వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన
ప్రాజెక్టు ఉద్దేశం
వికీపీడియన్లతో కలిసి తెలుగు వికీపీడియాను వాసిపరంగా, రాసిపరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చెయ్యడం.
ప్రాజెక్టు బృందం
నిపుణులైన సారథ్య బృందం నేతృత్వంలో ప్రాజెక్టు ముందుకు పోతుంది. ఐఐఐటీ బృందంతో పాటు, వికీపీడియన్లు, ఔత్సాహిక సామాజికులు మొదలైన వారు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు.
• డా. రాజ్ రెడ్డి – ఈసరికే చురుగ్గా ఉన్నారు
• భారత ప్రభుత్వం - చర్చలు సాగుతున్నాయి
• తెలంగాణ ప్రభుత్వం - చర్చలు సాగుతున్నాయి
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - అభ్యర్ధించాలి
• వికీమీడియా ఫౌండేషన్ - తెవికీ సముదాయం సమ్మతి లభించాక, ఫౌండేషన్ను అభ్యర్ధించాలి.
ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులు
• ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో తెలుగు వికీపీడియా గురించి అవగాహన కలిగించడం
• ఆసక్తి కలిగిన వ్యక్తులతో ఔత్సాహిక వికీపీడియనుల సముదాయాలను తయారుచెయ్యడం. వీరికి వికీపీడియాలో రచనలు చెయ్యడం గురించి శిక్షణ ఇవ్వడం. (ఈ పనిలో అనుభవజ్ఞులైన వికీపీడియనుల సాయంతో.)
• ఈ ఔత్సాహిక ఎడిటర్ల నుండి కొందరిని ఎంచుకుని మరింత లోతైన శిక్షణ ఇవ్వడం. తద్వారా వారు భవిష్యత్తులో కింది స్థాయిలకు వెళ్ళగలరు –
o ఉన్నత స్థాయి ఎడిటర్లు (మూసలు, మంచి వ్యాసాలు, విశేష వ్యాసాల వంటి వాటిపై పనిచెయ్యగల శక్తియుక్తులతో) o నిర్వాహకులు o శిక్షకులు
లక్ష్యిత ప్రజలు
ప్రాజెక్టు తొలినాళ్ళలో కింది వర్గాల ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తాము
1. ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్స్ సముదాయం
2. పాత్రికేయులు
3. రచయితలు
4. విద్యార్థులు
5. ఔత్సాహిక సామాజికులు
పని విధానం
ఈ ప్రాజెక్టు పనులు మూడు విధాలుగా సాగాలని భావిస్తున్నాం –
• క్షేత్ర స్థాయిలో కృషి చేసి, కొత్త ఎడిటర్లను తయారు చెయ్యడం
• వ్యాసాల నాణ్యతను అభివృద్ధి చేసేందుకు అవసరమైన వనరులను సమకూర్చడం
• ఎడిటర్ల ఉ ఉత్పాదకతను వేగవంతం చేసేందుకు దోహదపడే సాంకేతికతను అభివృద్ధి చేసి అందించడం
క్షేత్ర స్థాయి కార్యకలాపాలు
క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం. వికీకి దూరంగా ఉన్న సమర్ధులు, ఆసక్తిపరుల వద్దకు వికీపీడియాను తీసుకొని పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఇందులో కొన్ని పనులు:
1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా జిల్లాల్లోని పాఠశాలలకు వెళ్ళి అక్కడి ఉపాధ్యాయులకు వికీపీడియాను పరిచయం చెయ్యడం, వికీలో రాయడం పట్ల ఆసక్తి కలిగించడం.
2. ఉపాధ్యాయ సంఘాల ద్వారా విశ్రాంత ఉపాధ్యాయులను కలిసి వారిలో వికీపీడియా పట్ల ఆసక్తి కలిగించడం.
3. మీడియా ద్వారా ప్రజల్లో ఈ ప్రాజెక్టు పట్ల అవగాహన కలిగించడం.
