తురగా జానకీరాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తురగా జానకీరాణి
తురగా జానకీరాణి
జననంతురగా జానకీరాణి
ఆగష్టు 31, 1936
కృష్ణాజిల్లా, కోడూరు మండలం, మందపాకల గ్రామం
మరణంఅక్టోబరు 15, 2014
హైదరాబాదు
ఇతర పేర్లురేడియో అక్కయ్య
భార్య / భర్తతురగా కృష్ణమోహన్
పిల్లలుఉషారమణి, వసంతశోభ

తురగా జనకీరాణి (ఆగష్టు 31, 1936- అక్టోబరు 15, 2014) రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా.ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక ఆమె ఉన్నారు. పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించి వాటిలో చిన్నారులతో ప్రదర్శింపచేశారు. ఎందరో బాలబాలికలకి పబ్లిక్ స్పీకింగ్ భయంపోయి మైక్ లో ధైర్యంగా మాట్లాడటానికి.. వారిలోని సృజనాత్మకతకు ..ఇలా ఎన్నో విషయాలకిబాలానందం ఒక వేదిక అయింది. డాక్టర్లు, లాయర్లు, సినీ తారలు, ఎన్.ఆర్.ఐలు... ఒకరేమిటి ఎందరో ప్రముఖులు తమకు చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో వున్న అనుభవం మర్చిపోలేరు. నేటికీ ఆమెను ఒక ఆత్మీయురాలిలాగా పలకరిస్తుంటారు...

జననం

[మార్చు]

ఈవిడ ఆగష్టు 31, 1936కృష్ణాజిల్లా లోని, కోడూరు మండలం, మందపాకల గ్రామంలో జన్మించారు.

వివాహం - పిల్లలు

[మార్చు]

ప్రముఖ జర్నలిస్టు తురగా కృష్ణమోహన్ గారితో 1959లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉషారమణి, వసంతశోభ. 1974 అక్టోబరు,2వ తేది నా జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణమోహన్ మరణించారు.[1]

ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు

[మార్చు]

రేడియో ఆర్టిస్ట్ గానాటకాలలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ విశేష అనుభవం వున్నతురగా జానకీ రాణి గారు1975 లో ఆకాశవాణిలో ఉద్యోగంలో చేరారు. 1994 లో ఐ.బి.పి.ఎస్. అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు.

ఆకాశవాణిలో ఆమె బాధ్యత చాలెంజింగ్ వుండేది. సమయపాలన పాటించడంతో పాటు శ్రోతలకీ న్యాయం చేకూర్చాలనే తపనతో పనిచేసేవారు. 1975లో ఉద్యోగంలో చేరినప్పుడు మనదేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉండేది. ఆకాశవాణి ద్వారా ప్రభుత్వ పాలసీలు, విధానాలు ప్రజలకి చేరవేయాలి.ఒక ఛాలెంజింగ్ గా వుండేది....ఆమె ఏ కార్యక్రమం చేసినా ఆమోదించేవారు. స్వేచ్ఛ వుండేది. కార్యక్రమాల్లో వైవిధ్యం రూపొందిచడానికి ప్రయత్నించేవారు.

బాలానందం కార్యక్రమమం

[మార్చు]

బాలానందం కార్యక్రమమం ద్వారా పిల్లల వినోదం, విజ్ఞానం కోసం నాటికలు, రూపకాలు,సంగీత, సాహిత్యకార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపొందించేవారు. కొన్ని పెద్దల ద్వారా చెప్పిన విషయాలు బాగుంటాయి. బాలానందం ద్వారా ఎన్నో ప్రయోగాలు చేశారు. బాలానందం ద్వారా ప్రముఖ కథా రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు

స్త్రీల కార్యక్రమాలు

[మార్చు]

మహిళలకోసం కూడా కొత్త ప్రయోగాలు చేసారు. ముప్పై సంవత్సరాల కిందటే "ఇది నా సమస్య" అని స్త్రీల కార్యక్రమం ప్రసారం చేసేవారు. స్త్రీలు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియ పరిస్తే వాటి పరిష్కారాలు నిపుణులైన డాక్టర్లు, లాయర్లు మొదలైన వారిచేచెప్పేవాళ్ళు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వుండేది. వందల సంఖ్యల్లో వుత్తరాలు వచ్చేవి. వృద్ధుల కోసం తమ జీవితానుభవాలు తెలిపే "స్రవంతి" అనే కార్యక్రమం మొదలు పెట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అందరికీ చదువు అని పంచాయితీలలోని స్త్రీలకి పాఠాలు అందించేవాళ్ళు... మహిళలు వారు రాసిన కవితలు, కథలు, పాటలు ఈ కార్యక్రమంద్వారా వినిపించేవాళ్ళు.

ప్రోగ్రామర్ గా వివిధ కార్యక్రమాలు

[మార్చు]

ఒక కార్యక్రమం రూపొందించాలంటే ముఖ్యంగా మూడు విషయాలు గమనించాలి.

