వాడుకరి:Adithya.indicwiki/జర్మన్ నాటక రంగము
పరిచయం
[మార్చు]జర్మనీలో 17వ శతాబ్దం మధ్య వరకూ సాంస్కతిక కార్యకలాపాలకు అనువైన వేదిక ఏర్పడలేదు.మతపరంగా ప్రొటెస్టెంట్లు , కాథలిక్లకు మధ్య ఏర్పడ్డ పరస్పర వైరుధ్యం వల్ల ఆలాగే రాజకీయ అనిశ్ఛితి ,1618లో ప్రారంభ మై 30 సంవత్సరాలు యుద్ధం ఉండడం వల్ల అడుగంటుకుపోయిన ఆర్థికస్థితి మొదలైన కారణంగా సాంఘికజీవనం కకావికలమైనది.[1] ఇలాంటి పరిస్థితుల్లో సాంస్కతికరంగం కూడా అభివృద్ధి ఆగిపోయింది.అయినా కూడా 17వ శతాబ్దానికి పూర్వం జర్మనీలో నాటకరంగప్రక్రియ లేదని కాదు.గ్రీకు ,రొమన్ సాంప్రదాయలకి అనుగుణంగా నాటకవాఙ్మయం ఉండేదని తెలుస్తోంది.నీతిబోధక పద్ధతిలో సాగేటువంటి క్రైస్తవ నాటకాలు ,వ్యంగ్య పరిహాస ధోరణిలో సాగే హాస్యనాటకాలు ఉండేవి.మతాధికారుల నిబంధనల నీడలో ప్రదర్శితమయ్యే ఆ నాటకాలు కొంతవరకు నిర్జీవంగా, నిస్తేజంగా ఉండేవి. అద్భుత, నీతిబోధక నాటకాలలో సాహిత్య విలువలు, నాటకీయత కొరవడి దృశ్యపరంగా రాణించేవి కావు. కాలక్రమేణ ఆ నాటకాలు చర్చి ప్రాంగణాలను దాటి వీధుల్లోకి రావడం జరిగింది. ఈ మార్పు నాటకప్రదర్శన కొత్త రూపుదాల్చడానికి దోహదం చేసింది. మతసంబంధమైన వస్తువుతోపాటు రచయితలు తమ భావనాబలంతో కొత్త తరహా స్వతంత్ర నాటకాలు రాయడానికి పూనుకొన్నారు. మొదట్లో వారి ప్రయత్నం అంతగా ఫలించలేదు . ప్రదర్శనార్హత గల నాటకాలు కాకపోవడమే దానికి కారణం. పాలకులు అనాదిగా వీరగాథలు గానం చేసే బృందాలను, సంగీత రూపకాలను ప్రోత్సాహిస్తూ వచ్చారు. కొత్తదారి ఏర్పడని కాలంలో ప్రజలు కూడా వాటికే అలవాటు పడి ఆదరిస్తూ వచ్చారు.
16వ శతాబ్దాంతంలో
[మార్చు]16వ శతాబ్దాంతంలో వృత్తినాటక సమాజాలేర్పడి ప్రదర్శనలివ్వడం మొదలైంది. వీటికి ప్రాచుర్యం కల్పించిన వారు ఇంగ్లీష్ నటులు , కొంత వరకు ఇటలీ నటులు. ఇంగ్లీషు నటులు మొదటగా జార్జిపీలె, మార్లో , థామస్ కిడ్ ముతక నాటకాలను ప్రదర్శించినా,ఆ తరువాతి కాలంలో షేక్స్పియర్ నాటకాలను కూడా ప్రదర్శించటం జరిగింది. కొన్నాళ్లు ఆంగ్లంలోనే ప్రదర్శనలు జరిపినా,తరువాత ఈ నాటకాలు జర్మన్ భాషలోకి తర్జుమా చేశారు బ్రౌన్ విగ్ డ్యూక్ హీన్ రిచ్ జూలియస్ కొంతవరకు శ్రద్ధ తీసుకొని ఇంగ్లీషు నటులను రప్పించి నాటక సమాజాన్ని నడుపుతూ ఓ పది నాటకాలను రచించాడు. అవన్నీ దాదాపు రక్తసిక్తమైన విషాదాంత నాటకాలు గా ఉన్నాయి.
