వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూసల అతికింపు[మార్చు]

వైజాసత్య గారు, 19వ శతాబ్దం‎ మరియు 20వ శతాబ్దం‎ మూసలను ఆయా పేజీలలో బాటు ద్వారా అతికించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:25, 3 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ మధ్య ఇంట్లో ఇంటర్నెట్టు లేక ఆ పని చేపట్టలేకపోయాను. రెండ్రోజుల్లో పూర్తి చేస్తాను --వైజాసత్య 09:48, 3 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పొరపాటు[మార్చు]

వికీపీడియా:Configuring on Linux అనే పేజీలో విషయం బాగానే ఉం(డే)ది. ఆ పేజీకి వెళ్తే మీరు దాన్ని తొలగించినట్టు చూపిస్తుంది. కానీ, ఆ పేజీని తొలగించాల్సిన అవసరమేమీ నాకు కనబడలేదు. పొరపాటున కానీ ఆ పేజీని తొలగించారా? — వీవెన్ 13:29, 9 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నేను పునఃస్థాపించాను. -- C.Chandra Kanth Rao-చర్చ 22:10, 9 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
పొరపాటునే తొలగించాను. -- రవిచంద్ర(చర్చ) 05:18, 10 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలతో[మార్చు]

తెలుగు మెడల్
తెలుగు వికీలో చంద్రకాంతరావు గారి అనన్య కృషిలో ప్రత్యేకంగా ప్రశంసించవలసినవిగా నేను భావించే మూడు విషయాలు -
(1) పటిష్టమైన వర్గీకరణ, వర్గాలకు అంతర్వికీ లింకులు
(2) కేలెండర్, వర్తమాన ఘటనలు - ఈ అంశాన్ని దాదాపు ఒంటి చేతితోనే చంద్రకాంతరావు గారు లాగిస్తున్నారు
(3) నియోజక వర్గాల వ్యాసాలు (ఆహమ్మద్ నిస్సార్ తోడ్పాటుతో) - ఈ వ్యాసాలు ఊహించని దిశలలో విస్తరణ చెందుతున్నాయి. ఎన్నికలలో పోటీచేసేవారికంటే వీరు ఎక్కువ కష్టపడుతున్నట్లు నాకు అనిపిస్తున్నది.

ఇలాంటి బహుముఖమైన ప్రజ్ఞ, అంకిత భావం చూపిన చంద్రకాంత్ గారికి తెలుగు వికీ సభ్యులందరి తరఫున అభినందనా సూచకంగా కాసుబాబు ఈ తెలుగు పతకం సమర్పిస్తున్నాడు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:06, 13 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

దీనిని మీ పతకాల స్థానంలో ఉంచుకోమని కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:06, 13 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పతకం సమర్పించిన కాసుబాబు గారికి కృతజ్ఞతలు. 1) కేలండర్, వర్తమాన ఘటనలకు సంబంధించి తెవికీకి అధిక హిట్లు అవుతున్నాయి. సందర్శకులకు అనుకూలంగా మనం పోవలసి ఉంటుంది. అప్పుడే మన కృషి సార్థకమౌతుంది. 2) వర్గీకరణ అనేది చాలా ముఖ్యమైనది. కొత్తవారికి తెలుగులో టైప్ చేయడం కూడా ఇబ్బంది కాబట్టి అలాంటి వాళ్ళకు వర్గీకరణ వాలా అనుకూలం. 2) చాలా వర్గాలకు అంతర్వికీ లింకులు లేవు. కనీసం ఒక్క అంతర్వికీ లింకు కూడా లేనప్పుడు బాటు కూడా పనిచేయదు. అలాంటి వాటికి అంతర్వికీలు చేరుస్తున్నాను. 4) ఇక నియోజకవర్గాల వ్యాసాల విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో (ఇతర దేశాలలోకూడా - మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి సహజంగానే ఇతర దేశస్థులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు) ఎటు చూసిననూ ఎన్నికల అంశమే. వార్తాపత్రికలలో, టీవీలలో వాటి విశ్లేషణలే. కాబట్టి మనం కూడా శాశ్వత ప్రాతిపాదికపై నియోజకవర్గాలలో అవసరమైన అంశాలు చేరిస్తే బాగుంటుందని ఆ పని చేస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:45, 13 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
రెండవ తెలుగు పతకం పొందిన చంద్రకాంతరావు గారూ, హార్థిక శుభాకాంక్షలు అందుకోండి. అహ్మద్ నిసార్ 18:25, 1 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నిసార్ గారూ, మీ అభిమానానికి మరో సారి నా కృతజ్ఞతలు. -- C.Chandra Kanth Rao-చర్చ 18:28, 1 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక కొంతకాలం చురుగ్గా తెవికీలో పాల్గొనదలచాను. ఎన్నికలకు సంబంధించిన వ్యాసాలల్లో మీకు సహాయంగా ఉండడానికి కృషి చేస్తాను. δευ దేవా 16:52, 15 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా సంతోషం. నియోజకవర్గాల వ్యాసాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటన్నిటినీ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. నా సహాయం మీకుంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:00, 15 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ఆలోచన, ప్రయత్నిస్తాను. స్వింగ్‌కు తెలుగు పదం చెప్పగలరా? δευ దేవా 17:50, 15 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఎన్నికల పరిబాషలో స్వింగ్‌కు రెండు పార్టీల మధ్య ఓటర్ల వైఖరి/ఇద్దరు అభ్యర్థుల తారతమ్యం/మెజారిటీగా అర్థం చెప్పుకోవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 18:43, 15 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు నియోజక వర్గాలలో పెట్టిన పట్టిక చూశాను. స్వింగ్‌కు అర్థం గత ఎన్నికకు ఇప్పటి ఎన్నికకు ఓట్లలో మార్పు శాతంగా ఇచ్చారనుకుంటా. దానికి తెలుగులో సరైన పదం దొరకడం లేదు. ప్రస్తుతానికి స్వింగ్‌గా ఉంచి తర్వాత ఆలోచిద్దాం. -- C.Chandra Kanth Rao-చర్చ 18:53, 15 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Project on famine plants[మార్చు]

