వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ravuri bharadwaja.jpg
  • 1811: వెనెజులా స్వాతంత్ర్యదినోత్సవం(దక్షిణ అమెరికాలో స్వాతంత్ర్యం (స్పెయిన్ నుంచి) పొందిన మొట్టమొదటి దేశం).
  • 1916: భారతదేశ 7వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ జననం (మ.1994).
  • 1927: తెలుగు రచయిత, జ్ఞానపీఠ బహుమతి గ్రహీత రావూరి భరద్వాజ జననం (మ.2013).(చిత్రంలో)
  • 1946: 'బికిని' ఈత దుస్తులు మొదటిసారిగా పారిస్ ఫ్యాషన్ ప్రదర్శనలో కనిపించాయి.
  • 1947: భారతదేశానికి స్వాతంత్ర్యాన్నిచ్చే చట్టం బ్రిటిషు పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
  • 1954: ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు.
  • 1962: అల్జీరియా స్వాతంత్ర్యదినోత్సవం
  • 1975: కేప్ వెర్డె స్వాతంత్ర్య దినోత్సవం (500 సంవత్సరాల పోర్చుగీస్ వలస పాలన తర్వాత)
  • 1996: డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా పెద్ద గొర్రె నుంచి తీసిన జీవకణం ద్వారా పుట్టించారు.