యంగ్ జర్మనీ ఉద్యమ ప్రభావం
[మార్చు]1830 విప్లవాల తరుణంలో యంగ్ జర్మనీ అనే ఉద్యమం ఒకటి ప్రారంభమయింది. దర్శకులు కొందరు కొన్ని వివాదాస్పదమైన నాటకాలను 1830-40లో ప్రదర్శించారు ఈ నాటకాల్లో ప్రజలెదుర్కొంటున్న రాజకీయ, సాంఘిక విషయ పరిస్థితులను స్పృశిస్తూ సాంఘిక చైతన్యాన్ని కలిగించేవారు. ప్రత్యేకించి ఈ యంగ్ జర్మనీ లోంచి వచ్చినవాడే జార్జి బుష్ నర్. వొయ్ జెక్ నాటక ఇతివృత్తంలో స్వాభావికవాదం, అభివ్యక్తివాదం ఆనాడే తొంగిచూడడంతో రాబోయే తరాలలో ఆవిష్కరింపబడే నాటక శిల్పానికి నాంది పలికాడని 1910లో మాక్స్ రీన్ హార్ట్ పేర్కొన్నాడు.[2] అప్పటి నుండి బుషనర్ 19వ శతాబ్దపు గొప్ప రచయితలలో ఒకడుగా గుర్తింపబడ్డాడు.
19 వ శతాబ్దం లో
[మార్చు]19 వ శతాబ్దంలో జర్మనీ లో నగరాల సంఖ్య పెరగడం వల్ల నాటక రంగ స్థలాల సంఖ్య కూడా పెరిగింది.ఆస్ట్రియా ,ఇంగ్లాండ్ దేశాల లో ప్రభుత్వం సహాయం చేసినట్టుగా జర్మనీ లో నూ ప్రభుత్వ సహాయం మొదలయ్యి నాటక రంగం అభివృద్ది సాధించింది. దీని వల్ల నాటక రంగాలో ఉండే కొంత మందికి కొంత ప్రత్యేక గౌరవం లభించింది.ఆర్థికంగా చాలా అవకాశాలు వచ్చాయి.దీని వల్ల వల్ల వారికి ధనం తో పాటుగా కీర్తి కూడా దొరికాయి.
నటుల వేషభూషణ
[మార్చు]నటుల వేషభూషణ విషయంలో 1725కు పూర్వం జర్మనీలో నటులు ఆడంబరాలకు పోయేవారు కారు. ఒకటో రెండో జతల దుస్తులతోనే ప్రతినటుడూ కొద్ది కొద్ది మార్పులతో ఏ పాత్రనైనా పోషించేవారు. నాటక బృందం యజమాని ప్రతి నటుడికీ ఒక కోటు, వేయిస్ట్ కోటు మాత్రమే సమకూర్చేవాడు. నాటకం లో నాయకుడు మాత్రం ఒక స్కార్ఫ్, ఒక హెల్మెట్ ధరించేవాడు. అదే నటి విషయంలోకి వచ్చే సరికి చాలా అందమైన దుస్తులు ధరించేది. దుస్తులపై కాగితపు లేస్ లొ 1800 సంవత్సరానికి చాలా మార్పులు వచ్చాయి. ప్రతిపాత్రకు న సరిపోయే దుస్తులు, సామాగ్రి సమకూర్చడం ఆచారమైంది.
1945 సమయం లో
[మార్చు]1945లో జర్మనీ మిత్రరాజ్యాలకు లోబడిపోవడంతో థియేటర్లు ఎక్కువగా మూతబడ్డాయి. అయినా 1960 నాటికి మళ్ళీ పుంజుకుని శక్తివంతంగా నాటక ప్రదర్శనలు చేయగలిగాయి. 1945లో జర్మనీ రెండుగా విడిపోయినా తూర్పు, పశ్చిమ జర్మనీల రెండింటిలోనూ నాటకరంగానికి ప్రభుత్వాలు చేయూత నిచ్చాయి. పశ్చిమ జర్మనీలో 150 వృత్తి నాటక సమాజాలు ఏర్పడగా, తూర్పు నీలో 135 వెలిశాయి. ప్రతి నగరంలోనూ ఒక నాటక కంపెనీ ఉండేది. ప్రపంచ సంగ్రామంలో 100కి పైగా థియేటర్ భవనాలను కూల్చివేయడం జరిగింది. 1950 తరువాత అవన్నీ మళ్ళీ పునరుద్భవించాయి కొత్త సదుపాయాలతో పశ్చిమ బెర్లి లోని షిల్లర్ థియేటర్ 1951లో తిరిగి ప్రారంభమైనపుడు అందులో భ్రమణ రంగ స్థలం, ఎలివేటర్లు, రోలింగ్ ప్లాట్‌ఫాం మొదలైనవి సమకూర్చారు[3]