వికీపీడియా:ఇటీవలి వార్తలలో/అక్టోబరు 20
స్వరూపం
- తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పలోని ప్రయివేటు బాణసంచా తయారీ దుకాణంలో పేలుళ్ళు. 11మంది సజీవదహనం, 11మందికి తీవ్రగాయాలు.
- హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్, సమాచార వ్యవస్థను దాదాపుగా పునరిద్ధరించారు. విశాఖపాట్టణం ఇప్పటికే చాలా కోలుకోగా, శ్రీకాకుళం జిల్లా మాత్రం ఇంకా తుపాను ప్రభావంతో ఇబ్బందిగానే ఉంది.
- హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పునరావాస చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు తక్షణ సాయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి రూ.1000 కోట్లు ప్రకటించారు.
- బాలలపై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి గానూ కైలాస్ సత్యార్థి, మలాలా యూసఫ్జాయ్లకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
- జాన్ టిరోలెకు ఆర్థికశాస్త్రంలో నోబెల్ స్మారక బహుమతిని పొందారు.
- ఫ్రెంచ్ రచయిత, చారిత్రిక నవలాకారుడు పత్రిక్ మొదీనొకు నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది.
- ఎరిచ్ బెట్జిగ్, స్టెఫెన్ హెల్ల్, విలియం మోర్నెర్లకు రసాయనిక శాస్త్రంలో కృషికిగానూ నోబెల్ బహుమతి లభించింది.
జరుగుతున్న పరిణామాలు: ఎబోలా వ్యాధి వ్యాప్తి - ఐఎస్ఐఎస్ - 2014 హాంగ్కాంగ్ నిరసనలు - హుధుద్ తుఫాను పునరావాస చర్యలు
ఇటీవలి మరణాలు: తురగా జానకీరాణి