వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 8
స్వరూపం
- 1642: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త గెలీలియో గెలీలి మరణం (జ.1564).
- 1942: మోటార్ న్యూరాన్ సంబంధిత వ్యాధితో అంగుళమైనా కదలలేని స్థితిలో ఉన్న ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్ విలియం హాకింగ్ జననం. (చిత్రంలో)
- 1962: లియోనార్డో డావిన్సీ అద్భుతసృష్టి 'మోనాలిసా' పెయింటింగ్‌ను అమెరికాలో తొలిసారి ప్రదర్శనకు పెట్టారు.
- 1975: తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీత దర్శకుడు హేరిస్ జైరాజ్ జననం.
- 1983: తెలుగు సినిమా నటుడు తరుణ్ జననం.
- 1987: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు నానా జోషి మరణం.(జ.1926)
- 1994: కంచి కామకోటి పీఠము జగద్గురు పరంపరలో 68వ వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మరణం.(జ.1894)