వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/2015 గోదావరి పుష్కరాలు
స్వరూపం
చర్చా ఫలితం:ఉంచెయ్యాలి
వ్యాసంలో సమాచారం తక్కువ వుండడం, దీనిలో సమాచారం ఏర్పడకుండానే వేరే కొత్త పేజీ ఏర్పడడం వంటి కారణాలతో కాకుండా విషయప్రాముఖ్యత లేదంటూ దీన్ని తొలగించబోవడం చాలా ఆశ్చర్యకరం. గోదావరి పుష్కరాలు 2015 అన్నది చాలా ప్రముఖమైన విషయం. పత్రికల్లోని సమాచారాన్ని ఆధారం చేసుకున్నా, ప్రజాబాహుళ్యంలో ఆసక్తిని కొలమానంగా తీసుకున్నా, రేపటిరోజు వీక్షణసంఖ్యలే లెక్క అనుకున్నా ఇది అత్యంత ప్రాధాన్యమైన విషయం. తెవికీ సభ్యులంతా ఓ చేయివేసి మరీ దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. లేకుంటే రేపు పుష్కరాలు మొదలయ్యాకా వీక్షణలు పెరిగి, తెవికీ అంటే ఇంతే అనుకునే స్థితి రావచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 01:31, 23 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]