వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎర్రలింకుల సంస్కరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాలో ఎర్రలింకులు ఒక భాగం. వికీపీడియా అభివృద్ధికి దోహదపడే అంశాల్లో ఇది ఒకటి. సాధారణంగా ఏదైనా పేజీకి లింకు ఇచ్చినపుడు, ఆ పేజీ ఉనికిలో ఉంటే నీలిలింకును చూపిస్తుంది. దాన్ని నొక్కినపుడు ఆ పేజీకి తీసుకెళ్తుంది. అసలు ఉనికి లోనే లేని పేజీకి లింకు ఇచ్చినపుడు, ఆ లింకును చూపించకుండా ఉంటే సరిపోతుంది. కానీ వికీ సాఫ్టువేరు ఆ లింకును ఎర్రరంగులో చూపిస్తుంది. దాన్ని నొక్కినపుడు ఒక ఖాళీ పేజీకి తీసుకెళ్ళి, "మీరు అడిగిన పేజీ లేదు, ఇపుడు మీరు దాన్ని సృష్టించవచ్చు" అని చెబుతుంది. కొత్త పేజీల సృష్టికి, తద్వారా వికీ అభివృద్ధికీ తోడ్పడేందుకు ఇది ఒక మార్గంగా భావించి వికీ ఈ అంశాన్ని ప్రవేశపెట్టింది.

అయితే, ఎర్రలింకులకు సంబంధించిన పేజీలను ఎప్పటికప్పుడు సృష్టిస్తూ ఉంటే, వాటిని సృష్టించిన ప్రయోజనం నెరవేరుతూ ఉంటుంది. లేదంటే వ్యాసంలో ఎర్రలింకులు కనిపిస్తూ, వాటిని నొక్కినపుడు సంబంధిత వ్యాసాలేమీ కనబడక, పాఠకులకు అసంతృప్తి కలిగిస్తూ ఉంటాయి. దీన్ని నివారించేందుకు స్పష్టమైన మార్గం - ఆయా లింకుల గమ్యాలైన పేజీలను సృష్టించడమే.

ఎర్రలింకుల మంచి చెడులు

[మార్చు]

గమ్యం పేజీ ఉనికిలో లేనందున ఎర్రలింకులు ఏర్పడడం అనేది సహజమే. కానీ, గమ్యం పేజీలు వికీలో ఉనికిలో ఉండి కూడా లింకులు ఎర్రలింకులుగా ఉండిపోతే!? ఈ పరిస్థితి అనేక విధాలుగా వికీకి నష్టదాయకం.

  1. పేజీని సృష్టించి ఉన్నప్పటికీ, దానికి లింకు లేదు. దాన్ని చూడలని కోరుకున్న పాఠకులకు అది దొరకదు.
  2. లింకు ఇచ్చారు, కానీ అది గమ్యం పేజీకి వెళ్ళడం లేదు.
  3. లింకు అనేది వికీపీడియాకే కాదు, అంతర్జాలానికే అత్యంత ప్రధానమైన అంశం. ఏ పేజీ నుండి కూడా ఇన్‌కమింగు లింకుల్లేని పేజీని అనాథ పేజీ అంటాం. అంటే అది ఎవరూ చూడని, ఎవరికీ కనబడని పేజీ అన్నమాట. లింకు ఇవ్వాల్సిన చోటు ఉండి కూడా అనాథ పేజీగా అవడం మరీ అసంబద్ధం.
  4. ఎక్కువ ఎర్రలింకులు ఉంటే పాఠకులలో వికీపై కొంత అసంతృప్తి కలిగే అవకాశం ఉంది.
  5. మరీ ఎక్కువ ఎర్రలింకులు ఉంటే ఆ పేజీపై కొంత ఏవగింపు కలిగవచ్చు. ఉదాహరణకు భారతీయ_రైల్వే_స్టేషన్ల_జాబితా పేజీలో 5,771 ఎర్రలింకులున్నాయి. పాఠకులకు ఈ పేజీ వలన ప్రయోజనం కూడా పరిమితంగానే ఉంటుంది.

