వికీపీడియా:వాడుకరులకు సూచనలు/ఏ వ్యాసాలను సృష్టించాలి
స్వరూపం
ఏ వ్యాసాలను సృష్టించాలి
[మార్చు]కొత్త వ్యాసాలు రాయాలనుకున్న వారికి ఏ వ్యాసాలు రాయాలనే సందేహం ఉండే అవకాశం ఉంది. అలాంటి వారికి కింది పేజీల్లో ఉన్న జాబితాలు ఉపయోగపడవచ్చు. ఈ జాబితాల్లోని అనేక వ్యాసాలు ఒకటి కంటే ఎక్కువ జాబితాల్లో ఉండి ఉండవచ్చు.
- వివిధ పేజీల నుండి ఇన్‌కమింగు లింకులున్న పేజీలు: వికీపీడియాలో ఈసరికే ఉన్న పేజీల నుండి ఎర్రలింకులున్న పేజీలు. ఎన్నిఎక్కువ ఇన్‌కమింగు లింకులుంటే అంత ఆవశ్యకమైన పేజీ అన్నమాట. ఈ జాబితాలో అన్ని పేరుబరుల్లోనూ ఉన్న పేజీలుంటాయి.
- ప్రతీ వికీపీడియాలోనూ ఉండాల్సిన పదివేల వ్యాసాల జాబితా: ఈ పేజీ, దీనికింద ఉన్న ఉపపేజీల్లో ఉన్న పేజీలు కొన్ని ఈసరికే ఉండి ఉండవచ్చు. ఆ జాబితాల్లోని పేజీల ఇంగ్లీషు వికీ పేజీని తెరిచి, అక్కడ అంతర్వికీ లింకులను పరిశీలించండి. వాటిలో తెలుగు లేదని నిర్ధారించుకున్నాకే తెవికీలో పేజీ సృష్టించండి.
- వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
- వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
- తొలగించిన గూగుల్ యాంత్రికానువాద వ్యాసాలు
ఎలా పనిచెయ్యాలి
[మార్చు]- పై పేజీల్లో, ఇంగ్లీషు పేరుకు ఎదురుగా తెలుగు పేరు లేని పేజీని తీసుకోండి.
- దాని ఇంగ్లీషు పేజీని తెరవండి.
- అక్కడి అంతర్వికీ లింకుల్లో (ఎడమ పక్కన ఉన్న నేవిగేషను పట్టీలో) తెలుగుకు పేజీ ఉందో లేదో గమనించండి.
- పేజీ లేకపోతే, అప్పుడు అనువదించడానికి పూనుకోండి.
- అనువాదం చేసేందుకు అనువాద పరికరం అనువైనది, వేగవంతమైనదీ కాబట్టి దాన్ని వాడితే పని వేగంగా చెయ్యవచ్చు
- పేజీని సృష్టించాక, ఈ జాబితాలో ఇంగ్లీషు వ్యాసం పేరు ఎదురుగా తెలుగు వ్యాసం పేరు రాయండి. ఆ జాబితాపై పనిచేయదలచిన ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇతర పనులు, వనరులు
[మార్చు]ఉన్న వ్యాసాలను విస్తరించడం మీ అభిమతమైతే,కింది పేజీలను చూడవచ్చు
- వికీపీడియా:సముదాయ_పందిరి చూడండి. ఏయే పనులు చెయ్యాలో ఈ పేజీలో చూడవచ్చు.
- వర్గం:మొలక: ఈ వర్గం, దీని ఉపవర్గాల్లోని పేజీలను విస్తరించి మొలకస్థాయిని దాటించి ఆ పేజీల్లో ఉన్న మొలక మూసను తీసెయ్యండి.
- వికీపీడియా:చదవదగ్గ వ్యాసాల జాబితా: గతంలో మొదటి పేజీలో ప్రదర్శించిన వ్యాసాల లింకులు ఈ పేజీలో ఉంటాయి. మొదటి పేజీలో ప్రదర్శించినప్పటికీ, ఆ వ్యాసాల్లో నాణ్యతా లోపాలుండవచ్చు. వాటిని సరిచెయ్యడం అత్యావశ్యకం. వాటిని సరిచెయ్యండి. అవసరమైన చోట్ల అదనపు సమాచారాన్ని చేర్చండి.
- వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసాలు
- వర్గం:విలీనం చేయవలసిన వ్యాసాలు: ఒకే అంశం గురించి రెండు పేర్లతో వ్యాసాలుంటే వాటిని విలీనం చేసేందుకు ప్రతిపాదించినపుడు ఆ పేజీలు ఈ వర్గం లోకి చేరతాయి. ఆ రెండు పేజీల్లోని పాఠ్యాలను తగిన విధంగా విలీనం చేసి ఒక పేజీని రెండవ దానికి దారిమార్పుగా చెయ్యండి.
- వర్గం:అనువదించ వలసిన పేజీలు: ఈ వర్గం లోని పేజిలను అనువదించి అనువాదం మూసను తీసెయ్యండి.
- వర్గం:వికీకరించవలసిన వ్యాసాలు: వికీ శైలిలో వ్యాస ఆకృతి, భాష వగైరాలు లేనపుడు, ఆ వ్యాసాలను ఈ వర్గం లోకి చేరుస్తారు. తగువిధమైన సవరణలు చేసి, వికీకరణ మూసను తీసెయ్యండి.