వహీద్ యార్ ఖాన్
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1942 నవంబరు 9||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి బ్యాటింగ్ | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
1960-61 to 1968-69 | హైదరాబాదు క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||
1965-66 to 1968-69 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీం | ||||||||||||||||||||||||||
1969-70 | కరాచీ వైట్స్ | ||||||||||||||||||||||||||
1969-70 to 1975-76 | పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2015 మార్చి 26 |
వహీద్ యార్ ఖాన్ (జననం 9 నవంబరు 1942) తెలంగాణకు చెందిన భారత మాజీ క్రికెటర్. 1960 నుండి 1968 వరకు భారతదేశం తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. 1969 నుండి 1975 వరకు పాకిస్తాన్ తరపున ఆడాడు.
జననం
[మార్చు]ఇతడు 1942, నవంబరు 9న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.
భారతదేశం తరపున
[మార్చు]1957-58 నుండి 1959-60 వరకు కూచ్ బెహర్ ట్రోఫీలో సౌత్ జోన్ పాఠశాలకు వహీద్ యార్ ఖాన్ ప్రాతినిధ్యం వహించాడు. 1959-60లో జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. 1960-61 నుండి 1964-65 వరకు రోహింటన్ బారియా ట్రోఫీలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు.[1]
1960-61లో రంజీ ట్రోఫీలో హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1964-65లో హైదరాబాదు ఫైనల్స్‌కు చేరుకున్నప్పుడు, క్వార్టర్ ఫైనల్‌లో 67 పరుగులు, సెమీ-ఫైనల్‌లో 109 (మొదటి సెంచరీ), బొంబాయి చేతిలో ఓడిపోయినప్పుడు 78, 23 పరుగులతో హైదరాబాదు ఫైనల్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.[2] 1966-67లో చార్లీ గ్రిఫిత్ నేతృత్వంలోని వెస్ట్ ఇండియన్ మ్యాచ్ లో 62 పరుగుల తేడాతో సౌత్ జోన్ తరఫున ఒక మ్యాచ్ ఆడాడు. 1968-69 లో ఆంధ్రా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాదు క్రికెట్ జట్టు తరపున కెనియా జయాన్షియల్ తో కలిసి నాలుగో వికెట్ కు 258 పరుగులు జతచేసి 174 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.[3]
పాకిస్తాన్ తరపున
[మార్చు]1969లో తన తల్లిదండ్రులతో కలిసి పాకిస్తాన్ వెళ్ళాడు. అక్కడ కరాచీ వైట్స్, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. 1970-71లో ఐదు మ్యాచ్‌లలో 68.40 సగటుతో 342 పరుగులు చేశాడు. ఇందులో నేషనల్ బ్యాంక్‌తో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బి తరపున ఆడిన మ్యాచ్ లో 116 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.[4] 1972-73లో లాహోర్ బి క్రికెట్ జట్టుతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తరపున ఆడి 119 పరుగులు (తన చివరి సెంచరీ) చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Miscellaneous matches played by Waheed Yar Khan". CricketArchive. Retrieved 2021-07-23.
- ↑ "Ranji Trophy 1964-65". CricketArchive. Retrieved 2021-07-23.
- ↑ "Andhra v Hyderabad 1968-69". CricketArchive. Retrieved 2021-07-23.
- ↑ "National Bank v PIA B 1970-71". CricketArchive. Retrieved 2021-07-23.
- ↑ "Lahore B v PIA 1972-73". CricketArchive. Retrieved 2021-07-23.