Hi, I am starting to work on a project on famine plants following a list I got from a University. Now one of our goals is to extend the knowledge about these plants by translating at least the first sentences of, for example en.wikipedia, into as many languages as possible. So for now I am collecting the available data and in a second stage we will ask people to collaborate. I added one term in Telugu to our aggregator application and I would like to ask you if you could have a look if it would be correct as a dictionary entry. You can find the added translation here on the right hand side. When you look at lower part of the centre of the page you will see the English and German entries of Wikipedia which we would like people to translated and put at disposal for the small wikipedias. Probably there will be many entries that are not available in Telugu so that you can get some new articles from there if you wish. I hope things will get going :-) --SabineCretella 18:23, 27 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Hi SabineCretella, I am not enough knowledge on Famine Plants for participating in your Project. However I will inform to our wiki community for your Project. Thanks. -- C.Chandra Kanth Rao-చర్చ 21:04, 27 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నియోజకవర్గాల బొమ్మలు[మార్చు]

దేవా గారు, మీరు నియోజకవర్గాల బొమ్మలను చాలా చక్కగా రూపొందిస్తున్నారు. మీ కృషి చాలా బాగుంది. మీకు బొమ్మలను తయారుచేయడంలో ఈనాడు ప్రత్యేక ఎన్నికల పేజీలు పాంచజన్య, జిల్లాల రౌండప్‌లో ఇక్కడి బొమ్మలు సహకరిస్తాయని అనుకుంటున్నాను. దీని వల్ల మీ పని సులువౌతుంది. ఒక్కొక్క మండలాన్ని వెదికి పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. -- C.Chandra Kanth Rao-చర్చ 17:08, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా థాంక్స్ చంద్రకాంత్ గారూ! మీరు నేను పడుతున్న కష్టాన్ని గుర్తించారు. మీరిచ్చిన లింక్ వల్ల నా పని చాలా సులువవుతుంది. δευ దేవా 17:17, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఫార్మాట్[మార్చు]

చంద్రకాంతరావుగారూ నమస్తే, తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం లో వుండే రీతి సరిపోతుందో కాదో కాస్త చూసి చెప్పండి. అహ్మద్ నిసార్ 17:26, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

బాగుంది ఒకదాని కిందుగా మరొకటి కాకుండా పేరాగ్రాఫ్ టైపులో వరుసగా వ్రాయండి. ఎందుకంటే ఇది ఎన్నికలయ్యే వరకు మాత్రమే పనికి వస్తుంది. ఆ తర్వాత పోటీ చేస్తున్నాడు లాంటి వాక్యాలను తొలిగించి పోటీ చేశాడు గా మార్చవలసి ఉంటుంది. ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి టేబుల్స్ మరియు గణాంకాల గ్రాఫ్ చేర్చవలసి ఉంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:40, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల అక్షరాలు[మార్చు]

