వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఆ" వ్యాసాలు[మార్చు]

చంద్రకాంతరావు గారూ, నేనా మధ్య తెవికీ వైపు సరిగా రాలేదు. కాబట్టి ఆ ఆనానిమిషులు ఏ ఏ వ్యాసాలు సృష్టించారో సరిగా గమనించలేదు కూడాను. గమనించిన వాటిని నేను సరిచేశాను కూడా. ఇంకా సరిచేయకుండా ఉన్నవాటిని, వాటిని సృష్టించిన సభ్యులను ఎత్తిచూపండి అని రచ్చబండ చర్చలో అడిగాను. --వైజాసత్య 20:48, 28 నవంబర్ 2008 (UTC)

వైజాసత్య గారు, నేను మొదటి నుంచీ చెబుతున్నాను తెవికీ పాలసీలు సంపూర్తిగా లేవని. అసలు ఆ వ్యాసాలను నేనే తుడిచివేద్దామను కున్నాను. కాని సరైన పాలసీలు లేని కారణంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఇతర సభ్యుల మద్దతుతో ఆ పని చేస్తే బాగుంటుందని చర్చ లేవదీశాను. నియంతగా వ్యవహరించి ఆ వ్యాసాలను తొలిగిస్తే ఇంతవరకు వచ్చేది కాదేమో? నిర్వాహకులు తెవికీ నిర్వహణకై కృషిచేయాలంటే సరైన పాలసీలు అవసరం. లేకుంటే పనికి రాని చెత్తను తొలిగించే పారిశుద్ధ కార్మికులుగానే నిర్వాహకులు మిగిలిపోతారు. తెవికీలో ప్రకటనలకు, ప్రచారానికి స్థానం ఉండరాదు అని అందరికీ తెలిసిందే. మరి కేవలం తన ప్రచారానికి వచ్చి వ్యాసాలు చేరిస్తే మనమెందుకు ఊరకుండాలి? అతని ఉద్దేశ్యం నేను ప్రారంభంలోనే గ్రహించాను. అతడు కొత్త సభ్యుడేమీ కాడు అన్నీ తెలిసినట్లు ప్రవర్తించాడు. ఇదివరకే సభ్యత్వం కూడా ఉండవచ్చు అందుకే మళ్ళీ సభ్యత్వం తీసుకోకుండానే ఐపి అడ్రస్‌తో రచనలు చేశాడు. తెవికీని గందరగోళం చేయడం, సభ్యుల మధ్య అభిప్రాయబేధాలు సృష్టించడం అతని ఉద్దేశ్యం కావచ్చు. ఇకనుంచైనా అలాంటి సభ్యుల రాతలను మొదట్లోనే తొలిగిస్తే బాగుంటుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:14, 29 నవంబర్ 2008 (UTC)
చంద్రకాంతరావు గారూ! మీమీద ఒక అనామకుడు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నపుడు నేను చూస్తూ ఊరకుండలేదు. ఆసభ్యునికి హెచ్చరిక కూడా జారీచేశాను. ఇక్కడ నేను చేయాల్సిన భాధ్యత నెరవేర్చాననుకుంటున్నాను. ఇంకాస్త ఘాటుగా నిర్ణయం తీసుకుంటే తొందరపాటు నిర్ణయం అవుతుందని సందేహించాను తప్ప సదరు అనామక సభ్యుని పట్ల ఉదాసీనతతో వ్యవహరించలేదు. మీరు తిరిగి క్రియాశీలకం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రవిచంద్ర(చర్చ) 04:23, 1 డిసెంబర్ 2008 (UTC)
కొత్తవారితో సంయమనం పాటించాలి అన్న సూచనమేరకు నిర్వాహకుల కాస్త దుడుకుగా వ్యవహరించకుండా జాగ్రత్తపడటం మామూలే. వికీ నిర్వాహకులు కొన్నిసార్లు పారిశుద్ధ కార్మికులుగా తయారవ్వాల్సి వస్తుందన్నది నిజం. వికీలాంటి సమిష్టికృషిలో కొంత ఇలాంటి తలనొప్పులు తప్పవు. ఉదాహరణకు: టెంకాయ అనే సభ్యుడు వివిధ నటీమణులపై చిన్న ఒకటి రెండు వాక్యాల పేజీలు ఒక రెండొందలు సృష్టించాడు. అతన్ని అలా సృష్టించకూడదు అని ఆపివేయలేం. అతను నిజానికి అవన్నీ విస్తరించాలని సృష్టించాడని