 1. ప్లానింగ్
 2. ప్రోడక్షన్
 3. ప్రెజెంటేషన్.

ప్లానింగ్ పర్ ఫెక్ట్ గా వుండాలి. తరువాత ప్రొడక్షన్ లో విలువలుండాలి. ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా. అది అందర్నీ ఆకట్టుకునేలా వుండాలి. ఈ మూడు కలిపి తేనే ఏ కార్యక్రమమైనా చక్కగా వుంటుంది. ఆమె ఎక్కువగా సంగీతాన్ని ఉపయోగించేవారు.

రేడియో అనేది స్టూడియో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి వారి అనుభవాలు, వాళ్ళ నాలెడ్డ్ తెలుసుకోవాలి అని చాలా క్రార్యక్రమాలు ప్రజల వద్దకి వెళ్లి చేసేవాళ్ళు. సాధారణ ప్రజలని కూడా ఇందులో భాగస్వామ్యులని చేయటం ద్వారా వారి అనుభవాలు నలుగురికీ తెలిసేవి. ఇందులో భాగంగా మేము గోదావరిఖని, జడ్చర్ల, కరీంనగర్, శ్రీశైలం....ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగి కార్యక్రమాలు రూపొందించేవాళ్ళు.

ఉద్యోగ నిర్వహణలో అనుభవాలు

[మార్చు]

ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎందరో పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పనిచేశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, స్థానం నరసింహారావు గారు, వేలూరి శివానంద్, గోపీచంద్.... ఇలా ఎందరో ఉన్నారు. వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారు, సినీ రంగ ప్రముఖలు అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జె.వి. సోమయాజులు, మంజు భార్గవి, ఇంకా ఎందరో నటీ నటులతో కలిసి కార్యక్రమాలు రూపొందించారు.

రచయిత్రిగా

[మార్చు]

వందకి పైగా కథలు రచించారు. అవి మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. మూడు నవలలు, ఐదు బాలసాహిత్యం మీద పుస్తకాలు వచ్చాయి అనువాద రచనలు కూడా మూడు వచ్చాయి. అగమ్య గమ్య స్ధానం అనే కథకి రాచ కొండ విశ్వనాధ శాస్త్రిగారు అభినందిస్తూ ఉత్తరం రాశారు. ఆ కథ ఇంగ్లీషులోకి తర్జుమా అయింది కూడా... ఇప్పటికీ రచనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే డా. దుర్గాబాయి దేశ్ ముఖ్ గురించి రూపకం ఆకాశవాణికి రాసిచ్చారు.వీరిరచన బంగారు పిలక కథసంపుటీ కావాలి

సంఘ సంస్కర్త గా

[మార్చు]

యూనిసెఫ్ లో నూ, ఎన్.సి.ఆర్.టి., ప్రభుత్వ శాఖల కోసం ... పని చేసేటప్పుడు బాల జాగృతి (బా జా)అనే కార్యక్రమం చేపట్టి 670 street shows (వీధి ప్రదర్శనలు) చేశారు. బాలల హక్కులు, సమస్యలు, బాల కార్మిక నిర్మూలన, ఇత్యాది ఎన్నో విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేవాళ్ళు. సామాజిక స్పృహ వున్న విషయాలు, సృజనాత్మక సందేశాలు పిల్లలు, యువతీ యువకులు శిక్షణ పొంది ప్రదర్శించేవాళ్లు.

"మా చేతి పంపు-మా బిందె నింపు" అనే సోషల్ ఎవేర్ నెస్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

చివరిరోజులు

[మార్చు]

గత కొంతకాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న జానకీరాణి అక్టోబరు 15, 2014 బుధవారం సాయంత్రం, పంజగుట్ట లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.[2]

అవార్డులు

[మార్చు]
 • 2011 : బాల సాహిత్య పరిషత్ ద్వారా "బాలసాహిత్య రత్న" అవార్డు.[3]
 • గహలక్ష్మీ స్వర్ణకంకణం.
 • తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (రెండుసార్లు).
 • రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం.
 • పింగళి వెంకయ్య స్మారక సత్కారం.
 • అరవిందమ్మ మాతృమూర్తి అవార్డు.
 • సుశీల నారాయణరెడ్డి సాహితీ పురస్కారం.
 • ఆంధ్ర సారస్వత పరిషత్తులో పరిణితవాణి గౌరవం.
 • ‘ఈనాడు’ అవార్డు.
 • బాలబంధు
 • దక్షిణ మధ్య రైల్వే గౌరవ సత్కారం.

మూలాలు

[మార్చు]
 1. పరిణతవాణి, 6వ సంపుటి. తురగా జానకీరాణి (సాయి లిఖిత ప్రింటర్స్ ed.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 215.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
 2. ఈనాడు దినపత్రిక, అక్టోబరు 16, 2014
 3. "అవార్డు ప్రదానోత్సవం". Archived from the original on 2014-08-30. Retrieved 2013-09-01.

యితర లింకులు

[మార్చు]