  • మధ్య మధ్య ఇంగ్లీషు పదాలను ఎలా టైపు చెయ్యాలో కాస్త వివరించండి. (--నాగరాజు రవీందర్)
రవీందర్ గారూ, మీరు దిద్దుబాట్లు చేస్తున్నపుడు తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి. ESC - భాషల మధ్య మారడానికి. IEలో ESC తరువాత ctrl+z కూడా నొక్కాలి. అనే పేరుతో ఒక పెట్టె (చెక్ బాక్స్ ) ఉన్నదా?, దానిని టాగుల్ చెయ్యడం(క్లిక్ చెయ్యడం) ద్వారా మధ్య మధ్యలో ఆంగ్లంలో రాయవచ్చు. ఇంకా ఏదైనా సందేహాలుంటే నిస్సందేహంగా అడగండి. రవిచంద్ర(చర్చ) 12:00, 17 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ, భాషల మధ్య మారడానికి పైన మీరు చెప్పిన పద్ధతి వికిపీడియాలో పనిచేస్తోంది. కాని విక్షనరీలో పనిచేయడం లేదు. దీనికి వేరే ఏమైన పద్ధతి ఉందా ? ------Nagaraju raveender 17:15, 31 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నాగరాజు గారూ, విక్షనరీలోనూ మీరు ఇదే పద్దతి అనుసరించవచ్చు. ESC, ctrl+z లతో పని కాకుండా మౌజ్‌తో చెక్‌బాక్సులో టిక్కు పెట్టి చూడండి. -- C.Chandra Kanth Rao-చర్చ 17:43, 31 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
రవీందర్ గారు చెప్పింది నిజమే చంద్రకాంతరావు గారూ! మన విక్షనరీలో తెలుగులో టైపు చేసే సౌకర్యం లేదు. వికీమీడియా సాఫ్టువేర్ ఈ మధ్య అప్‌డేట్ చేసినపుడు ఈ సౌకర్యం గల్లంతు అయినట్లుంది. -- రవిచంద్ర(చర్చ) 04:14, 1 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అవును నేనిప్పుడే చూశాను. మీరు చెప్పింది నిజమే. ఇదివరకెప్పుడో చూసినప్పుడు ఆ సదుపాయం ఉన్నట్టు గుర్తుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 18:15, 1 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యత గురించి[మార్చు]

ఆవతలి వ్యక్తిని నువ్వు, నీవు, అని సంబోధిస్తున్న మీకు ఉన్న సభ్యత ఎంతో బాగానే తెలుస్తున్నది.

నేను నా చర్చా పేజీలో మీరు చేసిన వ్యాఖ్యను తొలగిస్తే మీరు ఇంత బాధపడవలసిన అవసరం ఏమిటి?? మీరేదో హెడ్మాస్టరు అయినట్ట్లు, ఇతరులంతా ఏదో ఒకటో క్లాసు పిల్లలు అయినట్లు ప్రవర్తించకండి. తరువాత ఈ వారం బొమ్మ గురించి: నేను ఒక బొమ్మను ఉంచానే అనుకోండి, అక్కడ ఆ పేజీలో ఉన్న నియమాలలో మీరు చెప్పిన విషయాలు ఏమీ లేవు.మీరు చెప్పిన నియమాలన్నీ కూడ ఆ పేజీలో ఉంచండి, అప్పుడు మాలాంటి వారు చూసి దానికణుగుణంగా మసులుకుంటాము. మీరు మీ నిర్వాహక హోదాలో తీసెయ్యదలుచుకుంటే తీసెయ్యండి. నా చర్చా పేజీలో వ్యాఖ్యలు చెయ్యాల్సిన అవసరం లేదు. మాకు కూడ అంతో, ఇంతో, కొంత, తెలుసును. మీ అంత కాకపోవచ్చును. మీ వ్యాఖ్యలు నాకు చాలా బాధ కలిగించినాయి. ఎంతో అరుదయిన ఫొటోను నేను ఈ వారం బొమ్మగా ఊంచటానికి ప్రతిపాదిస్తే ఇంత అల్లరా?? అది కూడ ఒక నిర్వాహకునివల్లనా?