అనుకుందాం. ఇప్పుడు ఆ రెండొందల పేజీలకు మొలకలని మూసలంటించడం, తొలగించాలా వద్దా అని నిర్ణయించడం, తొలగించడం ఇన్ని పనులూ నిర్వాహకుల మీదే పడుతున్నాయి. మీరన్నట్టూ ఈ దుబారా పనులు లేకుంటే నిర్వాహకులు ఇంకేదైనా నిర్మాణాత్మక పనుల్లో తమ సమయాన్ని వినియోగించేవారు. తెవికీని అర్ధం చేసుకొని, సదరు సభ్యులు కాస్త పరిణితి సాధించేవరకు పట్టువిడుపుగా వ్యవహరించాలి. అసలు ఎదో ఒకటి వ్రాయటమే గొప్ప అన్న స్థాయి నుండి వచ్చిన తెవికీలో మొదట్లో చాలా నిబంధనలను కాస్త సడలింపు ఇచ్చిన మాట నిజమే. ఇప్పటికీ ఆంగ్లవికీ స్థాయిలో ఇక్కడ పాలసీలు లేవు ఎందుకంటే ఇంకా తెవికీ ఆ స్థాయికి చేరలేదు. ఆంగ్లవికీలో కూడా అభివృద్ధితో పాటే పాలసీలు అభివృద్ధి చెందాయి. ఇక్కడా ఒక్కొక్క స్థాయిలో పునఃసమీక్ష చేసుకుంటూ మనకు తగిన పాలసీలు మనం చేసుకోవాలి. రెండు మూడు సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు తెవికీలో మరింత స్పష్టమైన (ఫర్ఫెక్ట్ అని కాదు) పాలసీలున్నాయి. పాలసీల్లో ఎక్కడ తెరపి (గ్యాప్) కనిపించిందో, దానికి ఏ విధమైన నిర్ణయాలు చేయాలో వ్రాయండి. వాటిని చర్చించి కొత్త పాలసీలు ప్రవేశపెడదాం. వ్యక్తిగత వ్యాఖ్యలు, ప్రకటనలనూ తెవికీ సభ్యులు ఎప్పుడూ సహించినట్టు నాకు గుర్తులేదు. ఎప్పటికప్పుడు కఠినంగానే చర్యలు తీసుకున్నాం. అలాంటి సభ్యులను బహిష్కరించడానికి కూడా నిర్వాహకులు వెనుకాడలేదు. అవసరమైనప్పుడు ఉపయోగించని అధికారాలు ఎందుకు? మీరు నిస్సంశయంగా చర్యలు తీసుకోవచ్చు. (కొత్తసభ్యులను కూడా చొరవగా రచనలు చెయ్యండి అని ప్రోత్సహిస్తున్నాం కదా) మీ చర్యలను ఇతర నిర్వాహకులు కానీ సభ్యులు కానీ విభేదిస్తే అప్పుడు దాని గురించి చర్చించవచ్చు. నిర్వాహకుల నోటీసుబోర్డును ఉపయోగించండి. అభిప్రాయబేధాల గురించి జంకవద్దు. నలుగురు కలిసి పనిచేసేచోట అవి మామూలే. అందరం తెలుగు వికీపీడియా అనే మహా విజ్ఞానసర్వస్వానికి సదుద్దేశ్యంతో కృషిచేస్తున్నామన్న ఒక్క విషయం చాలు మనం కలసికట్టుగా పనిచేయటానికి. తిరిగి క్రియాశీలకంగా తెవికీలో కృషిచేస్తారని ఆశిస్తున్నాను. --వైజాసత్య 06:05, 1 డిసెంబర్ 2008 (UTC)
టెంకాయ లాంటి సభ్యులు సృష్టించిన చిన్న వ్యాసాలు పెద్ద సమస్య కాదు. వాటిని ఉంచడమో, తుంచడమో చేయవచ్చు. చిన్న వ్యాసాలపై నేను గతంలో చాలా సార్లు చర్చ లేవనెత్తాను. కాని ప్రస్తుత సమస్య వాటికి బిన్నమైనది. ఇందరు నిర్వాహకులు, చురుకైన సభ్యులు ఉండి కూడా ఒక అనామక సభ్యుడి అనవసర రాతలను ఆపలేకపోవడమే చిన్నతనమనిపిస్తుంది. సభ్యుడిని హెచ్చరించినా ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడమే బాధకలుగుతుంది. నేనూ వందలాది కొత్త సభ్యులను ఆహ్వానించాను. కొత్తవారికి సలహాలు, సూచనలు ఇచ్చాను. కొత్త సభ్యులకు నేను వ్యతిరేకిని కాను. తెవికీ అభివృద్ధికి నావంతు కృషిచేశాను. అయినా సీనియర్ నిర్వాహకులు నా వాదాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నేను వ్యాసాలు చేరుకోవడానికి వీలుగా ఉంటుందని వర్గాలు సృష్టిస్తే కొందరికీ అవి లోతుగా అనిపించి నా చర్చా పేజీలోనే రాశారు. మరి ఒక అనామక సభ్యుడు అర్థం లేని వర్గాలు సృష్టిస్తే ఏ లోపం కనిపించలేదు! నేను కేవలం వ్యాసాలు తొలిగించాలని చర్చ తీస్తే ఏకంగా ఓటింగుకు పెట్టి, అర్థాంతరంగా (వారం రోజులు కాకుండానే) తొలిగించు మూసలను తొలిగించి ఓటింగు పూర్తయినట్లు చేయడమెందుకు? ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నా మీదే కక్ష్య ఎందుకో? -- C.Chandra Kanth Rao(చర్చ) 13:37, 1 డిసెంబర్ 2008 (UTC)
చంద్రకాంతరావు గారూ, మీరు సభ్యుల వెల్లువ వచ్చినప్పుడు వందలమంది కొత్త సభ్యులను ఆహ్వానించి మార్గదర్శకం చేసిన విషయం నాకు బాగా జ్ఞాపకం ఉంది. కొత్త సభ్యులకంటే కాస్త వికీలో అనుభవమున్నవాళ్ళతో మొహమాటం లేకుండా మాట్లాడటం మామూలే. అవన్నీ మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దని నా అభ్యర్ధన. చర్చా పేజీల సంభాషణల్లాంటి అప్రత్యక్ష మాధ్యమంలో ఒకరు వ్రాసింది ఇంకొకరు అపార్ధం చేసుకోవటం సులువుగా జరుగుతుంటుంది. ఇక ఈ అనానిమిషుని మార్పులుచేర్పులను వెనక్కి వెళ్ళి పరిశీలించడానికి నాకు కొంత సమయం ఇవ్వండి. --వైజాసత్య 21:11, 1 డిసెంబర్ 2008 (UTC)
  • చంద్రకాంతరావు గారూ, మీరు ఊహించింది నిజమైనది, మీరు 'ఎవరికోసం ఈ వ్యాసాలు' అని రచ్చబండలో వ్రాసినపుడు, మొదట ప్రతిస్పంచింది ఏకీభవించింది నేనే. ఆఖరుకు ఎంత గడబిడ జరుగుతున్నదో చూడండి. ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించకపోతే, తెవికీ సభ్యుల ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. నిసార్ అహ్మద్ 17:29, 5 డిసెంబర్ 2008 (UTC)
నిస్సార్ గారు! మీరన్నది నిజమే. నా చర్చకు మొట్టమొదట ప్రతిస్పందించినది కూడా మీరే. అప్పుడే సమస్యను పరిష్కరిస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఎవరు ఎలాంటి వారో కొన్ని రచనల్లోనే తెలుస్తుంది. "గడప తొక్కినప్పుడే ........" అనే సామెత మనకు తెలిసిందే కదా. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:37, 5 డిసెంబర్ 2008 (UTC)
చంద్రకాంత రావు గారు, మీరు సెలవు తీసుకోవడం నిసార్ గారు సెలవుతీసుకోవడం చాలా దురదృష్టకరం. దయచేసి ఆ ఆలోచన మానుకోమని ప్రార్థన. నెల రొజుల క్రితమే ఇలా జరగడాన్ని ఊహించి మనము తగిన చర్యలు తీసుకోమని చెప్పినా ఫలితం లేకపోయింది. మళ్ళీ అదే అలసత్వం, నిర్లక్ష్యం చోటు చేసుకోబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికయినా మించిపోయినది లేదు. మీరు వెంటనే వివాదాస్పద వ్యాసాలను తొలగించి, తగిన చర్యలు తీసుకొని నిర్వాహకుడి బాధ్యతను నెరవేర్చి తద్వారా నిర్వాహకుడు అన్న పదానికి అర్థాన్ని, విలువను నిలబెట్టమని అభ్యర్థిస్తున్నాను. --Svrangarao 19:35, 5 డిసెంబర్ 2008 (UTC)

