Jump to content

వాల్మీకి (1945 సినిమా)

వికీపీడియా నుండి
వాల్మీకి
(1945 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎల్.టాండన్,
ఎల్లిస్ ఆర్. డంగన్
రచన మల్లాది విశ్వనాథ కవి
కథ టి.వీరరాఘవస్వామి
తారాగణం కస్తూరి నరసింహారావు,
సి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు,
రామకృష్ణ శాస్త్రి,
బెల్లంకొండ సుబ్బారావు,
పారుపల్లి సుబ్బారావు,
కుమారి,
దాసరి కోటిరత్నం,
తవమణిదేవి,
బాలా త్రిపుర సుందరి,
మాస్టర్ సీతారామశర్మ,
కె.శ్రీనివాసన్,
వి.సుబ్బారావు,
ఆర్.సూర్యనారాయణ,
బేబీ రాధ,
బేబీ జమున
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం వి.బాలా త్రిపుర సుందరి
నృత్యాలు డి.పి.ఘటక్
కళ అడవి బాపిరాజు
నిర్మాణ సంస్థ భామా ఫిలిమ్స్‌
భాష తెలుగు

వాల్మీకి 1945లో విడుదలైన ఐదు తెలుగు చలనచిత్రాల్లో ఒకటి. వాల్మీకి చిత్రాన్ని మద్రాసులోని ప్రస్తుతపు వడపళని ఏరియాలో అప్పుడు అడవిగా వున్న ప్రదేశంలో చిత్రీకరించారు. భామా ఫిలిమ్స్‌ పతాకాన ఎల్లిస్‌ ఆర్‌ డంగన్‌, ఎం.ఎల్‌.టాండన్ దర్శకత్వంలో రూపొందించారు. వాల్మీకి జీవిత చరిత్రను, రామాయణంలోని ముఖ్య సన్నివేశాలు, సీతావనవాసం, లవకుశ జననం వంటి ఘట్టాలు చిత్రీకరించారీ చిత్రంలో. ఈ చిత్రం ద్వారా మాస్టర్ వేణు సంగీత దర్శకుడుగా పరిచయమయ్యాడు.[1]

మల్లాది విశ్వనాథ కవిరాజు, రచన అడవి బాపిరాజు కళాదర్శకత్వాన్ని నిర్వహించారు. కస్తూరి నరసింహారావు[2], సి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు, రామకృష్ణ శాస్త్రి, బెల్లంకొండ సుబ్బారావు, కుమారి, దాసరి కోటిరత్నం, తవమణిదేవి, బాలాత్రిపుర సుందరి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 14, 1945న విడుదలైంది. రామ నామమే మధురం మధురం, నీలి మబ్బులు అనే పాటలు హిట్టయ్యాయి.[3]

సంక్షిప్త కథ

[మార్చు]

రాకుమారి కళ్యాణికి దారి దోపిడి దొంగ పరిచయం కావడం, తొలి చూపులోనే ప్రేమలో పడటం, రాజు వారిని గుర్తించి అడిగితే రాజపుత్రుడుగా దోపిడీ దొంగను పరిచయం చేయడం, నిజం తెలిసాక రాజు ఆ దొంగకు ఉరిశిక్ష వేస్తే కళ్యాణి అతడిని తప్పించడం, తరువాత అతడు బందిపోటు నాయకుని కూతురుచే రక్షింపబడి ఆమె ప్రేమను పొందడం, బందిపోటు ముఠాలోని ఒక యువతి ఆ ప్రేమను భగ్నం చేయాలని ప్రయత్నించడం అడిగిన పెళ్ళికానుక ప్రియురాలికి తెచ్చే ప్రయత్నంలో ప్రియుడు పాములను చంపి నాగరత్నమాలను చేజిక్కించుకోడం, నారదుడు పాపపుణ్యాల్లో మీ వాళ్ళకు భాగం వుంటుందా అని ప్రశ్నించడంతో విరక్తి ఏర్పడి తపస్సు చేయడం వాల్మీకి ఇతివృత్తం.

పాటలు[4]

[మార్చు]
  1. ఉయ్యాల లూగుదాముయ్యాల పూల ఉయ్యాల
  2. ఎంత గొప్పోడివిరా సెంచు ఇంకెవ్వరున్నారురా సెంచు
  3. ఎంత మనోహరమే ఈ ప్రకృతి ఎంత ప్రేమ మయమే
  4. ఏజాడ వేదుకుదాన ఓ సఖా ఈ జన్మమిక విఫలమే నా, గానం. బాలాత్రిపుర సుందరి
  5. తెలియగ తరమా నీ మాయ దేవ దేవా బ్రహ్మాదులకైన
  6. తొంగిసూస్తావేల సందమామ తొలగిపో తొలగిపో సందమామ
  7. నమో నమో లోకబాంధవా నమో నమస్తే సూర్యనారాయణ
  8. నవ్వవోయి నా రాజ నవ్వవోయి ఏది నవ్వవోయి
  9. భజశ్రీ రాఘవ సీతారాం భవ సంతరణం
  10. మొగలిపూరేకల్లె ముత్యాలకొవల్లె నారింజ పండల్లె
  11. రామ నామమే శ్రీరామ నామమే మధుర మధురమే, గానం. బాలాత్రిపుర సుందరి
  12. శాశ్వతమా ఇది శాశ్వతమా మరుక్షణమేమో తెలియక
  13. సక్కని సుక్కా రావే రావే సక్కేరంటి ముద్దులియ్య రావే

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]