వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 28
Jump to navigation
Jump to search
- 1867 : స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సిస్టర్ నివేదిత జననం (మ.1911).
- 1886: అమెరికాలోని న్యూయార్క్ లో స్టేట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజు. ఈ విగ్రహాన్ని అమెరికా కు ఫ్రాన్సు బహూకరించింది.
- 1892 : బెంగాలీ పాత్రికేయుడు లాల్ బెహారీ డే మరణం (జ.1824).
- 1892 : మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ రెండవ కుమారుడు మణిలాల్ గాంధీ జననం.(మ.1956)
- 1900 : జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు మాక్స్ ముల్లర్ మరణం (జ.1823).
- 1909 : ప్రముఖ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం (మ.1980).
- 1924 : సుప్రసిద్ధ తెలుగు సినిమా నటీమణి సూర్యకాంతం జననం (మ.1996).(చిత్రంలో)
- 2011 : రంగస్థల నటుడు, హరికథా భాగవతార్ దూసి బెనర్జీ మరణం.