వివాదాస్పద వ్యాసాల తొలగింపు[మార్చు]

చంద్రకాంత రావు గారు, మీరు సెలవు తీసుకోవడం నిసార్ గారు సెలవుతీసుకోవడం చాలా దురదృష్టకరం. దయచేసి ఆ ఆలోచన మానుకోమని ప్రార్థన. నెల రొజుల క్రితమే ఇలా జరగడాన్ని ఊహించి మనము తగిన చర్యలు తీసుకోమని చెప్పినా ఫలితం లేకపోయింది. మళ్ళీ అదే అలసత్వం, నిర్లక్ష్యం చోటు చేసుకోబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికయినా మించిపోయినది లేదు. మీరు వెంటనే వివాదాస్పద వ్యాసాలను తొలగించి, తగిన చర్యలు తీసుకొని నిర్వాహకుడి బాధ్యతను నెరవేర్చి తద్వారా నిర్వాహకుడు అన్న పదానికి అర్థాన్ని, విలువను నిలబెట్టమని అభ్యర్థిస్తున్నాను. --Svrangarao 13:20, 8 డిసెంబర్ 2008 (UTC)

రంగారావు గారు, నిర్వాహకుడైనంత మాత్రాన నిర్వాహక అధికారాలు ఇష్టమున్నట్లు ఉపయోగించడానికి వీలుండదు. పాలసీలు లేదా సభ్యుల మెజారిటీతోనే చేయాల్సి ఉంటుంది. అందుకే తెవికీ పాలసీల గురించి ఎప్పుడో చెప్పాను. సరైన పాలసీలు లేవు మరియు తోటి సభ్యులు స్పందించరు. ఈ పరిస్థితుల్లో నిర్వాహకులు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోవాల్సి ఉంటుంది. అప్పుడప్ప్పుడు కొత్త సభ్యులు చేర్చిన చెత్తను తొలిగించడం తప్ప ఏమీ చేయలేము. నాపై మీకున్న అభిమానము, గౌరవము, నమ్మకమునకు మరోసారి కృతజ్ఞతలు. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:34, 11 డిసెంబర్ 2008 (UTC)
ఒక వ్యాసం మీ దృష్టిలో వివాదాస్పదమైనంత మాత్రాన ఎందుకు తొలగించాలి అనుకుంటున్నారో ఇప్పటికీ అర్ధం కాలేదు. అసలు ఒక వ్యాసాన్ని వివాదాస్పదమనుకోవటం కూడా ఒక దృష్టికోణమేనని ఎందుకు గుర్తించట్లేదు? వాటి ప్రయోజనం ఏవిటీ అన్నారు? అవతలి వాళ్ళు అదే ప్రశ్న వేసినప్పుడు మనమేం సమాధానం చెబుతాం? సభ్యుడు వ్యక్తిగత వ్యాఖ్యలు చేశాడు అన్నారు. వాటిని ఖరాఖండిగా ఖండించాం, మందలించాం వినకపోతే బహిష్కరించాం. వికీ సముద్రం లాంటిది అందరికీ చోటుంది. మీరూ మీకిష్టమైన వ్యాసాల్లో పనిచేయండి. ఏ సభ్యున్ని ఇప్పటివరకు ఫలానా వ్యాసం సృష్టించవద్దు అని చెప్పలేదు. ఇప్పుడే ఎందుకు కొత్తగా వచ్చింది? తెలుగు వికీ పరిధికి చాలా దూరంగా ఉన్నాయి అంటున్నారు. తెలుగుకు పెద్దగా సంబంధంలేని అరేబియా వ్యక్తుల గురించి వ్రాసినప్పుడు ఈ దుమారాలు ఎందుకు చెలరేగలేదు. నేను ఆ ఆజ్ఞాత వ్యక్తిని సమర్ధించడంలేదు. మనం అంగీకరించకపోయినా కానీ ఎదుటివారికి కూడా తమవాదనను వినిపించే హక్కుందని భావిస్తాను. నేను మీ పక్షమే అని గుర్తించుకుంటారని ఆశిస్తాను. తెవికీ నుండి మీలాంటివారు తప్పుకోవటం ఎదుటిపక్షాన్ని ఇంకా బలపరుస్తుందే కానీ బాలెన్స్ చెయ్యదు. కొన్ని రోజులు వికీ నుండి సెలవు తీసుకొని తిరిగిరండి. --వైజాసత్య 05:46, 12 డిసెంబర్ 2008 (UTC)
ఆ వ్యాసాలను కేవలం నా దృష్టిలోనే వివాదాస్పదమైనవని ఎందుకనుకుంటున్నారో నాకు ఇప్పటి వరకు అర్థం కావడం లేదు. నేనెప్పుడూ నా గురించి ఆలోచించలేదు. తెవికీ ప్రయోజనాల కొరకే ఆ చర్చ తీశాను కాని అందరు అది నా సమస్యగానే భావించారు. సభ్యుడిని బహిష్కరించడం బాగానే ఉంది కాని అదేదో అప్పుడే చేస్తే ఇంకా బాగుండేది అయినా మారు పేర్లతో మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు ఇప్పుడేం చేస్తున్నాం. ఎవరినీ వ్యాసాలు సృష్టించవద్దని చెప్పలేం కాని ఎలాంటి వ్యాసాలు వ్రాయరాదో పాలసీలుంటే బాగుంటుంది. అరేబియా వ్యక్తుల గురించి, కేవలం యూరోపియన్ భావాల గురించి వ్రాసిన వాటికి కూడా నేను ఖండించాను. వాటి అవసరం తెవికీకి లేనప్పుడు వాటిని ఇప్పుడైనా తొలిగించడమే మేలు. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:36, 12 డిసెంబర్ 2008 (UTC)

