వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 12
Jump to navigation
Jump to search
- క్రీ.పూ. 30 : గ్రీకు సంతతి కుటుంబానికి చెందిన టోలమాక్ రాజవంశపు స్త్రీ క్లియోపాత్రా మరణం (జ. క్రీ.పూ. 69).
- అంతర్జాతీయ యువజన దినోత్సవం.
- 1919 : భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు విక్రం సారాభాయ్ జననం (మ.1971).(చిత్రంలో)
- 1930 : హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, రాజకీయ ఉద్యమకారుడు జార్జ్ సోరోస్ జననం.
- 1851: ఇసాక్ సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్ కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, బోస్టన్ లో వ్యాపారం మొదలుపెట్టాడు.
- 1944 : మంగళగిరి లో అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించి అనేక మందికి సేవలు అందించిన కైవారం బాలాంబ మరణం (జ.1849).
- 1965 : ప్రముఖ కళాకారుడు, విమోచనోద్యమకారుడు పల్లెర్ల రామ్మోహనరావు జననం.
- 1972 : భారతదేశ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే జననం.
- 1989 : ప్రముఖ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్లియం షాక్లీ మరణం (జ.1910).