వాడుకరి:Bhagyalaxmi Chidipudi
|
వాడుకరి బేబెల్ సమాచారం | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
| ||||||||
భాషల వారీగా వాడుకరులు |
పేరు: భాగ్యలక్ష్మి చిడిపూడి
[మార్చు]నమస్కారాలు, నేను వికీపీడియా ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నాను..! నా పేరు భాగ్య లక్ష్మి చిడిపూడి. నా వయస్సు 30 సంవత్సరాలు. భారత్ లోని .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన . ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలో నేను జన్మించాను. ఇక్కడికి దగ్గరలోని తిరుమల ఏడుకొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. శ్రీవెంకటేశ్వర స్వామిని లార్డ్ బాలాజీ అని కూడా పిలుస్తారు.
ఏటా దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే ఆలయంగా తిరుపతి-తిరుమల ఆలయానికి
గుర్తింపు ఉంది. నా మాతృభాష తెలుగు. నేను మా ఊరిలో ప్రాథమిక విద్యను పూర్తి పూర్తి చేసుకున్న తర్వాత నా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నఆలోచనతో భారత్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో నేను నా బి.ఎ. డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం క్లర్క్ గా పనిచేస్తున్న నేను వృత్తి రిత్యా భారత్ లోని మహారాష్ట్ర లోని నాగపూర్ నగరంలో నివాసముంటున్నాను.
ఈ ఊరికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మహారాష్ట్రకు నాగ్ పూర్ రెండో రాజధానిగా గుర్తింపు పొందింది. మహారాష్ట్రలో జనాభా పరంగా ఇది మూడో అతి పెద్ద నగరం. మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రతి సంవత్సరం నాగపూర్ లోనే జరుగుతాయి.
నాగ్ పూర్ ను భారత దేశపు పులుల రాజధాని అని కూడా పిలుస్తారు. మానవ జీవన మనుగడకు అత్యంత అనుకూల ప్రాంతంగా నాగ్ పూర్ నగరానికి గుర్తింపు ఉంది. ప్రస్తుతం క్లర్క్ గా పనిచేస్తున్న నేను ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నాను.
పుస్తకాలు చదవడం, ఆటల వంటివి నా హాబీలు . వికీపీడియా ద్వారా నా గురించి ఎప్పటికప్పడు మీకు సమాచారం అందించాలని, విశేషాలను షేర్ చేయాలనే ఉద్ధేశ్యంతో నేను మీ ముందుకు వచ్చాను.
వికీపీడియా పేజీల్లో పని
[మార్చు]