Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు/పురోగతి (మొదటి దశ)

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా గురించి వాడుకరులు స్వయంగా నేర్చుకోగలిగే పాఠ్య ప్రణాళిక, దానికి అవసరమైన అన్ని రకాల బోధనా ఉపకరణాలు తయారుచేసి అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రాజెక్టు మొదటి దశలో (2021 ప్రథమార్థం) దీన్ని ఫండ్ చేసేందుకు సీఐఎస్-ఎ2కె సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రాజెక్టు మొదటి దశ, ఫిబ్రవరి 15వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఉంటుంది.

ఫిబ్రవరి

[మార్చు]

తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టులో భాగంగా ముందుగా తెలుగు వికీపీడియాలో ఉన్న సహాయం పేజీలు, విధానాలు - మార్గదర్శకాల పేజీలను వాటి స్థాయి (సమాచారం అనువాద స్థాయి, కొత్తవారికి మార్గదర్శకం)న ఆధారంగా ఒక జాబితాలు తయారుచేయాలని ప్రాజెక్టు కమిటి సూచించింది. ఆ సూచనతో తెవికీలో ప్రధానంగా ఉన్న 90 సహాయం పేజీల జాబితాతో సహాయం పేజీల సూచిక, 78 విధానాలు - మార్గదర్శకాల పేజీల జాబితాతో విధానాలు - మార్గదర్శకాల పేజీల సూచిక పేజీని తయారు చేశాము. ఈ జాబితా ద్వారా ఆయా పేజీలన్నింటిని అన్నిఒకచోట చేర్చడమేకాకుండా, ఆయా వ్యాసాలలో సమాచారం ఎలా ఉంది, ఎంతశాతం అనువాదం అయింది, సమాచారం కొత్త వాడుకరులకు మార్గదర్శకంగా ఉందా లేదా, ఆయా పేజీల్లో చేయాల్సిన మార్పులు చేర్పులు మొదలైన వివరాలను కూడా పేర్కొనడం జరిగింది.

స్వాగతం పేజీ మొదలైన వాటిద్వారా ఈ సహాయం పేజీలను కొత్త వాడుకరులకు పరిచయం చేస్తే, వారు వికీ రచనలో మెళకువల గురించి స్వయంగా నేర్చుకోగలుగుతారన్న అభిప్రాయంతో ఈ సహాయం పేజీల సూచిక, విధానాలు - మార్గదర్శకాల పేజీల సూచికల గురించి తెవికీ రచ్చబండలో సహ సభ్యులుకు తెలియపరుస్తూ, ఈ సహాయం పేజీల సూచికను, సహాయం పేజీలను పరిశీలించి తమ స్పందన తెలియజేయవలసిందిగా కోరాము. ప్రస్తుతం తెవికీలో జరుగుతున్న గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్టు, బిబిసి-ISWOTY ప్రాజెక్టులలో వ్యాసాల రచనను ఈ సహాయం పేజీలను ఉపయోగించుకోవచ్చు.

