీయ సత్కారం

సంస్థలో పనిచేస్తూ అకాల మరణం పొందిన చంద్రమోహన్ స్మారకార్ధం వసుంధర సంస్థ గత మూడేళ్లుగా ఏర్పాటు చేసిన చంద్రమోహన్ స్మారక పురస్కారాన్ని తొలుత కమాన్ ఎంఇవో సంపత్  రెండవ ఏడాది గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రాయనర్సు (మేజిక్ రాజా), ఈ ఏడాది ప్రభుత్వ ఉపాధ్యాయుడు కరీంనగర్ జిల్లా చామనపల్లికి చెందిన వైరాగ్యం ప్రభాకర్ అందజేశాము.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీలు సహకరిస్తే విద్యార్థుల కోసం ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము.


వ్యవస్థాపకులు                                  

మధుకర్ వైద్యుల           

విశేషాలు

[మార్చు]

వసుంధర విజ్ఞాన వికాస మండలి సామాజిక సంస్థ 1993 నవంబర్ 1 న కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలోని 8వ, కాలనీలో స్థాపించబడింది. వైద్యుల మధు ధర్మారెడ్డి (మధుకర్ వైద్యుల ) తన మిత్రులతో కలసి స్థాపించిన ఈ సంస్థ గడచిన 27 సంవత్సరాలుగా అనేక సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలతో పాటు తెలంగాణా సాధన ఉద్యమాలు నిర్వహించింది. ఇటీవలే తన 22వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొంది. ఈ సందర్భంగా మధుకర్ వైద్యుల రాసిన స్వతంత్ర సుమాలు కవిత సంపుటిని కూడా ఆవిష్కరించారు.

1993 నవంబర్ 1న ప్రస్తుత తెలంగాణా రాష్టం లోని కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలోని 8 ఇంక్లైన్ కాలనీలో స్థాపించబడింది. ఆనాటి నుంచి 27 సంవత్సరాలుగా తన కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది.

  • 1996 లో రిజిస్టర్ చేయబడింది. (రి.నెం 4393/96) తక్కువ సమయంలోనే అనేక రకాల కార్యక్రమాల ద్వారా కాలనీ లోనే కాక జిల్లా లోనే ఒక గొప్ప సామాజిక సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. క్రీడాపోటీలు, సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమలతో పాటు తెలంగాణ సాధన ఉద్యమాలు నిర్వహించింది. ఎయిడ్స్, మొక్కలు నాటడం, రక్తదానం, వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
  • 1993-2009 మధ్య కాలంలో సుమారు 2000 కార్యక్రమాలు నిర్వహించిన ఒకే ఒక సంస్థ వసుంధర విజ్ఞాన వికాస మండలి.
  • ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇన్ని సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
  • కాలనీలో లైబ్రరీ ఏర్పాటు, వివేకానంద విగ్రహం ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించిది.
  • సింగరేణి కార్మికుల 7వ వేజ్ బోర్డ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ నుండి గోదావరిఖని వరకు సుమారు 15 కి.మీ పాదయాత్ర చేసి కార్మికుల అభిమానాన్ని పొందింది.
  • తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా కాలనీ నుండి కమాన్ పూర్ మీదుగా సెంటినరీ కాలనీ వరకు సుమారు 20 కి.మీ పాదయాత్ర చేసి ఉద్యమ స్ఫూర్తిని చాటింది.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]