నేను మళ్ళి మళ్ళి ఈ విషయంలో చర్చించను. ప్రస్తుతానికి నాకు బెంగుళూరు బదిలీ అయినందువల్లన కొంత dislocate అయ్యి ఇంటర్ నెట్ కనెక్షన్ కూడ ఇంకా ఏర్పడలేదు.ఇంతటితో ఈ విషయం ముగించండి. దయచేసి, చురుకుగా పనిచేస్తున్న సభ్యులను నిరుత్సాహ పరిచే వ్యాఖ్యలు చెయ్యటం ఇకనైనా మానుకోండి. శలవు.నమస్కారం.--S I V A 08:55, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నా సమాధానాలు
  1. సభ్యతను అంచనా వేయడానికి అవతలి వ్యక్తిని బహువచనంలో ఉచ్ఛరించడమొక్కటి మాత్రమే అర్హత అనుకుంటున్నారు. అది ఎంతమాత్రం కాదు. తెవికీలో దేశాధినేతలు, మహానుభావులను కూడా ఏకవచనంలో మనం ప్రయోగించడం లేదా? అలా అనుకుంటే తెవికీలో పనిచేసే సభ్యులలో ఒక్కరికి మాత్రమే సభ్యత ఉందని అనుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది.
  2. నేను చేసిన వ్యాఖ్యలను తొలగించినందుకు నాకేమీ కోపం లేదు, బాధ అసలే లేదు. ఆ విషయం స్పష్టం చేశాను కూడా. కాని తెవికీ సంప్రదాయం గురించి వ్రాసిన వ్యాఖ్యను అనవసర విషయంగా సారాంశంలో వ్రాయడమే బాధ కలిగింది. ఇది నాకే కాదు మిగితా సభ్యులకూ బాధ కలిగించాల్సిన విషయమే. వ్యక్తిని విమర్శించడం వేరు, వ్యవస్థను విమర్శించడం వేరు. నాకు ప్రత్యేకంగా విమర్శించిననూ నేను నిగ్రహించుకోగలనేమో కాని ఎన్నో సంవత్సరాల నుండి వందలాది సభ్యుల కృషి మూలంగా ఎదుగుతున్న తెవికీ సంప్రదాయాన్ని అనవసర విషయంగా కొట్టివేయడం భాధపడవలసిందే.
  3. ఇక్కడ హెడ్మాస్తర్లు, పిల్లలు ఎవరూ లేదు. అంతా సమానమే. అయితే వ్యక్తుల మధ్య తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఒకరికి తెలియని విషయాలు మరొకరికి తెలిసిఉంటాయి. ప్రపంచ విజ్ఞానం ఇంత పురోభివృద్ధి సాధించిందంటే అదే కారణం. తెవికీ పురోగమనానికి కూడా అదే కారకం కావాలి. ఇందులో అన్ని విషయాలు తెలిసిన వారు, ఏమీ తెలియని వారు ఎవరూ లేరు. ఒకరి నుండి మరొకరు తెలుసుకుంటూ వ్యవస్థ పురోగమనానికి పాటుపడాల్సి ఉంటుంది. నాకు అన్నీ తెలుసూ మిగితా సభ్యులు నేను చెప్పిందే వినాలి అని ఎవరూ అనడం లేదు. కొత్త సభ్యుడైననూ అతను చెప్పిన విషయం తెవికీకి పాటు పడుతుంది అనుకుంటున్నప్పుడు నిర్వాహకులైననూ దాన్ని పాటించాల్సిందే.
  4. నియమాలు వేరు, సంప్రదాయాలు వేరు. సంప్రదాయం పాటించడమనేది సభ్యత కిందికి వస్తుంది. నియమాల వలె సంప్రదాయాలను బలవంతంగా అమలు చేయలేదు. సంప్రదాయాలు మునుముందు నియమాలు కావచ్చు, అది వేరే విషయం. నేను చెప్పింది సంప్రదాయమే కాని నియమం కాదు. ప్రత్యేక కారణం ఉంటే తప్ప బొమ్మను అప్‌లోడ్ చేసిన వెంటనే మొదటి పేజీ ప్రదర్శనకై ఉంచడం కంటే కొంతకాలం వేచిఉండటం సమంజసం. ఈ బొమ్మకు సభ్యులు అభ్యంతరాలు చెబుతారని కాదు కాని బొమ్మలపై సభ్యులు అభ్యంతరాలు చెప్పే అవకాశం మాత్రం ఉంటుంది, ఆ అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కూడా.
  5. చర్చా పేజీలో వ్యాఖ్యలు చేసే అవసరం లేదు అని చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే ఇది సమిష్టి కృషితో కొనసాగుతున్న బృహత్కార్యం. సభ్యుల కృషిని మెచ్చుకోవడం, పొరపాట్లను తెలియజేయడం కూడా సంప్రదాయమే. పొరపాట్లను తెలియజేసినంతమాత్రాన ఎదుటివారికి ఏమీ తెలియదు అని నేను అనుకోవడం లేదు. నాకే అన్ని విషయాలు తెలుసూ అని చెప్పడం లేదు. నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. నాకంటే అధికంగా తెలిసిన వారు తెవికీలో చాలా సభ్యులున్నారు. ఇప్పటికీ వారి నుంచి నేను తెలుసుకుంటూనే ఉన్నాను. దానికి నా చర్చా పేజీలే మూగసాక్షి.
  6. ఇక్కడ అల్లరి ఎవరు చేస్తున్నారు. సంప్రదాయం కాదని బొమ్మ ప్రదర్శనను ఈవాబొ పేజీ నుండి తొలిగించి ఆ విషయం చర్చా పేజీలో వ్రాసానంతే. అది అల్లరి ఎలా అవుతుంది. ఈ విధంగా చేయడమూ సంప్రదాయమే. ఇంతకు మించి నేను చేసిందేమీ లేదు. దానికి కారణం తెలుసుకుంటే సరిపోయేది. అలా కాకుండా నేను వ్రాసిన వ్యాఖ్యను తొలిగించి తెవికీ సంప్రదాయాన్ని అనవసర వ్యాఖ్యగా పరిగణించుటే నాకు బాధ కలిగింది. తొలిగించే పనులు కొత్త సభ్యులు చేయరు. ఈ బొమ్మ ఎంతో అరుదైనది, దీనికి ఈ ప్రత్యేకత ఉంది కాబట్టి దీన్ని ఈవాబొగా పరిగణిద్దాం అని దాని చర్చా పేజీలో ముందే తెలియజేస్తే బాగుండేది. సభ్యుల పరిశీలనకు వచ్చేది. అంతకు మించి నేనేమీ చెప్పను.
  7. చురుగ్గా ప్రవర్తించే సభ్యులను నిరుత్సాహ పర్చడం అలాంటి వ్యాఖ్యలు చేయడం నా ఉద్దేశ్యం కాదు. సంప్రదాయం తెలియజేసినంతమాత్రాన సభ్యులను నిరుత్సాహపర్చినట్లు అనుకోవడం బాగుండదు. ఈ వ్యాఖ్యను నాకు చెప్పే అవసరం ఎందుకో అర్థం కావడం లేదు. తెవికీ పద్దతులు, సంప్రదాయాన్ని చెప్పినప్పుడు అది నిరుత్సాహం కలిగిస్తుందంటే నేనేమీ చేయలేను.
  8. నేను కూడా ఈ విషయంలో చర్చను పొడిగించాలనుకోవడం లేదు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:25, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

