వాడుకరి చర్చ:Kameshk

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Kameshk గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 17:48, 5 అక్టోబర్ 2009 (UTC)


ఈ నాటి చిట్కా...
విభాగం లింకు

ఏదైనా వ్యాసం కొరకు లింకు ఇవ్వాలంటే ఆ వ్యాసం పేరు చదరపు బ్రాకెట్లలో ఇవ్వడం చాలా మందికి తెలుసు. ఉదాహరణకు [[గుడిపాటి వెంకట చలం]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం అని ఆ వ్యాసానికి లింకు వస్తుంది.

అదే వ్యాసంలో "చలం వాఖ్యలు, అభిప్రాయాలు" అనే విభాగానికి లింకు ఇవ్వాలనుకోండి. అప్పుడు వ్యాసం పేరు తరువాత # అనే గుర్తు ఉంచి విభాగం పేరు వ్రాయాలి. [[గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు అన్న లింకు సరాసరి ఆ వ్యాసం విభాగానికి (Section head within the artcile) దారి తీస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

దయచేసి గమనించండి[మార్చు]

కామేష్ గారూ! నమస్కారం. మీరు చాలా శ్రమకోర్చి ఆంగ్లం నుండి పెద్ద పెద్ద వ్యాసాలను తెలుగు వికీలోకి అనువదిస్తున్నందుకు కృతజ్ఙతలు. మీ పరిచయాన్ని మీ వాడుకరి పేజీలో వ్రాస్తే ఇతరులకు మీతో సంభాషించడానికి అనువుగా ఉంటుంది. మీరు అనువాదాలు చాలా శ్రమకోర్చి చేస్తున్నారని ఆ వ్యాసాలను చూస్తే అర్ధమవుతుంది. అయితే వాటివలన కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమౌతున్నాయి గనుక దయచేసి క్రింది విషయాలు గమనించ గలరు.

  1. యాంత్రిక అనువాదం తరువాత మరి కొంత సమయం వెచ్చించి అందులో భాషను సరిదిద్ద గలరు. ఎందుకంటే ఇలా అనువదించిన వ్యాసాలలో భాష చదవడానికి సొంపుగా ఉండాలంటే మరికొంత అభివృద్ధి కావాలి.
  2. తెలుగు వికీలో ముందు ముందు అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్నదనిపించిన వ్యాసాలకు మాత్రమే ఎర్ర లింకులు ఉంచండి. మిగిలిన వాటిని లింకు లేకుండా ఉంచడమే మంచిది.
  3. ఇప్పటికే కొంత అభివృద్ధి అయిన వ్యాసాల స్థానంలో యాంత్రిక అనువాదాలు పెట్టడం వలన ఇంతకు ముందు సభ్యులు చేసిన శ్రమ వృధా అవుతుంది. కనుక క్రొత్త వ్యాసాలు మాత్రం యాంత్రికంగా అనువదించమని కోరుతున్నాను. పాత వ్యాసాలను యాంత్రికంగా కాకుండా మాన్యువల్‌గా అభివృద్ధి చేయడం మంచిది.

మీ కృషిని అభినందిస్తున్నాను. ముందు ముందు తెలుగు వికీ ప్రగతికి మీ తోడ్పాటు చాలా ఉపయోగకరం అవుతుందని భావిస్తున్నాను. ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో తప్పక వ్రాయండి --కాసుబాబు 16:46, 6 అక్టోబర్ 2009 (UTC)