వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల/పుస్తకాలు
Jump to navigation
Jump to search
- హాస్యరచయితగా పేరుపొందిన భమిడిపాటి కామేశ్వరరావు గొప్ప పరిశోధకులన్న విషయం ఈరోజే తెలిసొచ్చింది. త్యాగరాజు ఆత్మవిచారం పుస్తకం హార్డ్ కాపీయే నా దగ్గరున్నా రచయిత గురించి సరిగా చూడలేదు. ఇప్పుడు ఏకంగా ఆంధ్ర నాటక పద్యపఠనము అన్న అపురూపమైన గ్రంథాన్ని ఆయన వ్రాశారన్న సంగతి చూశాను. సమయం చూసుకుని ఇది చదివి చూడాలి. కాశీ కృష్ణమాచార్యులు, మధునాపంతుల వారు వంటివారు ఆయన సాహిత్యమంతా ఒకయెత్తు ఇది మరొక యెత్తన్నారంటే చాలా విశేషమైన గ్రంథమే అయివుండాలి. నాకూ ఈ విషయమంటే చాలా ఆసక్తిగానే వుంది. ఇలాంటి అంశంపై తెలుగు పరిశోధకులొకరు పుస్తకమే వ్రాశారంటే విశేషమే ఎలాగైనా.--పవన్ సంతోష్ (చర్చ) 12:24, 21 మార్చి 2015 (UTC)
- గిడుగు సామాన్యులు కాదు. ఆయన ప్రభావంలేని తెలుగు రచయితలు ప్రస్తుతం లేరనే చెప్పాలి. ఆయన వ్రాసిన చక్కని గ్రంథాల్లో బాలకవిశరణ్యం ఒకటి. బాలకవి శరణ్యము గిడుగు వ్రాసిన లక్షణ గ్రంథం. తాను ప్రారంభించిన వ్యావహారికోద్యమంలో భాగంగా ఆయన కొత్తతరం కవుల కోసం వ్రాసిన లక్షణ గ్రంథంలో గ్రాంథికవాదులు అసాధువుల, వర్జనీయాలని వ్రాసిన కొన్ని పదాలకు పూర్వకవుల ప్రయోగాలు చూపి తిప్పికొట్టారు. అలాంటి పుస్తకం దొరికింది ఇప్పుడు. --పవన్ సంతోష్ (చర్చ) 06:49, 22 మార్చి 2015 (UTC)