శివ స్పందన[మార్చు]

ఛంద్రకాతరావుగారూ! మీరు ఇచ్చిన సుదీర్ఘ సమాధానం ఆసక్తిగా చదివాను. సభ్యత వంటి పెద్ద పెద్ద మాటలు వాడేసరికి నేను స్పందించవలసి వచ్చింది. మీరు మీ వ్యాఖ్యలను బొమ్మ తొలగిస్తూ, ఆ బొమ్మ చర్చా పేజీలోనే వ్రాసి ఉంటే సరిపొయ్యేది అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా, నేనుకూడ ఈ చర్చను పొడిగించదలుచుకోలేదని ఇంతకుముందే చెప్పాను కదా, అందుకని ఇక ఈ విషయం వదిలేద్దాం, మళ్ళీ మన కృషి ఎప్పటిలాగ కొనసాగిద్దాం. వచ్చే వారంలో నాకు ఇంటర్‌నెట్ కనెక్షన్ రావచ్చును, మళ్ళీ రచన / దిద్దుబాట్లు కొనసాగించవచ్చనే అనుకుంటున్నాను.

ఇక చర్చాపేజీలో వ్రాయటం పుట మొదట్లోనా, చివరలోనా అన్న విషయం మీద: నేను పుట మొదట్లోనే ఎందుకు వ్రాస్తానంటే, సంబంధిత సభ్యుడు పుట తెరువగానే, వ్యాఖ్య కనబడి సౌకర్యంగా ఉంటుంది. ఇది నాపద్ధతి. అలా కాదు చివరనే వ్రాస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మనం ఒకరికొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశ్యం. --S I V A 09:50, 4 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి వీలులేదు. అలా అయితే నేనెందుకు చర్చను తీసేవాడిని? ఈ నియమం నేను పెట్టినది(!) కాదు, నేను అనుకున్నది(!!) అసలే కాదు. తెవికీ ప్రారంభం నుంచి ఉన్నదే. తెవికీలోనే కాదు అన్ని బాషల వికీలలోనూ ఇదే పద్దతి అనుసరిస్తున్నారు. ఇవన్నీ ఆలోచించాల్సిందే. దానికి కారణం కూడా చెప్పాను. ఈ సంప్రదాయాన్ని పాటించడం తెవికీ సభ్యత, వినని వారికి నేను ఇంతకంటె ఎక్కువ చెప్పేదేమీ ఉండదు. -- C.Chandra Kanth Rao-చర్చ 20:30, 9 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]