Jump to content

వాడుకరి చర్చ:Sultankhadar

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Sultankhadar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 06:42, 13 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 28


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

దారిమార్పు పేజీలు

[మార్చు]

మీరు ఒకే వ్యాసానికి అనేక దారిమార్పు పేజీలు ఏర్పాటుచేస్తున్నారు. అంతగా అవసరం లేని వ్యాసాలకు కూడా అత్యధిక సంఖ్యలో దారిమార్పు పేజీల ఏర్పాటు అవసరం లేదనుకుంటా. అవి తొలిగించబడతాయి. మీ శ్రమ వృధా అవుతుంది కాబట్టి ఇకనుంచి అంతగా అవసరమనుకుంటేనే ఒకటి రెండు దారిమార్పు పేజీలకు మించకుండా సృష్టించండి.----C.Chandra Kanth Rao 07:32, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండీ సుల్తాన్ గారు! మీరు అచ్చుతప్పులున్న పదాలకు కూడా దారి మార్పు పేజీలు తయారు చేస్తున్నారు. ఇవి తొలగించబడతాయి. ఒకే పేరుతో ఉండవలసిన వ్యాసాలకు అలా దారి మార్పు పేజీలు సృష్టిస్తే పరవాలేదు. కానీ అవసరం లేని మరియు తప్పులున్న పదాలకు దారిమార్పు పేజీలు సృష్టించకండి. δευ దేవా 08:52, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Vinnapamu (Request)

[మార్చు]

గౌరవనీయులైన సభ్యులకు,

నేను తెవికీ లో ఈమధ్యనే సభ్యత్వము తీసుకున్నాను. ఇక్కడ నేను ఎదుర్కొన్న ప్ర ధాన సమస్య ఏమిటనగా, తెలుగు టైపింగు కొత్తవారికి అంత త్వరగా అలవాటు కాదు. వారు కొత్తలో అనేక టైపింగు తప్పులు చేసే అవకాం ఉన్నది. ఒక వేళ పొరపాటున సభ్యుల టైపింగు లో అచ్చు తప్పు దొర్లితే, సంబంధిత పేజీ కనిపించడం లేదు. దీనితో కొత్త సభ్యులు చాలా నిరాశ చెందుతున్నారు.

అలా వారిని నిరాశ పరచకుండా ఉండడానికి మాత్రమే నేను అనేక దారి మార్పులు చేయుచున్నాను. ఉదాహరణ కి 'కృష్ణ భగవాన్' మరియు 'క్రిష్నభగవాన్' రెండూ ఒకే పేరును సూచిస్తాయి. కానీ రెండవ పేరు టైపు చేస్తే ఏ పేజీ రాదు. కొత్తగా వచ్చే సభ్యులు వ్యాకరణం లో ఘనాపాఠీలు గా ఉండక పోవచ్చును. కావున వారి సౌలభ్యం కొరకే ఈ దారి మార్పులు చేసాను. నాకు తెలిసిన ఔత్సాహికులు కొందరు ఇదే సమస్య వలన తెవికీ పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనితో మొదటికే మోసం రావచ్చు. కావున ముందు మనం ర కొత్త సభ్యులను ఆకట్టుకొంటే , తరవాత మన తెవికీ దినదిన ప్రవర్థమానం గా ప్రకాశిస్తుందనేది నా ఆశ.

ఇంతటితో ఈ సమస్య ని గౌరవ సభ్యుల విగ్నత కే వదిలేస్తున్నాను.

ఇట్లు,

సుల్తాన్ ఖాదర్.