పున॰ ప్రవేశం[మార్చు]

చంద్రకాంతరావుగారూ, నమస్తే, కుశలమా! మాకినేని ప్రదీపుగారు, కాసుబాబుగారు, వివాదాస్పద వ్యాసాలకొరకు కొన్ని పాలసీలు తయారు చేయడానికి శ్రీకారం చుట్టారు, అవి బాగున్నాయి. మీరునూ రంగ ప్రవేశం చేసి, తెవికీకి పట్టిన బూజును దులపండి. సోదరుడు నిసార్ అహ్మద్ 04:36, 14 డిసెంబర్ 2008 (UTC)

నిసార్ అహ్మద్ గారు, నాపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు. నేను తెవికీ నుంచి శాశ్వతంగా తప్పుకోలేను, అలా చేసే అవసరం కూడా లేదు, నేను తెవికీ విరామంలో ఉన్ననంతే. ఇక మీరు చెప్పినట్లు పాలసీలను తయారుచేయడం, బూజు దులపడం నాకు వచ్చుకాని నేను తయారుచేసిన లేదా ప్రతిపాదించిన పాలసీలను సభ్యులు ఎంతవరకు ఆమోదిస్తారనేదే ప్రశ్నార్థకం! "నా ప్రతిపాదనకు" సభ్యులు ఎలా ప్రతిస్పందించారో తెలుసుకదా! -- C.Chandra Kanth Rao(చర్చ) 20:18, 20 డిసెంబర్ 2008 (UTC)

ఆవేదన[మార్చు]

చంద్రకాంత్ రావుగారూ మీ అవేదన అర్ధమైంది.నాదీ అలాంటి పరిస్థితే.వైజాసత్యగారూ లేకపోతే తెలుగు వీకీ లేదు ఆయన లేకుంటే మనమెవ్వరం ఇంత చక్కగా పనిచేయలేము.అనామక సభ్యుని చర్యలు అత్యంత విచారకరం.ఆ సభ్యునిపై ఎటువంటి చర్యతీసుకున్నా పరవాలేదు.మీరు పంపిన సందేశంలోని ప్రతి అక్షరంతో నేను ఏకభవిస్తున్నాను.--t.sujatha 09:37, 28 డిసెంబర్ 2008 (UTC)

