మహమ్మద్ హిదయతుల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహమ్మద్ హిదయతుల్లా (డిసెంబర్ 17 1905 - సెప్టెంబర్ 18, 1992) న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసాడు (20.07.1969 నుండి 24.08.1969 వరకూ). తన రాష్ట్రపతి పదవిని పూర్తి చేసి వి.వి.గిరి చే రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం చేయించాడు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి 1992 సంవత్సరంలో మరణించాడు.

అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న హిదాయతుల్లా, న్యాయ శాస్త్రము, విదేశాంగ వ్యవహారాలపై అనేక ప్రాచుర్యమైన రచనలు కూడా చేశాడు. హిదాయతుల్లా 1979, ఆగస్టు 31 నుండి 1984, ఆగస్టు 30 వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.

పదవులు
  • 1956 నుండి 1958 వరకూ మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసాడు.
  • 25.12.1968 న భారత సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితులయ్యారు.