4. సెమినార్లు, శిక్షణా తరగతులు, వర్కుషాపులూ మొదలైన వాటి ద్వారా ఔత్సాహికులకు వికీ శిక్షణ ఇవ్వడం, వికీలో దిద్దుబాట్లు చెయ్యడం మొదలుపెట్టించడం.
5. వాడుకరులు వాడుకరి సముదాయాలను స్థాపించుకుని, తమలో తాము సమావేశాలు నిర్వహించుకునేలా ప్రోత్సహించడం
6. కొత్త వాడుకరులకు అవసరమైతే కంప్యూటరు పరిజ్ఞానం కలిగించడం
7. తెవికీలో ఒకప్రాజెక్టును మొదలుపెట్టి కొత్త వాడుకరులకు ఆన్-వికీ సహాయం అందించడం.
కంటెంటు సహాయం
కొత్త వికీపీడియన్లకు తమ పనిలో సహాయకంగా ఉండేందుకు గాను, కింది అంశాలను అందిస్తుంది. (వీటిలో కొన్ని పాత వికీపీడియన్లకు కూడా ఉపయోగపడవచ్చు.)
1. వికీపీడియా గురించి స్వయం శిక్షణ పొందేలా పాఠాలు, ట్యుటోరియళ్ళు, వీడియోలు, మొదలైన వాటిని రూపొందించడం, కావలసిన వారికి ఉచితంగా అందించడం
2. వ్యాసాలకు అవసరమైన రిఫరెన్సులను - పుస్తకాలు, ఆన్ లైన్ గ్రంథాలయ సభ్యత్వాలు, ఫొటోలు, మొదలైన వాటికి- అందుబాటుకు ప్రయత్నం
3. వివిధ అంశాలవారీగా తెవికీలో ఉండాల్సిన ముఖ్యమైన వ్యాసాల జాబితాలను తయారు చేసి ఎడిటర్లకు సహాయకంగా ఉంచడం.
సాంకేతిక సహాయం
ఐఐఐటీ బృందం క్రింది వాటికి సాఫ్టువేరు అప్లికేషన్లను రూపొందించి అందరికీ అందుబాటులో ఉంచాలని ఉద్దేశిస్తోంది. ఎడిటర్ల ఉత్పాదకతను పెంచడం వీటి ఉద్దేశం.
యాంత్రికానువాదం లోని లోటుపాట్ల గురించి, గతంలో తెవికీలో జరిగిన పొరపాట్ల గురించీ, నాణ్యత లేని వ్యాసాల గురించీ ఐఐఐటీ బృందానికి కొంత అవగాహన ఉంది. తెవికీ సముదాయంతో కలిసి పనిచేసి అటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు కృషి చేస్తాము. కొన్ని ఉపాయాలు – · పరికరాన్ని వాడుతూ, నాణ్యతను మెరుగుపరచడంలో కొత్త ఎడిటర్లకు శిక్షణ ఇవ్వడం.
· సాటివారి సమీక్ష లేకుండా అనువాద వ్యాసాన్ని ప్రచురించే వీలు లేకుండా చెయ్యడం.
· అనువాద నాణ్యతను పరీక్షించేందుకు గాను ఎడిటర్లకు ఒక చెక్‌లిస్టును తయారు చేసి ఇవ్వడం (పాసివ్-యాక్టివ్ వాయిస్, “మరియు” వగైరాలు)
· తరచూ వాడే పదాలు, వాటి అనువాదాల గురించి ఒక పదకోశాన్ని తయారు చేసి అందుబాటులో ఉంచడం. మామూలు నిఘంటువు లాగా విస్తారంగా కాకుండా, ఇది కొద్ది పదాలతో (సందర్భోచితంగా ఏ పదాన్ని వాడాలో తెలిపేలా) మాత్రమే కూడుకుని ఉంటుంది.
