వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 20వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం

శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం శ్రీకాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు. శ్రీకాకుళం , గార మండలం లో ఉన్న ఆలయం 2 వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది నమ్ముతారు. నిజానికి ఆలయము నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే, ఈ ఆలయం చోళ మరియు కళింగ రాజా రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు.7 వ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసునని ఉంది. తరువాత ఈ ప్రాంతాన్నిపాలించిన వివిధ రాజవంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో చేశారు. దేవాలయ మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్ప సంపాద అని పిలవబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు మరియు కీర్తిని చాటి చెప్తాయి. గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగభీముడు ఆలయం చుట్టూ నేల మరియు పైభాగాన్ని నిర్మించారు.

(మే 21 2016-"కూర్మజయంతి" సందర్భంగా...)

(ఇంకా…)