వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 17
Appearance
- 1273: పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి మరణం. (జ.1207)
- 1778: బ్రిటన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త, నూతన ఆవిష్కర్త హంఫ్రీ డేవీ జననం. (మ.1829)
- 1866: ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత కూచి నరసింహం జననం. (మ.1940)
- 1903: రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.
- 1905: న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన మహమ్మద్ హిదయతుల్లా జననం. (మ.1992)
- 1959: స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం. (జ.1880).
- 1959: సినీనటి జయసుధ పుట్టినరోజు. (చిత్రంలో)
- 1996: తెలుగు సినిమా నటి సూర్యకాంతం మరణం. (జ.1924).