వాడుకరి చర్చ:Vijjilover
|
|
బొమ్మ:విజయశాంతి.jpg వివరాలు
[మార్చు]పబ్లిక్ డొమైను బొమ్మ అని చేర్చారు. బొమ్మను చూస్తుంటే ఏదో పాత పేపరును స్కాను చేసినట్లుగా ఉంది. దయచేసి మీరు ఈ బొమ్మను ఎక్కడి నుండి సంపాదించారో ఆ వివరాలు కూడా ఆ బొమ్మ పేజీలో జత చేయండి, అప్పుడు ఇతర సభ్యులు ఈ బొమ్మ పబ్లిక్ డొమైను బొమ్మా కాదా అనేదానిని నిర్ధారించు కోగలుగుతారు. అలాగే ఇకనుండి బొమ్మలను చేర్చేటప్పుడు వాటికి ఆంగ్ల పేర్లను ఇవ్వండి. అలా ఇవ్వటం వలన ఇతర భాషల వికీపీడియాలలో కూడా మనం ఎక్కించిన బొమ్మలను అదే పేరుతో అప్లోడు చేసుకోగలుగుతారు. మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే నా చర్చాపేజీలో అడగండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 18:09, 25 జూలై 2007 (UTC)
బొమ్మ:మీనా.jpg వివరాలు
[మార్చు]దయచేసి మీరు ఈ బొమ్మను ఎక్కడి నుండి సంపాదించారో ఆ వివరాలు కూడా ఆ బొమ్మ పేజీలో జత చేయండి, అప్పుడు ఇతర సభ్యులు ఈ బొమ్మ GFDL బొమ్మా కాదా అనేదానిని నిర్ధారించు కోగలుగుతారు. అలాగే ఇకనుండి బొమ్మలను చేర్చేటప్పుడు వాటికి ఆంగ్ల పేర్లను ఇవ్వండి. అలా ఇవ్వటం వలన ఇతర భాషల వికీపీడియాలలో కూడా మనం ఎక్కించిన బొమ్మలను అదే పేరుతో అప్లోడు చేసుకోగలుగుతారు. మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే నా చర్చాపేజీలో అడగండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 20:53, 26 జూలై 2007 (UTC)
బొమ్మల కాపీ హక్కులు
[మార్చు]ఒక సారి ఈ పేజీని చూడండి. తెలుగు సినిమా తారల జీవిత విశేషాలను వికీపీడియాలో పొందుపరుస్తూ చాలా మంచి పని చేస్తున్నారు. కానీ అదే సమయంలో మీరు కాపీహక్కులు కలిగి ఉన్న బొమ్మలను ఎక్కిస్తున్నారు, పైగా సరయిన లైసెన్సు వివరాలు చేర్చటం లేదు. ఇలాంటి బొమ్మలు "FAIR USE" అనే ప్రకరణం కింద మాత్రమే చేర్చగలం. అలా "FAIR USE"గా చేర్చిన బొమ్మలను ఎక్కడి నుండి సేకరించారో వివరించాలి. అలాగే ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీవ్యాసానికి ఆ బొమ్మను ఉపయోగించటానికి గల కారణం చెబుతూ, అది "FAIR USE" కిందకు వస్తుందో రాదో కూడా వివరించాలి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 21:06, 26 జూలై 2007 (UTC)