వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 26
స్వరూపం
- 1802: ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త విక్టర్ హ్యూగో జననం (మ.1885).
- 1829: బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో సంస్థ స్థాపకుడు లెవీ స్ట్రాస్ జననం (మ.1902).
- 1932: సామాజిక కార్యకర్త హేమలతా లవణం జననం (మ.2008).
- 1869: నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా అఫ్జల్ ఉద్దౌలా మరణం (జ.1827).
- 1982: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు ఎలకా వేణుగోపాలరావు జననం.
- 1887: పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి మరణం (జ.1865).
- 1962: స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి సభాపతి అయ్యదేవర కాళేశ్వరరావు మరణం (జ.1882).
- 1966: భారతీయ అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు వి.డి.సావర్కర్ మరణం (జ.1883). (చిత్రంలో)
- 1975: భారత దేశంలో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్ర అహ్మదాబాదులో ప్రారంభం.