వాడుకరి:JVRKPRASAD/పతకాలు-1
స్వరూపం
పతకాలు
మొదటి లక్ష మార్పుల బార్న్ స్టార్ | |
రామకృష్ణ ప్రసాద్ గారూ, మీరు తెవికీలో రైల్వే వ్యాసాలతో పాటు అనేక హిందూ మత వ్యాసాలను చేర్చడమే కాకుండా నిర్వాహకునిగా విశిష్ట సేవలందించారు. స్వచ్ఛవికీలో భాగంగా అనేకమైన దోషాలను సరిదిద్ది తెవికీ దేవాలయాన్ని పరిశుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూలాలు లేక అనాథలుగా ఉన్న కొన్ని వేల వ్యాసాలకు మూలాలను చేర్చి వాటికి జీవం పోసారు.అనేక వ్యాసాలకు లింకులను చేర్చే కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా చేస్తున్నారు. అలుపెరుగక నిరంతర కృషితో మీరు చేసే ఈ కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. తెవికీలో మొట్టమొదటి సారిగా 1,00,000 దిద్దుబాట్లను చేసినందుకు ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒చర్చ 02:17, 14 సెప్టెంబరు 2015 (UTC) |
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార పతకం-2013 | |
జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ, తెలుగు వికీపీడియా మరియు విక్షనరీలలో కొత్త సభ్యులను ఆహ్వానిస్తూ ప్రోత్సహించిన కృషి అభినందనీయం. విక్షనరీలో అనేక వేల పదాలు చేర్చి, బ్రౌణు నిఘంటువుల పదాలకు సవరణలు చేసి విశేష కృషి చేశారు. 2011 లో వికీపీడియాలో వ్యాస మరియు వ్యాసేతరములలో టాప్ 10 లో ఒకరుగా నిలచి, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
గ్రామ సమాచార విస్తరణ పతకం | |
JVRKPRASAD గారూ! కృష్ణా, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల గ్రామ వ్యాసాల్లో జనగణన సమాచారం అభివృద్ధి చెందడానికి మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందుకోండి--పవన్ సంతోష్ (చర్చ) 06:40, 3 జనవరి 2018 (UTC) |
తెలుగు మెడల్ | |
వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:56, 16 ఆగష్టు 2013 (UTC) |
2012 వ్యాసేతర | |
2012లో అధిక వ్యాసేతర మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
2011 వ్యాస బార్న్ స్టార్ | |
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
2011 వ్యాసేతర బార్న్ స్టార్ | |
2011లో వ్యాసేతరములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
నిరంతర కృషి పతకం | |
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం. విశ్వనాధ్ |