మార్చి

[మార్చు]
  1. సహాయం పేజీల సూచిక, విధానాలు - మార్గదర్శకాల పేజీల సూచికల తయారి గురించి తెలుగు వికీపీడియా రచ్చబండలో రాసి, వికీ సభ్యులు ఆయా పేజీలను చూసి తగు సూచనలు చేయాలని కోరాను.
  2. ఫిబ్రవరి నెలలో తయారుచేసిన సహాయం పేజీల సూచిక, విధానాలు - మార్గదర్శకాల పేజీల సూచిక ను పరిశీలించిన చదువరి గారు కొన్ని సహాయం పేజీల్లో సవరణలు చేశారు. ఆ సవరణలను అనుసరించి సూచికల పేజీల్లో మార్పులు చేసాను.
  3. సహాయం పేజీలు, విధానాలు - మార్గదర్శకాల పేజీల్లో చేయాల్సిన పని గురించి సూచికల పేజీలకు సంబంధించిన చర్చ పేజీల్లో (సహాయం పేజీల సూచిక చర్చాపేజీ, విధానాలు మార్గదర్శకాల పేజీల సూచిక చర్చాపేజీ) చదువరి గారు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలను అనుసరించి పేజీల్లోని సమాచార విశ్లేషణ చెయ్యాలి.
  4. జర్నలిజం స్కూల్ నుండి శివ గారు కాల్ చేశారు. వారి స్టూడెంట్స్ కు వచ్చేనెల మొదటివారంలో ఒకపూట వికీపీడియా శిక్షణ ఇవ్వాలని అడిగారు.
  5. ఐఐఐటీలో జరుగుతున్న వికీ ఇండిక్ ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న కార్యకలాపాల గురించి, కొత్తవారికి శిక్షణ ఇవ్వడానికి వారు అవలంబిస్తున్న విధానాలను, వారి అనుభవాలను తెలుసుకోవడానికి మార్చి 23న ఐఐఐటీకి వెళ్ళాను. అక్కడ కశ్యప్ గారిని, నిఖిల్ ని కలిసాను. కొత్తవారు వికీపీడియా రచన సులువుగా నేర్చుకోవడంకోసం తెలుగు వికీపీడియా పరిచయంతో మొదలై బేసిక్ ఎడిటింగ్ వరకు 15 ట్రైనింగ్ పాఠాలు తయారు చేశారు. వాటిని పరిశీలించాను. అలాగే, ఐఐఐటి వారి వికీ ఇండిక్ ప్రాజెక్టు కోసం రూపొందించిన ఐఐఐటి ప్రయోగశాలలో జరుగుతున్న వ్యాసరచన, వ్యాసాల దిద్దుబాట్లు చూశాను.

ఏప్రిల్

[మార్చు]
  1. సహాయం పేజీలు, విధానాలు - మార్గదర్శకాల పేజీల జాబితాకు సంబంధించి చదువరి గారు చేసిన సూచనలను అనుసరించి సవరణలు (జాబితాలో మరిన్ని పేజీలు చేర్చడం, పేజీల్లోని సమాచారానికి సంబంధించిన ఎడిటరు వివరాలు, పేజీల అనువాద స్థితి, సృష్టించిన వారి పేరు చేర్చడం) చేశాను. వాటి గురించి సహాయం పేజీల సూచిక చర్చాపేజీ, విధానాలు మార్గదర్శకాల పేజీల సూచిక చర్చాపేజీ లలో చూడవచ్చు.
  2. విధానాలు, మార్గదర్శకాల పేజీల్లోని సమాచారాన్ని, ఇంగ్లీషు పేజీల ప్రకారం చూడగా... ప్రస్తుతమున్న తెలుగు పేజీల్లో అవసరమైనంత మేరకు సమాచారం ఉందని తేలింది. కాకపోతే, జాబితాలో ఉన్న ఎర్రలింకు పేజీల (10) ను సృష్టించాలి. కొన్ని (10) పేజీలలోని ఆంగ్ల పాఠ్యాన్ని అనువదించాలి.
  3. సహాయం పేజీలు, విధానాలు - మార్గదర్శకాల పేజీల్లోని సమాచారంలో కాలదోషం పట్టిన సమాచారాన్ని గుర్తించే పని జరుగుతోంది.
  4. తెవికీ శిక్షణ కోసం తయారుచేసిన వికీపీడియా స్వయంశిక్షణ (2013), వికీపీడియాలో రచనలు చేయుట (2014) పుస్తకాలను పరిశీలించాను.
  5. ఇంగ్లీష్ వికీలోని Wikipedia:Training/For students/Resources, Wikipedia:Training/For educators/Resources పేజిల్లోని సమాచారాన్ని పరిశీలించాను.
  1. ఐఐఐటీ ప్రాజెక్టులో శిక్షణ పొందుతున్న ఇద్దరు ఇంటర్న్స్ కి గూగుల్ మీట్ వేదికగా తెలుగు వికీపీడియాలో సినిమా వ్యాసాల రచన గురించిన శిక్షణ అందించాను. ఇందులో సినిమా వ్యాసం శైలీ, సమాచార సేకరణ, వికీకరణ, మూలాలు చేర్చడం వంటి వాటి మీద అవగాహన కలిగించాను. కొత్త వాడుకరులు సులభంగా సినిమా వ్యాసాలు రాయడానికి ఎలాంటి ట్రైనింగ్ మెటీరియల్ కావాలన్నది ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మరింతగా తెలిసింది. ఇందుకోసం సినిమా వ్యాసాల రచనకు సంబంధించిన సినిమా వ్యాసాల శైలీ పేజీని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటూ, ఈ పేజీలోని మెటీరియల్ చదువుకొని సినిమా వ్యాసాలను రాయాలని సూచించాను.
  2. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/సహాయం పేజీల సూచిక జాబితాలోని 67 నుండి 85 వరకు గల పేజీల్లో కాల్దోషం పట్టిన సమాచారాన్ని పరిశీలించాను.
  3. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/విధానాలు, మార్గదర్శకాల పేజీల సూచిక జాబితాలోని 1 నుండి 35 వరకు గల పేజీల్లో కాల్దోషం పట్టిన సమాచారాన్ని పరిశీలించాను.
  4. తెలుగు వికీపీడియాలో ఉన్న సహాయం పేజీలు, విధానాలు - మార్గదర్శకాల పేజీలను కొత్త వాడుకరులకు పరిచయంచేసి, ఆయా పేజీల ద్వారా వికీ రచన నేర్చుకునే విధానంపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నాను.