Dollyrajupslp 09:00, 13 నవంబర్ 2019 (UTC)
హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2019 తెవికీ స్టాల్ నివేదిక
[మార్చు]ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ - హైదరాబాద్) భారతీయ భాషలలో వికీపీడియా వ్యాసాలు గణనీయంగా పెంచాలన్న లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ ఇండిక్ వికీ’ చేపట్టింది. ఈ బృహత్తర ప్రాజెక్ట్ కు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఇందులో భాగమైన ‘ప్రాజెక్ట్ తెలుగు వికీ’ కి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయి.తెలుగు వికిపీడియా పై అవగాహన పెరిగితే అది సముదాయ అభివృద్ధిలో, వికీ వాలంటీర్ల సంఖ్య పెంచడంలో దోహదపడుతుంది కాబట్టి ‘అవగాహన’ విభాగం కింద కార్యక్రమాలు తక్షణమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో జరిగే పుస్తక ప్రదర్శన (బుక్ ఫెయిర్- 2019) మంచి వేదిక అవుతుందని, కాబట్టి బుక్ ఫెయిర్ లో వికీపీడియా స్టాల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టాల్ ఏర్పాటు ప్రణాళిక- బాధ్యతల వివరాలు: బుక్ ఫెయిర్ లో తెలుగు వికీ స్టాల్ ఏర్పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సమష్టి బాధ్యతగా భావించినప్పటికీ, నిర్వహణా సౌలభ్యం కోసం పనుల విభజన జరిగింది. స్టాల్ కి అనుమతి తీసుకోవడం, స్టాల్ ఏర్పాటు, ప్రచార సామగ్రిగా కరపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు సమకూర్చడం లాంటి బాధ్యతల్ని డిజిటల్ మీడియా విభాగం, తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ, తీసుకోగా, తెలుగు వికీపీడియా గురించి సందర్శకులకు వివరించే వాలంటీర్లను స్టాల్ లో అందుబాటులో ఉంచే బాధ్యతను ఐఐఐటీ హైదరాబాద్ వారు తీసుకున్నారు .విశేష ప్రజాదరణ కలిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ప్రతీ సంవత్సరం లాగానే , ఈసారి కూడా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్శకులు వికీ స్టాల్ ను చాలా ఆసక్తితో తిలకించారు. స్టాల్ గూర్చి అడిగి తెలుసుకున్నారు. సుమారు ఒక వెయ్యి మంది స్వచ్చందంగా వికీ వాలంటీర్లు గా ఉండ డానికి ముందుకు వచ్చి, తమ వివరాలను అందించి, వికీ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉత్సాహాన్ని కనబరిచారు అలా వివరాలు అందచేసిన వారందరికీ ప్రతి శనివారం ఐఐఐటీ ప్రాంగణం లో తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం. తెలుగు వికీపీడియా పుస్తక ప్రదర్శన సందర్శకులను కొంతమంది ఫిబ్రవరి 8, 2020న నిర్వహించిన తెలుగు వికీపీడియా - 2020 సదస్సు లో కూడా పాల్గొన్నారు,
తెవికీ స్టాల్ పూర్తి నివేదిక ను ఇక్కడ చూడవచ్చు.
వికీపీడియా అవగాహన మరియు ప్రాధమిక శిక్షణ సదస్సులు
[మార్చు]ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులు లలో భాగంగా , తెలంగాణా ప్రభుత్వ సహాయంతో హైదరాబాదు పుస్తక ప్రదర్శన లో తెలుగు వికీపీడియా స్టాలు ఏర్పాటు చేసాం , తెలుగు వికీపీడియా సదస్సు 2020 : ఈ శనివారం 08 ఫిబ్రవరి, 2020 న ఉదయం తొమ్మిది గంటలకు ఐఐఐటి గచ్చిబౌలి క్యాంపస్ లో నిర్వహించాం. ఐఐఐటి లొ జనవరి 4 వ తారీఖు నుండి ప్రతిశనివారము కంప్యూటర్ , మొబైల్ లలో తెలుగు వాడటానికి , రాయటానికి అవగాహనతోపాటు , వికీపీడియా గురించిన ప్రాధమిక ప్రాధమిక శిక్షణ సదస్సు నిర్వహిస్తున్నాం. ఇందులో తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో పాల్గొనువారు వికీపీడియాకి తోడ్పడటమెలాగో నేర్చుకుని తద్వారా తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపందని పోగేసే మహా ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం . ఈ సదస్సులో తెలుగు వికీపీడియన్ లు కూడా పాల్గొని కొత్త వారికి తొర్పాటు అందించవలసినదిగా , ఈ కార్యక్రమం ఇంకా మెరుగుపడటానికి తగిన సూచనలు అందచేయవలసినదిగా విన్నపం. ఇలాంటి కార్యక్రమాలు ఇతర ప్రదేశాలలొ కూడా జరపటానికి సంబందిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాము , మీకు తెలిసిన సంస్థల పేరుకూడా సూచించగలరు.