ఈ ప్రాజెక్టు ఉద్దేశం

[మార్చు]

సరైన ఎర్రలింకులకు పేజీలను సృష్టించడం ఈ ప్రాజెక్టు ఉద్డేశం కాదు. అనవసరమైన, దోషపూరితమైన ఎర్రలింకులను సవరించడం/తీసెయ్యడం దీని ఉద్దేశం. ఆ ఉద్దేశాలివి:

  • తప్పు ఎర్రలింకులను సవరించడం,
  • అనవసరమైన ఎర్రలింకులను తీసెయ్యడం,
  • చిరకాలంగా ఎర్రలింకులుగానే ఉండిపోయినవాటిని, పేజీ సృష్టించడం ఇప్పట్లో సాధ్యపడదు అనుకున్నవాటినీ తీసెయ్యడం

దోషపూరితమైన ఎర్రలింకులు ఎలా ఏర్పడతాయి

[మార్చు]

తెలుగు వికీపీడియాలో అనేక వేల పేజీల్లో, ఇలాంటి దోషపూరితమైన ఎర్రలింకులు లక్షల్లో ఉన్నాయి. ఈ లింకులు కింది సందర్భాల్లో ఏర్పడతాయి:

  1. అసలు ఉనికిలో లేనే లేని పేజీకి లింకు ఇచ్చినపుడు
  2. పేజీ ఉనికిలో ఉన్నప్పటికీ లింకును తప్పుగా రాసినపుడు
  3. గతంలో ఉనికిలో ఉన్న పేజీని ఇపుడు తొలగించి, దానికి వచ్చే లింకులను తీసెయ్యనపుడు
  4. ట్రాన్స్‌క్లూడు చేసిన మూసల నుండి వారసత్వంగా పేజీలో చేరిన ఎర్రలింకులు

ఎక్కడెక్కడ ఉంటాయి

[మార్చు]

ఎర్రలింకులను వ్యాసంలో కింది చోట్ల మనం చూడవచ్చు:

  1. పేజీ ప్రధాన పాఠ్యంలో
  2. పేజీలో ఇమిడ్చిన సమాచారపెట్టెలో
  3. బొమ్మల వ్యాఖ్యల్లో
  4. పేజీలో ఇమిడ్చిన నేవిగేషను మూసలో (ఫలానా మండలం లోని గ్రామాలు, ఫలానా ఖండం లోని దేశాలు వంటి మూసలు). సాధారణంగా ఇవి పేజీకి అడుగున ఉంటాయి.
  5. వర్గం (ఉనికిలో లేని వర్గాన్ని పేజీలో చేర్చినపుడు)
  6. జాబితా పేజీల్లో, జాబితా లోని ప్రతీ అంశానికీ ఉండవచ్చు

ఈ ప్రాజెక్టు లక్ష్యాలు

[మార్చు]

వ్యాసాల పేజీలు, మూసల పేజీల్లో ఏ ఒక్క పేజీలోనైనా ఉన్న ఎర్రలింకులను 100 లోపుకు కుదించడం, అయోమయ నివృత్తి పేజీల్లో ఉన్న ఎర్రలింకులన్నిటినీ తొలగించడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు

  1. 100 కంటే ఎక్కువ ఎర్రలింకులున్న ప్రధానబరి వ్యాసాల్లో ఎర్రలింకులను తీసెయ్యడం. దీంతో, సుమారు 1000 వ్యాసాల్లో ఉన్న 2,30,000 పైచిలుకు ఎర్రలింకుల్లో గరిష్ఠంగా 2,30,000, కనిష్ఠంగా 1,30,000 పోతాయి.
  2. 100 కంటే ఎక్కువ ఎర్రలింకులున్న మూసల్లో ఎర్రలింకులను తీసెయ్యడం. దీంతో సుమారు 250 మూసల్లో ఉన్న 46,000 పైచిలుకు ఎర్రలింకుల్లో గరిష్ఠంగా 46,000, కనిష్ఠంగా 25,000 పోతాయి. తద్వారా ప్రధానబరిలో, ఈ మూసలను వాడిన పేజీల్లో ఉన్న ఎర్రలింకులు కూడా గణనీయంగా తగ్గిపోతాయి.
  3. ఎర్రలింకులున్న అయోమయ నివృత్తి పేజీలు 1033 ఉన్నాయి. వీటిలో తప్పు లింకులను సవరించడమే కాకుండా, ఇతర ఎర్రలింకులను మరో ఆలొచన లేకుండా తొలగించడం.