సుల్తాన్ ఖాదర్ గారూ! 'సౌలభ్యం కొరకు దారి మార్పులు' అనే ఆలోచన మంచిదే కాని ఎన్ని అచ్చు తప్పులను మనం ఇలా వడపోయగలం? - కృక్ష్ణ, కృష్న, క్రుష్ణ, క్రుష్న, క్రిష్ణ, క్రిష్న, కృష్ట్న, కృష్ట్న - ఇలా ఎన్నో రూపాంతరాలు సాధ్యం. కనుక ఈ విధానాన్ని పరిమితంగా (అత్యవసరమనిపించినచోట) - మాత్రం వాడమని నా సూచన. 'బన్ని' అనే పదం 'అల్లు అర్జున్'కు దారి మళ్ళించడం సమంజసం కాదనుకొంటాను. లేకపోతే దారిమళ్ళింపు పేజీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి. క్రొత్త సభ్యులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మీరు చెప్పిన విషయం నిజమే కాని అందుకు ఇది సరైన పరిష్కారం కాదని నా అభిప్రాయం.--కాసుబాబు 10:40, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ గారు, మీ సమస్య అర్థమైంది. కాని ఇలా ఒకే పేజీకి 15-20 దారి మార్పు పేజీలు ఇచ్చుకుంటూ పోతే అంతకు మించిన మరో సమస్య తలెత్తుతుంది. ఒక వ్యాసం అవసరమైతే మరో వ్యాసం రావచ్చు. ఉధా.కు వేలు/వేళ్ళు వ్యాసం అవసరైతే సుత్తివేలు వస్తుంది. అలాగే సుబ్బారావులు చాలా మంది ఉండవచ్చు. ఇప్పటికే నేను చెప్పేది మీకు అర్థమైందనుకుంటా. ఇక మీరు చెప్పినట్లు కొత్త సభ్యుల టైపింగ్ సమస్య గురించి చెప్పాలంటే దానికి పరిష్కారం వర్గాల ద్వారా సరైన దారి ఏర్పర్చడమే. ఎందరో కొత్త కొత్త సభ్యులు వర్గాల ఆధారంగానే తమతమ గ్రామాల వ్యాసాలకు చేరుకొని సమాచారం జోడించడంలేదా? మీరు కూడా కొత్త వ్యాసాలను చేరుకోడానికి మంచి దారి ఏర్పర్చండి చాలు. ఎన్ని దారిమార్పు పేజీలున్ననూ టైపింగ్ సమస్య ఉన్న వారు చేరాల్సిన వ్యాసం చేరడం కష్టమే. సినీ నటుల వ్యాసాలు కావాలంటే వర్గాల ద్వారా తెలుగు సినిమా-->నటులు--> వెళ్తే ఆ తరువాత వచ్చేది నటుల పేర్లే కదా----C.Chandra Kanth Rao 15:00, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మనం ఇక్కడ కొత్త సభ్యుల సౌలభ్యం కన్నా అక్షర దోషాలు దొర్లకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే తెవికీ మీద నిజంగా ఆసక్తి కలిగినవారు తాము టైపు చేసిన విధానం తప్పని తెలుసుకొని, తెలుగులో టైపు చేయడం నేర్చుకొని మరల తెవికీ వైపుకు రావచ్చు.—రవిచంద్ర 04:28, 1 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు

[మార్చు]

గౌరవనీయులైన సభ్యులకు, మీ అమూల్య సలహాలకు కృతఙతలు. ఇక నుండి నీటిని ఆచరించెదను. ఇంకొక మనవి ఏమనగా, నటీ నటుల infobox templateలోని awards section లో నంది అవార్డుల విభాగాన్ని జత చేయవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు, సుల్తాన్ ఖాదర్.

వర్గంలో సినిమా పేరు

[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారు వర్గం:2008 తెలుగు సినిమాలు లో సోంబేరి పేరు రావాలంటే సోంబేరి వ్యాసం చివరిలో [[వర్గం:2008 తెలుగు సినిమాలు]] వర్గం పెడితే చాలు మళ్ళీ వర్గంలోకి వెళ్ళి సోంబేరి పేరు వ్యాయనక్కరలేదు.---- C.Chandra Kanth Rao(చర్చ) 18:55, 1 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఖాతా పేరు మారబోతోంది

[మార్చు]

08:38, 20 మార్చి 2015 (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.