ఇది పూర్తిగామూడు గంటలకు పరిమితమైన ప్రాధమిక శిక్షణ కాబట్టి కొత్త వాడుకరులు నేర్చుకోవడానికి ఒక sandbox ద్వారా శిక్షణ ఇస్తున్నాం, దీని కోసం తయారు చేసిన ఒక ప్రజంటేషన్ ఇక్కడ చూడవచు, మార్పులు వుంటే సమూహ సబ్యులు కింద చర్చలొ తెలియచేయగలరు , ఇక్కడ వికీనిబంధనల ప్రకారం రాయగలిగిన వారికి తెలుగు వికీపీడియాలో రావలసినదిగా సూచిస్తున్నాం, ఒక కరపత్రం కూడా ఇస్తున్నాం.
రాబోవు ప్రాధమిక శిక్షణ సదస్సు కొరకు ప్రోగ్రామ్ షెడ్యూల్
తేదీ :శనివారం ఫిబ్రవరి 15,2020 , తేదీ :శనివారం ఫిబ్రవరి 22,2020,తేదీ :శనివారం ఫిబ్రవరి 29,2020,
సమయం :ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:00 వరకు
స్థలం: టీచింగ్ ల్యాబ్ 330 - ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గచ్చిబౌలీ , హైదరాబాద్ - 50003 Teaching Lab , Nilagiri Block International Institute of Technology Gachibowli Hyderabad .
సంభాషించుట,కు : 9959263974 / 9396533666 ఇంకా ఎమైనా సూచనలుకు , సలహలకు లెదా చర్చ ఇక్కడ గానీ , చర్చా పెజీలొ కానీ తెలపండి Newwikiwave (చర్చ) 17:22, 13 ఫిబ్రవరి 2020 (UTC)
తెలుగు వికీపీడియా - 2020 సదస్సు నివేదిక
[మార్చు]ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐఐటి, హైదరాబాద్) ఫిబ్రవరి 8, 2020న తెలుగు వికీపీడియా - 2020 సదస్సును నిర్వహించింది. ఇందులో ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు ఐఐఐటి, హైదరాబాద్ ఛైర్మన్ ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, రిటైర్డ్ IAS మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జయప్రకాష్ నారాయణ్, మాజీ MLC శ్రీ కె. నాగేశ్వర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ, ఐఐఐటి, హైదరాబాద్ సంచాలకులు ఆచార్య పి.జె. నారాయణన్, ఇండిక్ వికీ ప్రాజెక్ట్ పరిశోధకులు, ఆచార్య వాసుదేవ వర్మ, ఐటీ శాఖ సహాయ సంచాలకులు శ్రీ మాధవ్ ముడుంబై తదితరులు పాల్గొన్నారు. దీనికి 1200 పైగా తెలుగు భాషాఅభిమానులు విద్యార్థులు , సాంకేతిక నిపుణులు , తెలుగు బ్లాగరులు పాల్గొన్నారు . భోజనానంతరం సమాచార లభ్యత & అభివృద్ధి , ప్రాజెక్టు అవలోకనం మరియు వ్యూహం భాగంగా ఇండిక్ వికీపీడియా యొక్క వివిధ అంశాలపై పనిచేసే ఫోకస్ సమూహాల మధ్య మేధో మధన కార్యక్రమం జరిగినది ఇందులో ఇండిక్ వికీపీడియా ప్రాజెక్టు సభ్యులు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా ఐఐఐటి, హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ పి.జె. నారాయణన్ స్వాగతోపన్యాసం చేస్తూ తెలుగు వికీ ప్రాజెక్టు సమకాలీన సమాజానికి అత్యంత ఉపయోగకరమైనదని, దీనికి అన్నివిధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న భారత ప్రభుత్వ మరియు తెలంగాణ ప్రభుత్వ ఐ .