ఎర్రలింకుల వర్గాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఈ ప్రాజెక్టు పరిధి లోకి చేర్చడం లేదు. వర్గాల సృష్టి అనేది కొన్ని ఇతర అంశాలతో కూడుకుని ఉన్నందున దీన్ని ప్రత్యేకంగా మరొక ప్రాజెక్టుగా చెయ్యాల్సి ఉంటుంది.

ప్రాజెక్టు వ్యవధి

[మార్చు]

3 నెలలు. 2022 నవంబరు 30 తేదీ నాటికి ఈ పని పూర్తి చెయ్యాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఎర్రలింకుల గణాంకాలు

[మార్చు]

2022 ఆగస్టు 18 నాటికి తెవికీలో ఎర్రలింకుల మొత్తం గణాంకాలు ఇలా ఉన్నాయి.

  1. వ్యాసాల్లో ఎర్రలింకులున్న మొత్తం పేజీల సంఖ్య: 38,284. ఈ పేజీల్లో ఉన్న మొత్తం ఎర్రలింకుల సంఖ్య: 5,23,998. ఇందులో వ్యాసం పాఠ్యం లోనివే కాకుండా, మూసల్లో, వర్గాల్లో ఉన్న ఎర్ర లింకులు కూడా కలిసి ఉంటాయి.
  2. మూసల్లో ఎర్రలింకులున్న మొత్తం పేజీల సంఖ్య: 7542. ఈ మూసల్లో ఉన్న మొత్తం ఎర్రలింకుల సంఖ్య: 1,25,991. ఈ మూసల్లోని ఎర్రలింకులను సవరిస్తే, వ్యాసాల్లోని ఎర్రలింకులు కూడా తగ్గిపోతాయి.
  3. ఎర్రలింకులున్న అయోమయ నివృత్తి పేజీల సంఖ్య 1033 ఉండగా, వాటి లోని మొత్తం లింకులు 1,529.

అత్యధికంగా ఎర్రలింకులున్న పేజీల్లో అంత పెద్ద సంఖ్యలో ఎర్రలింకులుండడానికి ప్రధానమైన కారణం - ఆ పేజీల్లో ఎర్రలింకులున్న మూసలను చేర్చడమే. ఆయా మూసల్లోని ఎర్రలింకులను సవరించినట్లైతే (ఆయా పేజీలను సృష్టించడం, తప్పు లింకులను సవరించడం, లింకులను తీసెయ్యడం) ఆయా వ్యాసాల్లోని ఎర్రలింకుల సంఖ్య ఆ మేరకు తగ్గిపోతుంది. ముఖ్యమైన గమనిక: పై లింకుల గమ్యం పేజీలన్ని ప్రధానబరి లోనివే. ఇతర పేరుబరుల్లోని పేజీలకు ఉన్న లింకులను ఈ గణాంకాల పరిధి లోకి తీసుకోలేదు.

