వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొండవీటి మురళి
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
విషయ ప్రాముఖ్యతను నిర్ధారించే లింకులు ఇవ్వలేదు. అందుకని తొలగించాలి. ఇదే కాకుండా మూలాలకు సంబంధించి ఈ సమస్యలున్నాయి: ఇచ్చిన మూలాల్లో మొదటిదైన యునిక్ వరల్డ్ రికార్డులకు లింకుల్లేవు. రెండవ మూలంగా చూపిన వెబ్సైటు స్వయానా కొండవీటి మురళిదే. మూలాలుగా బొమ్మలు చూపించానని చెప్పారు గానీ ఆ బొమ్మలు అసలు ఎక్కించినట్టే లేదు. మిగతా మూలాలకు కూడా లింకుల్లేవు. __చదువరి (చర్చ • రచనలు) 08:37, 17 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసానికి సబ్జెక్టు అయిన కొండవీటి మురళీ గారు నన్ను సోషల్ మీడియా మార్గాల్లో సంప్రదించి తొలగింపు నోటీసులోని అంశాలు తన ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయనీ, వీలైతే సంస్కరించమనీ, లేకుంటే తొలగించమనీ కోరారు. జీవించి ఉన్న వ్యక్తి జీవితచరిత్ర విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టీ, వారిచ్చిన మూలాలు ఏ మేరకు చదువరి గారు విజ్ఞాన సర్వస్వ రచనా నాణ్యతా ప్రమాణాల విషయంలో వెలిబుచ్చిన సందేహాలను అవి తీర్చగలవో నాకు తికమకగానే ఉన్నందున, ప్రస్తుతానికి దీన్ని మెరుగుపరచలేమని భావించి తొలగించాను. -పవన్ సంతోష్ (చర్చ) 07:25, 26 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.