జూన్

[మార్చు]
  1. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/సహాయం పేజీల సూచిక జాబితాలోని 86 నుండి 100 వరకు గల పేజీల్లో కాల్దోషం పట్టిన సమాచారాన్ని పరిశీలించాను. సహాయం పేజీల్లోని సమాచారం ప్రస్తుత వికీని సరిపోతుంది. సైట్ ఆకృతి, కొన్ని ఆప్షన్స్ మారిన కారణంగా కొన్నికొన్ని పేజీలలో ఉన్న స్ర్కీన్ షాట్స్ మార్చుకోవలసి వుంటుంది.
  2. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/విధానాలు, మార్గదర్శకాల పేజీల సూచిక జాబితాలోని 36 నుండి 78 వరకు గల పేజీల్లో కాల్దోషం పట్టిన సమాచారాన్ని పరిశీలించాను. విధానాలు, మార్గదర్శకాల పేజీల్లోని సమాచారం ప్రస్తుత వికీని సరిపోతుంది. సైట్ ఆకృతి, కొన్ని ఆప్షన్స్ మారిన కారణంగా కొన్నికొన్ని పేజీలలో ఉన్న స్ర్కీన్ షాట్స్ మార్చుకోవలసి వుంటుంది.
  3. వికీపీడియా శిక్షణ కోసం రూపొందించిన వీడియోలు (కామన్స్ లో, యూట్యూబ్ లో) చూసి, అందులోని కంటెట్, శిక్షణ విధానం, స్క్రీన్ రికార్డింగ్ పద్ధతులు, వీడియో మేకింగ్ గురించి తెలుసుకున్నాను.
  4. వికీ రచనలో ఉన్న సందేహాలు, రచనా పద్ధతుల గురించి కొత్త వాడుకరులతో మాట్లాడి చర్చించి వారికి ఏఏ అంశాల గురించి శిక్షణ అవసరమో తెలుసుకున్నాను. తద్వారా మరింత సమాచారయుక్తంగా వికీ శిక్షణ ఉపకరణాలను తయారుచేయడం వీలవుతుంది.