ప్రాజెక్టు ప్రారంభం నాటికి, ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఎర్రలింకుల గణాంకాల స్థితి ఇది:

క్ర.సం పేజీ రకం 100, అంతకు పైబడిన ఎర్రలింకులున్న

పేజీల సంఖ్య

ఈ పేజీల్లో ఉన్న మొత్తం

ఎర్రలింకుల సంఖ్య

ప్రాజెక్టు లక్ష్యం - గరిష్ఠంగా

తగ్గించగల లింకుల సంఖ్య

ప్రాజెక్టు లక్ష్యం - కనిష్ఠంగా

తగ్గించగల లింకుల సంఖ్య

1 ప్రధానబరి వ్యాసాలు 1000 2,29,689 2,29,689 1,29,689
2 మూసలు 248 46,467 46,467 21,667
3 అయోమయ నివృత్తి పేజీలు 1033 (మొత్తం పేజీలు) 1,529 1,529 1,529

ఎర్రలింకులను సవరించేందుకు చేసే పనులు

[మార్చు]

దోషపూరిత లింకును ఇవ్వడం చేత ఏర్పడిన ఎర్రలింకులను సవరించే పద్ధతులు:

  1. ముందుగా, మూసల్లోని - మరీ ముఖ్యంగా నేవిగేషను మూసల్లోని - ఎర్రలింకులను సవరించడం. తద్వారా ఆ మూసలను చేర్చిన అనేక పేజీల్లో లింకులు ఆటోమాటిగ్గా సవరించబడతాయి.
  2. అయోమయ నివృత్తి పేజీల్లో ఎర్రలింకులు: ఎర్రలింకులున్నాయంటే ఆ పేజీ లేదని అర్థం. అసలు పేజీయే లేకపోతే, ఇక అయోమయమేముంది. అంచేత ఆ ఎర్రలింకుల పేజీలను అయోమయ నివృత్తి పేజీల్లోంచి తీసెయ్యాలి.
  3. తప్పు లింకులను సవరించి సరైన పేజీ పేరును ఇచ్చి లింకులను మార్చడం. ఉదా: ఈ దిద్దుబాటు
  4. వ్యాసంలో ఇవి కూడా చూడండి విభాగంలో ఎర్రలింకులు ఉండకూడదు. వ్యాసానికి, వ్యాస విషయానికీ సంబంధించిన పేజీలు తెవికీలో ఇంకా ఉన్నాయి. వాటిని చూడండి అని ఈ విభాగంలో చెబుతాం. ఇక్కడ ఎర్రలింకులివ్వడం భావ్యం కాదు. వాటిని నేరుగా తొలగించవచ్చు.
  5. ఇప్పట్లో పేజీని సృష్టించే అవకాశం లేదు అనిపించిన ఎర్రలింకులను తొలగిస్తే మంచిది. ఉదాహరణకు - తెలుగునాట_ఇంటిపేర్ల_జాబితా పేజీలో 2,551 లింకులున్నాయి. ఆయా ఇంటిపేర్లకు లింకులు సృష్టించగలమా అంటే ఇప్పట్లో అది దాదాపు సంభవం కాదు అనే అనిపిస్తోంది. అంచేత ఈ ఎర్రలింకులను తీసెయ్యవచ్చు.

ఎర్రలింకుల జాబితాలు, ఇతర వనరులు

[మార్చు]

ఎర్రలింకులకు సంబంధించిన వికీలింకులను ఇక్కడ చూడవచ్చు:

  1. ఎర్రలింకుల గమ్యస్థాన వ్యాసాలు - ఇందులో ప్రధానబరి లోని పేజీలే కాకుండా మిగతా పేరుబరుల్లోని పేజీలు కూడా ఉంటాయి. ఈ జాబితా లోని వ్యాసాలను సృష్టించాలి. బ్రాకెట్లోని సంఖ్య, ఆ పేజీకి ఎన్ని పేజీల నుండి లింకులున్నాయో చూపిస్తుంది.
  2. ఈ పరికరం ద్వారా ఎర్రలింకులున్న వ్యాసాల జాబితాను మాత్రమే చూడవచ్చు.
  3. ఎర్రలింకుల మూసలు - ఈ మూసలు అసలు ఉనికిలోనే లేవు. కానీ వివిధ పేజీల్లో వీటిని వాడారు. లేని మూసలను వాడడానికి ప్రధానమైన కారణం, ఇంగ్లీషు నుండి వికీపేజీలను అనువదించినపుడు ఆ పేజీలయ్తో పాటు మూసల లింకులు కూడా వస్తాయి. కానీ ఆయా మూసలను దిగుమతి చేసుకోకపోవడం వలన అవి ఎర్రలింకులుగా కనిపిస్తాయి. నిర్వాహకులు ఈ మూసలను దిగుమతి చేస్తే సరిపోతుంది - ఈ ఎర్రలింకులు నీలిలింకులుగా మారిపోతాయి. బ్రాకెట్లోని సంఖ్య, ఆ మూసను ఎన్ని పేజీల్లో ఇమిడ్చారో చూపిస్తుంది.
  4. ఎర్రలింకుల వర్గాలు - ఈ వర్గాల పేజీలను సృష్టించాలి. బ్రాకెట్లోని సంఖ్య, ఆ వర్గంలో ఎన్ని పేజీలున్నాయో చూపిస్తుంది.
  5. వ్యాసాల్లో ఉన్న ఎర్రలింకుల జాబితా ఇది. దీన్ని క్వారీ నుండి 2022 ఆగస్టు 19 న తీసుకున్నాం.
  6. మూసల్లో ఉన్న ఎర్రలింకుల జాబితా ఇది. క్వారీ నుండి 2022 ఆగస్టు 19 న తీసుకున్న జాబితా.
  7. అయోమయ నివృత్తి పేజీల్లో ఉన్న ఎర్రలింకుల జాబితా ఇది. క్వారీ నుండి 2022 ఆగస్టు 19 న తీసుకున్న జాబితా.

ఎర్రలింకులపై గతంలో జరిగిన చర్చల లింకులు

[మార్చు]

ఎర్రలింకుల అంశంపై గతంలో జరిగిన చర్చలను కింది లింకుల్లో చూడవచ్చు

  1. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_8#మొలకలకు_మరొక_కారణం
  2. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_81#తెలుగు_సినిమా_పేజీల_ఎర్రలింకులు, వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_81#సినిమా_పేజీల_ఎర్రలింకులు
  3. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_55#వర్గాలు,_వర్గీకరణలు
  4. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_81#అయోమయ_నివృత్తి_పేజీల్లో_ఎర్ర_లింకులు

ప్రాజెక్టులో భాగమైన వర్గాలు

[మార్చు]

ప్రాజెక్టుకు సంబంధించిన మెటా పేజీలు, ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకున్న వ్యాసాల పేజీలు కింది వర్గాల్లో ఉంటాయి.

ఉపపేజీలు

[మార్చు]

ప్రాజెక్టులో భాగంగా కింది ఉపపేజీలున్నాయి

ప్రాజెక్టులో పాల్గొన్న వాడుకరులు

[మార్చు]
  1. చదువరి (చర్చరచనలు)
  2. యర్రా రమారావు (చర్చరచనలు)
  3. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు)
  4. కె.వెంకటరమణచర్చ 12:26, 20 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టులో కృషి చేసే వాడుకరుల గుర్తింపులు

[మార్చు]

ప్రాజెక్టు పురోగతి

[మార్చు]
నవంబరు 30 న ప్రాజెక్టు ముగిసే నాటికి వ్యాసాల్లో సంస్కరించిన ఎర్రలింకుల గణాంకాలు
సృష్టించిన కొత్త వ్యాసాలు 229 నేరుగా వాటిద్వారా వ్యాసాల్లో బాగుపడ్డ ఎర్రలింకులు 13,708
సృష్టించిన దారిమార్పులు, చేసిన తరలింపులు 629 తద్వారా వ్యాసాల్లో బాగుపడ్డ ఎర్రలింకులు 58,589
నేరుగా వ్యాసాల్లో సవరించిన లింకుల సంఖ్య (సుమారుగా) 1020
గమ్యాలను సవరించిన మూసలు 230 ఈ మూసలను ప్రతిక్షేపించిన వ్యాసాల్లో