నా చర్చ పేజీలో మీరు వ్రాసింది చూసాను - తెవికీలో పరిస్థితుల గురించి నాకు అట్టే అవగాహన లేదు. ఐతే, తెవికీ అందరిదీ కావున సరియైన వ్యాసాలు అసంబద్ధమైన కారణాలతో తొలగించడం (ఒక వేళ అలా జరిగిన పక్షంలో) తగదు. తెవికీ ఎవడబ్బ సొమ్మూ కాదు - ఎవరైనా సరిగ్గా నడుచుకోకపోతే వారిని తెవికీ నుండి బహిష్కరించే అధికారం నిర్వాహకులకు తప్పక ఉంటుంది. బహిష్కృతులు వ్రాసే వ్యాసాలను తొలగించే (అవి సరిగ్గా ఉన్నప్పటికీ) అధికారం కూడా వారికి ఉంటుంది. ఐతే, ఆ వ్యాసాలను తొలగించేటప్పుడు తప్పక కారణం తెలియచేయాలి. --Gurubrahma 11:17, 28 డిసెంబర్ 2008 (UTC)
వికీ వైఖరికి వ్యతిరేకంగా, సభ్యులను కించపరిచే విధంగా, మతవిశ్వాసాలకు వ్యతిరేకంగా, రెచ్చగొట్టే వ్క్యాఖ్యలు చేయడం తదితర కారణాలపై సదరు సభ్యుడికి పలు మార్లు కోరిననూ ఫలితం లేదు. చివరికి వైజాసత్య గారు సభ్యుడిని నిషేధించి, నియమవిరుద్ధమైన వ్యాసాలనే తొలిగించారు. అతడు వైజాసత్యకు వ్యతిరేకంగా, తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వ్రాశాడు. ఇదంతా గత కొద్దిరోజుల నుండి జరుగుతున్నది. ఆ సభ్యుడు మీ చర్చా పేజీలో వైజాసత్యగారికి వ్యతిరేకంగా సందేశం ఇచ్చినందుకే నేను దాన్ని ఖండిస్తూ సందేశం పంపాల్సి వచ్చింది. మీరు చెప్పినట్లు తెవికీ ఎవరి సొంతం కాదు కాని దీనికీ నియమనిబంధనలు ఉన్నాయి. ఎవరైనా సరే ఆ పరిధికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 11:26, 28 డిసెంబర్ 2008 (UTC)
  • చంద్రకాంతరావు గారూ, తెవికీ శ్రేయస్సు కొరకు మీరు పడే తాపత్రయానికి నా సలాములు. పైజాసత్యగారి పట్ల మీరు ఉదహరించిన వాక్కులు అక్షరసత్యాలు. నేను మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. నిసార్ అహ్మద్ 16:43, 28 డిసెంబర్ 2008 (UTC)
  • నాకు సాధ్యమైనంతవరకు సదరు సభ్యుడు అనుచితంగా ప్రవర్తించినపుడల్లా హెచ్చరిస్తూ అతను క్రియేట్ చేసిన సాక్ పప్పెట్లను నిరోధిస్తూ వచ్చాను. ఇప్పటి దాకా ఆరు సాక్ పప్పెట్లను నిరోధించాను. అతనికి టాటా ఇండికాంలో తెలిసిన వాళ్ళుండటం చేత. అతన్ని బ్లాక్ చేసిన ప్రతీసారి కొత్త ఐపి అడ్రసుతో మార్పులు చేస్తున్నాడు. అతని మీద ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా లేదా అతన్ని శాశ్వత బహిష్కారం చెయ్యడానికి ఏదైనా మార్గం ఉన్నదా అన్నది మెటా లోని స్టీవార్డ్ లను అడగాలి. ఈ విషయమైన రెండు వారాల ముందుగానే వైజాసత్య గారికి ఈ మెయిల్ పంపి ఉన్నాను. రవిచంద్ర(చర్చ) 04:47, 29 డిసెంబర్ 2008 (UTC)
పైన స్పందిన సభ్యులందరికీ కృతజ్ఞతలు. దాదాపు రెండు నెలల క్రితం నేను తీసిన చర్చ సరైనదేనని ఇప్పటికైనా సభ్యులు గ్రహించినందుకు సంతోషం. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:00, 29 డిసెంబర్ 2008 (UTC)

కృతజ్ఞుడిని[మార్చు]

చంద్రకాంతరావుగారూ నమస్తే, మీ ఆత్మీయతాభావనలతో కూడిన వ్యాఖ్యలు నాకు మధురస్మృతులు. నా నిర్వాహక హోదా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞుణ్ణి, ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ 19:06, 20 జనవరి 2009 (UTC)