వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఇస్లామోఫోబియా
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచెయ్యాలి
ఇస్లామోఫోబియా వ్యాసం ఇస్లాంని కించపరచడానికి కాదు. అది ఇస్లాంని వ్యతిరేకించే హిందువులు మరియు క్రైస్తవులని విమర్శించడానికి రచించినది. అందుకే వైజాసత్య మరియు Kumarrao మొదట దీన్ని ఎడిట్ చేసి తమకి అనుకూలమైన మార్పులు చెయ్యడానికి ప్రయత్నించారు. వీళ్ళ్ సంగతి అర్థమవడంతో నేను కొన్ని వాక్యాలు తొలిగించాను. అందుకే నిర్వాహకురాలు వైజాసత్య నా ఐ.పి. బ్లాక్ చేసింది. ఐ.ఎస్.పి. అడ్మినిస్ట్రేటర్ నా స్నేహితుడు కావడం వల్ల నా ఐ.పి. అడ్రెస్ మార్పించగలిగాను.
ఈ మధ్య అన్ని పత్రికలు, టి.వి. చానెళ్ళలో ముస్లింలని భయపెట్టే వార్తలు వస్తున్నాయి. ఇస్లాం అంటే ఉగ్రవాదం లేదా ఉగ్రవాదం అంటే ఇస్లాం అని ప్రచారం చేస్తున్నారు. చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ కూడా అలాగే మాట్లాడే వాడు. కానీ హిందువులు చేసిన హింస గురించి ఏమీ మాట్లాడలేదు. ఇలాంటి వారి కళ్ళు తెరిపించడానికే ఈ పేజి తెరిచాను.
- పూర్వం ఎవరో పెంటతిన్నదృశ్యాలు ఇప్పటికీ గుర్తుచేసేకంటే మనప్రజలు శాంతిసామరస్యాలకోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెబితే బాగుంటుంది.అన్ని మతాలవాళ్ళూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారే. కానీ ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే.పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు.ఏది ఏమిటో తెలుసుకున్నాక నేను ఆస్తిక హేతువాది ని మానవవాది ని అయ్యాను.నామకార్ధంగా ముస్లిముల పేర్లుపెట్టుకుని శాంతియుత జీవనం గడుపుతున్ననాలాంటి భరతమాత ముద్దుబిడ్డలు ఈ దేశంలో కోట్లాదిమంది ఉన్నారు.మానినపుండు మళ్ళీ సెలపోసేలా చేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదంలో భాగస్తులే.ఒకవేళ అంతగా అకృత్యాలు చేసే ఇస్లామ్ మతాన్ని వద్దనుకొని ఈనాటి ముస్లిములు బయటకు రాదలుచుకున్నా హిందూ మతంలో మాత్రం చేరే చట్టపరమైన అవకాశం లేదే?అందరికీ సగౌరవంగా బ్రతికే దారికావాలి.కౌరవ సంతతినైనాసరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకు పోవటమే మంచిది.ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలను మళ్ళీ మళ్ళీ కొన్ని తరాలపాటు గుర్తుచేసి ఆ మతంలో ఉన్నఈనాటి వారసుల్ని నిందలువేసి అవమానిస్తే అది హిందూ మతం ప్రకారం మోక్షసిద్ధినిస్తుందా?హింసకు జవాబు హింసేనా? అహింసకాదా?ఎవరు తప్పుచేస్తే వారినే శిక్షించాలి.ఆంగ్ల వికీనుండి గ్రహించినా అశుద్ధం అశుద్ధమే.దాన్నే ఇష్టంగా ఎత్తుకొచ్చి అందరికీ చూపించటం అనర్ధదాయకం.వికీలో ఇలాంటి వ్యాసాలు ఎందుకు?ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ వ్యాసం?వెంటనే తొలగించండి.--Nrahamthulla 14:40, 5 డిసెంబర్ 2008 (UTC)
బాగా చదువుకున్న గురువులకే కుల గజ్జి, మత పిచ్చి ఉంటే వీళ్ళు భావి భారత పౌరులు ఎలా బాగు పడతారు? కులం కుళ్ళు కంపులో, మతం మత్తులో బతికే వాళ్ళకి జ్ఞానోదయం కలగాలంటే నిజాలు వ్రాయక తప్పదు.