బాగుపడ్డ ఎర్రలింకులు

33,467
ఎర్రలింకుల సవరణలు చేసిన అయోమయ నివృత్తి పేజీలు 83 వీటిలో బాగుపడ్డ ఎర్రలింకులు 52
బాగుపడ్డ మొత్తం ఎర్రలింకులు (క) 1,06,836
మొత్తం తగ్గిన లింకుల సంఖ్య (గ) 2,31,854
తీసివేసిన లింకుల సంఖ్య (క-గ) [పట్టిక-1 మూలాలు 1] 1,25,018
తగ్గిన ఎర్రలింకుల్లో బాగుచేసిన (లక్ష్యాన్ని సరిచేసిన)

ఎర్రలింకుల శాతం

46.07%
  1. ఎర్రలింకుల సవరణలో భాగంగా కొన్ని లింకుల గమ్యాలను సరిచెయ్యడం, కొత్త పేజీలను సృష్టించడం వంటివే కాకుండా, కొన్ని లింకులను తీసివేయడం కూడా జరిగింది. అలా తీసివేసిన లింకులు ఎన్నో ఈ సంఖ్య తెలుపుతుంది.
మొత్తం పేజీల్లో ఎర్రలింకుల గణాంకాలు
అంశం ఎర్రలింకులున్న మొత్తం వ్యాసాల సంఖ్య వ్యాసాల్లో ఉన్న మొత్తం ఎర్రలింకులు ఎర్రలింకులున్న మొత్తం మూసల సంఖ్య మూసల్లో ఉన్న మొత్తం ఎర్రలింకులు ఎర్రలింకులున్న మొత్తం అయోమయ నివృత్తి వ్యాసాల సంఖ్య అ.ని. పేజీల్లో ఉన్న మొత్తం ఎర్రలింకులు
ప్రారంభం 38,284 తగ్గుదల 5,23,998 తగ్గుదల 7,542 తగ్గుదల 1,25,991 తగ్గుదల 1,033 తగ్గుదల 1,529 తగ్గుదల
సెప్టెం 10 38,243 -41 4,62,262 -61,736 7,515 -27 1,15,003 -10,988 1,033 0 1,529 0
సెప్టెం 20 38,263 -21 4,33,657 -90,341 7,410 -132 1,11,048 -14,943 1,044 (+11) పెరిగాయి 1,645 (+116) పెరిగాయి
సెప్టెం 30 37,170 -1,114 3,73,111 -1,50,883 7,445 -97 1,07,661 -18,330 1,029 -4 1,475 -54
అక్టో 10 34,855 -3,429 3,31,206 -1,92,792 7,346 -196 1,02,580 -23,411 1,022 -11 1,467 -62
అక్టో 20 33,533 -4,751 3,08,494 -2,15,504 7,212 -330 96,796 -29,195 1,021 -12 1,466 -63
అక్టో 30 33,237 -5,047 2,99,916 -2,24,082 7,046 -496 89,605 -36,386 1,017 -16 1,461 -68
నవం 10 32,470 -5,814 2,95,845 -2,28,153 7022 -520 89242 -36,749 1,010 -23 1,447 -82
నవం 20 32,071 -6,313 2,92,830 -2,31,168 6,997 -545 88499 -37,492 925 -108 1,129 -400
నవం 30

(ప్రాజెక్టు ముగింపు)

31,688 -6,596 2,92,144 -2,31,854 7,010 -532 88571 -37,420 920 -113 1,122 -407


100 కంటే ఎక్కువ ఎర్రలింకులున్న పేజీల గణాంకాలు
క్ర.సం తేదీ 100, అంతకు పైబడిన ఎర్రలింకులున్న

పేజీల సంఖ్య

ఈ పేజీల్లో ఉన్న మొత్తం

ఎర్రలింకుల సంఖ్య

ఇప్పటివరకు సాధించినది

- పేజీల సంఖ్యలో తగ్గింపు

ఇప్పటివరకు సాధించినది

- ఎర్రలింకుల సంఖ్యలో తగ్గింపు

ప్రధానబరి వ్యాసాలు

(1000)

