వాడుకరి:Chaduvari/బొమ్మల కోసం వెతుకులాట
Jump to navigation
Jump to search
వ్యాసంలో చేర్చేందుకు బొమ్మ కోసం చూస్తున్నారా..? |
బొమ్మలు తెవికీలోనైనా ఉండవచ్చు, కామన్సులోనైనా ఉండవచ్చు. బొమ్మ ఎక్కడ ఉన్నా చేర్చే పద్ధతి ఒకటే |
1. ముందు వ్యాసం పేజీని తెరిచి అందులో బొమ్మ లేదని నిర్ధరించుకోండి. |
ఆ తరువాత ఆ పేజీకి ఉన్న అంతర్వికీ లింకుల్లో ఇంగ్లీషు వ్యాసం లింకును నొక్కండి. |
ఇంగ్లీషు వ్యాసం పేజీలో బొమ్మ లేకపోతే ఇక ఈ పద్ధతిలో ముందుకు వెళ్ళలేరు. కానీ అందులో బొమ్మ ఉంటే.. |
ఆ బొమ్మపై డబుల్‌క్లిక్కు చెయ్యండి. బొమ్మ ఒక్కటే పేజీలో తెరుచుకుంటుంది. ఆ పేజీలో కుడివైపు కింద "More details" అని కనిపిస్తుంది. |
దానికి ముందు ఉన్న బొమ్మ కామన్సు లోగో ఉంటే, ఇక ముందుకు సాగవచ్చు. ఆ బొమ్మ ఫైలు పేరును కాపీ చేసుకోండి |
ఇక, తెలుగు వికీలోని పేజీకి వచ్చి దాన్ని దిద్దుబాటు పద్ధతిలో తెరవండి. |
"చొప్పించు" మెనూలో "మీడియా" ఉపమెనూను నొక్కి, అప్పుడు వచ్చే డయలాగు పెట్టెలో మీరు కాపీ చేసుకున్న బొమ్మ ఫైలు పేరును ఇవ్వండి. |
bఒమ్మకు తగిన వ్యాఖ్యను రాయండి. ఇంగ్లీషు వికీలో ఉన్న వ్యాఖ్యను గైడుగా కోసం తీసుకోండి. |
మార్పును ప్రచురించు ను నొక్కి, దిద్దుబాటు సారాంశాన్ని రాయండి. |
సారాంశంలో #WPWPTE #WPWP అనే హ్యాష్‌ట్యాగులను చేర్చండి. నమూనా సారంశం ఇలా ఉంటుంది - "బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP" |
దిద్దుబాటు సారాంశం రాయడం, అందులో హ్యాష్‌ట్యాగులను చేర్చడం తప్పనిసరి. అది లేకపోతే, మీ దిద్దుబాటును పోటీ లోకి పరిగణించదు. |