- కుల, మతాలపై విమర్శలు వద్దనడం పిచ్చి కాదు, అలా రాయడమే పిచ్చితనం. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:32, 5 డిసెంబర్ 2008 (UTC)
నేను కొంత కాలం నాస్తిక ఉద్యమంలో పని చేశాను. నా అనుభవాలని బట్టి నేను వ్రాస్తున్నవి తప్పని అనుకోను. నా మిత్రుడు పెన్మెత్స సుబ్బరాజు పశ్చిమ గోదావరి జిల్లాలో నేత్రదాన ప్రోత్సాహక సంఘం పెట్టాడు. ఆ సంఘంలో ఒక క్రైస్తవుడు కూడా చేరాడు. కానీ ఆ క్రైస్తవుని తల్లి చనిపోయినప్పుడు అతను ఆమె కళ్ళు దానం చెయ్యడానికి అంగీకరించలేదు. నేత్ర దానం చేస్తే స్వర్గంలో కళ్ళు కనిపించవట, వీళ్ళ అమ్మ గారు దేవున్ని చూడలేరట. క్రైస్తవుల నమ్మకం ప్రకారం తీర్పు దినం అనేది ఉంటుంది. ఆ రోజు నాడు సమాధుల నుంచి ఆత్మలు లేచి దేవుని దగ్గరకి వెళ్తాయి. ఉన్నాడో లేడో తెలియని దేవుని కోసం విలువైన కళ్ళని మట్టిలో కలిపేస్తున్నారు నేత్ర దానం చెయ్య కుండా. నిజాలు మాట్లాడకుండా అజ్ఞానానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం చాలా ప్రామాదకరం. హిందువులు కూడా సుబ్బరాజు గారికి నేత్రదానం విషయంలో దాటవేత సమాధానాలు చెప్పారు. "మా అన్నయ్య అమెరికాలో ఉంటున్నాడు, మా అన్నయ్య పర్మిషన్ లేకుండా మా నాన్న గారి కళ్ళు తీస్తే మా అన్నయ్య వచ్చి గొడవ చేస్తాడు" లాంటి సమాధానాలే చెప్పారు. పల్లెటూర్లలో ఇంతకంటే పచ్చి మూఢ నమ్మకాల్ని నమ్ముతారు. మా మిత్రుడు ఇంకొకతను అనంతపురం జిల్లాలో ఉంటున్నాడు. అతనికి తెలిసిన ఒక పేదవాడు ఫేమిలీ ప్లానింగ్ ఆపరేషన్ చెయ్యించుకోలేదు. అతనికి 9 మంది పిల్లలున్నారు. అదేమి అని అడిగితే బిడ్డల్ని దేవుడు ఇస్తాడు కదప్పా, దేవుడిచ్చిన బిడ్డల్ని వద్దనకూడదు అని అన్నాడు. అతనికి నలుగురు పిల్లలు పుట్టిన తరువాత అయిదవ బిడ్డకి సాలప్ప అని పేరు పెట్టాడు. అప్ప (దేవుడు) ఇతనికి పిల్లలు సాలు అనుకుని ఇతనికి ఇంకా పిల్లలు పుట్టించడు అనే నమ్మకం వల్ల. ఆరవ బిడ్డ కూడా పుట్టాడు. మళ్ళీ అదే నమ్మకంతో ఆరవ బిడ్డకి కూడా సాలప్ప అని పేరు పెట్టాడు. ఏడవ బిడ్డకి, ఎనిమిదవ బిడ్డకి, తొమ్మిదవ బిడ్డకి కూడా అదే పెరు పెట్టాడు. పల్లెటూర్లలో వైద్య సదుపాయాలు లోపించడం వల్ల అనేక మంది కాలం తీరకుండానే చనిపోతుంటారు. బిడ్డకి ముసలయ్య అని పేరు పెడితే ముసలయ్యేంత వరకు బతుకుతాడని, పాపకి బతుకమ్మ అని పేరు పెడితే ఎక్కువ కాలం బతుకుతుందని ఇలా పల్లె ప్రజలు అనేక మూఢనమ్మకాలకి లోనవుతుంటారు. చదువుకున్న వాళ్ళు కూడ ఇంటి ముందు దృష్టి బొమ్మలు, బూడిద గుమ్మడి కాయలు పెట్టుకునే స్థాయిలో ఉంటే ఇక పల్లెటూరి ప్రజలలో మూఢనమ్మకాలు ఎలా పోతాయి? ఈ వ్యాసం ఇస్లాం వ్యతిరేక వ్యాసం కాదు. ముస్లింలందరూ ఉగ్రవాదులంటూ మత విద్వేష ప్రచారం చేసే వాళ్ళకి ఈ వ్యాసం రుచించదు. అందుకే ఈ వ్యాసాన్ని కొంత మంది హైజాక్ చెయ్యడానికి ప్రయత్నించడం జరిగింది.
- ఇంత ఆగ్రహోదగ్రులై, వ్యాసానికి ఏమాత్రం సంబంధంలేని విషయాలు కూడ చర్చలో లేవనెత్తుతున్నారు, దీనివల్ల ఒక సామాన్య వ్యాసానికి లేని పోని ప్రాచుర్యం వచ్చింది. ఉండనివ్వండి వ్యాసాన్ని. తొలగించాల్సిన అవసరం లేదు. ఎక్కడాలేని మాటగురించి కాదుగదా వ్యాసంలో వ్రాసినది. ప్రసుతం వాడుకలో ఉన్న మాటగురించే వ్యాసంలో వ్రాసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి మాట రావటానికి గల కారణాలు, అటువంటి అపనిందలకు గురికాకుండా ఉండాలంటే ప్రవర్తించాల్సిన తీరు గురించి కూడ వ్యాసంలో చర్చించటం ఉత్తమం.--S I V A 19:15, 11 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
- గమనిక: చరచ ముగిసినా ఫలితాన్ని ప్రకటించలేదు. కాబట్టి వ్యాసాన్ని ఉంచెయ్యడమే! చర్చను ముగిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 13:45, 13 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.