మూసలు

(248)

అ.ని. పేజీలు

(1033)

ప్రధానబరి వ్యాసాలు

(2,29,689)

మూసలు

(46,467)

అ.ని. పేజీలు

(1,529)

ప్రధానబరి

వ్యాసాలు

మూసలు అ.ని. పేజీలు ప్రధానబరి

వ్యాసాలు

మూసలు అ.ని. పేజీలు
1 ప్రాజెక్టు ప్రారంభ స్థితి 1000 248 1033 2,29,689 46,467 1,529
2 2022 సెప్టెంబరు 10 921 226 1,033 1,70,614 36,154 1,529 79 22 0 59,075 10,313 0
3 2022 సెప్టెంబరు 20 811 205 1,044 1,39,086 32,430 1,645 189 43 +11 90,603 14,037 +116
4 2022 సెప్టెంబరు 30 523 190 1,029 79,004 29,789 1,475 477 58 3 1,50,685 16,678 54
5 2022 అక్టోబరు 10 433 183 1,022 65,090 28,220 1,467 567 65 11 1,64,599 18,247 62
6 2022 అక్టోబరు 20 391 137 1021 59,610 24,421 1466 609 111 12 1,70,079 24,046 63
7 2022 అక్టోబరు 30 381 110 1017 58,207 19,330 1461 619 138 16 1,71,482 27,137 68
8 2022 నవంబరు 10 377 110 1010 57,947 19,323 1447 623 138 23 1,71,742 27,144 82
9 2022 నవంబరు 20 375 108 925 57,738 19,038 1129 625 140 108 1,71,951 27,429 400
10 2022 నవంబరు 30

(ప్రాజెక్టు ముగింపు)

377 108 920 58,153 19,033 1122 623 140 113 1,71,536 27,431 407

ప్రాజెక్టు నిర్వాహకులు

[మార్చు]

చదువరి

ప్రాజెక్టు ఫలితాలు

[మార్చు]

ప్రాజెక్టులో భాగంగా 229 కొత్త పేజీలు, 629 దారిమార్పు పేజీలను సృష్టించాం. మొత్తం 230 మూసల్లో ఎర్రలింకుల గమ్యాలను సవరించాం. తద్వారా మొత్తం 1,06,836 ఎర్రలింకులు నీలిలింకులుగా మారాయి. 100 కంటే ఎక్కువ ఎర్రలింకులున్న పేజీలు, ప్రాజెక్టు ప్రారంభంలో 1000 ఉండగా ముగిసేటప్పటికి ఇందులో 623 పేజీలను తగ్గించాం. ఆ వెయ్యి పేజీల్లో ఉన్న మొత్తం లింకుల సంఖ్య 2,29,689 ఉండేవి. వాటిలో గరిష్ఠంగా మొత్తం అన్నిటినీ సంస్కరించాలి, కనీస స్థాయిలో 1,29,689 లింకులనైనా తగ్గించాలి అనేది ప్రాజెక్టు లక్ష్యం. ప్రాజెక్టు ముగిసేటప్పటికి 1,71,536 లింకులను తగ్గించాం. గరిష్ఠ లక్ష్యంలో 75%, కనిష్ఠ లక్ష్యం కంటే 32% ఎక్కువగాను (అంటే 132% సాధించినట్లు) ను సాధించాం. అయితే ప్రాజెక్టు సాధించినది 75% గానే తీసుకుంటున్నాం.

ఇప్పుడు ఆ సంఖ్యలు - పేజీల సంఖ్య: 377, లింకుల సంఖ్య: 58,153 గా ఉంది.

ఈ పనిలో భాగంగా కింది అంశాలు దృష్టి లోకి వచ్చాయి.

  1. కేవలం ఎర్రలింకులు మాత్రమే ఉన్న నేవిగేషను మూసలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్నిటి గమ్యాలను సరిచేసి నీలిలింకులుగా మార్చాం. ఆ మూసల్లో ఉన్న మిగతా ఎర్రలింకులను తీసేసాం. లింకులను మాత్రమే తీసేసాం, పాఠ్యం ఉంటుంది. ఉదాహరణకు బళ్ళారి జిల్లా గ్రామాలు, బాగల్‌కోట్ జిల్లా గ్రామాలు, Integers విశ్వము
    • పై మూసల్లో చాలావరకు గమ్యం పేజీల్లేని ఎర్రలింకులే. అంటే అసలు ఈ నేవిగేషను మూసల అవసరమే లేదన్నమాట.
  2. అలాగే, అసలు ఏ పేజీనుండీ ఇన్‌కమింగు లింకుల్లేని నేవిగేషను మూసలు అనేకం ఉన్నాయి. వీటిలో కొన్నిటికి కేవలం వేరే మూసల నుండి మాత్రమే ఇన్‌కమింగు లింకులు ఉన్నాయి - వ్యాసాల నుండి లేవు. ఆ "ఇక్కడికి లింకున్న" మూసలకు మళ్ళీ ఏ వ్యాసం నుండీ లింకుల్లేవు. అంటే మొత్తమ్మీద ఈ మూసలేవీ కూడా అవసరం లేదన్నమాట. అలాంటి మూసలను కొన్నిటిని తొలగించాం. కొన్ని ఇంకా ఉన్నాయి. ఉదా: {{ఆస్టరాయిడ్స్}},{{గ్రహ వలయాలు}},{{శని}},{{గురుడు}}
    • కొద్ది తేడాలతో గానీ, అసలు తేడాయే లేకుండా గానీ రెండేసి పేజీలున్న మూసలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తొలగించాం.
  3. కొన్ని జాబితా వ్యాసాల్లో ఐదారు నీలి లింకులు, వేలాది ఎర్రలింకులూ ఉన్నాయి. వాటిలో నీలి లింకులను ఉంచి, ఎర్రలింకులను తీసేసాం. ఉదా: రైల్వే స్టేషన్ల జాబితా, ఇంటిపేర్ల జాబితా. (జాబితా పేజీల్లో కొద్దిపాటి ఎర్రలింకులు ఉంటే పరవాలేదు గానీ బాగా ఎక్కువగా ఎర్రలింకులు ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రధానంగా జాబితాలో ఉన్న ప్రతీ అంశానికీ పేజీ ఉండాలనేది మూలసూత్రం, ఫలానా పదానికి వ్యాసం ఉండాలని చూపేలా ప్రత్యేకించి ఎర్రలింకు పెట్టాల్సిన పనిలేదు. లింకులు లేనివాటికి పేజీ సృష్టించే అవసరం ఉంది అనేది స్పష్టం. అంచేత చాలా పెద్ద యెత్తున ఎర్రలింకులు ఉంచాల్సిన అవసరం లేదు, లింకును తీసెయ్యవచ్చు.)
  4. ఎర్రలింకులను తీసివేయడానికి కొన్ని సందర్భాల్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ను వాడాం. ఇంగ్లీషు వికీ నుండి తెచ్చి, అనువదించకుండా వదిలేసినవాటిలో, గమ్యం ఉన్నవాటిని సరిచేసాక, మిగిలిపోయిన ఇంగ్లీషు ఎర్రలింకులను తీసేసేందుకు ఈ పద్ధతిని వాడాం.
  5. భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా చాలా పెద్ద పేజీ అయినందున దిద్దుబాటుకు లొంగేది కాదు. అందుచేత దానిలోని ఎర్రలింకులను తీసేసేందుకు ఆటోవికీబ్రౌజరును ఉపయోగించాం.
  6. ప్రాజెక్టులో నలుగురు వాడుకరులం పాల్గొన్నాం. నేరుగా పాల్గొనకపోయినా, ప్రాజెక్టు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసినవారు కూడా ఉన్నట్లు గమనించాం. వారందరికీ అభినందనలు.