టి శాఖలకు అయన ధన్యవాదాలు తెలిపారు. ప్రొఫెసర్ వాసుదేవ వర్మ ప్రాజెక్టు తెలుగు వికీ కార్యకలాపాలను వివరిస్తూ, ప్రాజెక్ట్ తెలుగు వికీ బృందాన్ని నాలుగు ఫోకస్ గ్రూపులుగా విభజించడం జరిగిందని, ప్రతి శనివారం వికీ కార్యశాలలను ఐఐఐటి, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని, హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌లో తెవికీ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఇప్పటివరకు ప్రాజెక్ట్ తెలుగు వికీలో స్వచ్ఛందంగా భాగస్వాములవ్వడానికి సుమారు 800 మంది ఔత్సాహికులు ముందుకు వచ్చారు. వికీ నాణ్యత విషయంలో రాజీ పడకుండా రాబోయే సంవత్సరాల్లో 30 లక్షల వికీ కథనాలను రూపొందించడం ప్రాజెక్టు తెలుగు వికీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
ట్యూరింగ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాజ్ రెడ్డి ప్రాజెక్ట్ తెలుగు వికీపై తన ఆలోచనలు పంచుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పెద్ద సంఖ్యలో తెలుగు వికీపీడియా వ్యాసాలు సృష్టించుకోవచ్చునని ఆ తరువాత మానవ జోక్యంతో వాటిని సరిదిద్దుకోవచ్చని ఆయన సూచించారు. టెక్నాలజీ సహాయంతో ఒక భారతీయ భాషలోని వికీపీడియా కథనాలను మరొక భారతీయ భాషలోకి సులభంగా అనువదించగల ఒక రోజు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆంగ్ల వికీపీడియాలోని చాలా వ్యాసాలు భారతదేశ దృక్పథంతో లేవని పేర్కొన్న ఆయన, భారతీయ భాషల వికీపీడియా సమాచారాన్ని భారతీయ కోణం నుండి సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ రాజ్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ కేవలం 5-10% మంది భారతీయులు మాత్రమే ఇంగ్లీషులో పరిజ్ఞానం కలిగి ఉన్నప్పటికీ వికీపీడియా యొక్క రెండవ అత్యధిక వినియోగదారులుగా ఉన్నారనీ అందుకే మాతృభాషలలో మరింత ఎక్కువ కంటెంట్‌ను సృష్టించే ప్రయత్నం భారత ప్రభుత్వాలు, సాంకేతిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, భాషా నిపుణులు మరియు స్వచ్చంద సహాయకులు చేయవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారతీయ భాషల్లో వికీపీడియాలో నాణ్యమైన సమాచారం పొందుపరచటం, భావితరాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం వైపు సంస్థాగత ప్రయత్నాలు చేపట్టాలి అని కాంక్షించారు. “నేర్చుకోవడం నేర్చుకోండి మరియు ఆలోచించడం నేర్చుకోండి” అనేది మార్గదర్శక మంత్రమని ఆయన అన్నారు!
ఈ రోజు భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు నాణ్యమైన వ్యాసాలుగల వికీపీడియా సమాధానంగా ఉంటుందని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. డాక్టర్ జెపి నారాయణ్, వికీపీడియాలో నిబద్ధత గల వాలంటీర్లు మరియు విషయ నిపుణుల సముదాయాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వికీపీడియన్లు ఒక నిర్దిష్ట ప్రదేశం, ప్రాంతం లేదా రాష్ట్రం గురించి ఇప్పటివరకు తెలియని వాస్తవాలు మరియు విశేషాలను వెలుగులోకి తీసుకురావచ్చని సోదాహరణంగా వివరించారు.
శ్రీ మామిడి హరికృష్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మాట్లాడుతూ సంస్కృతి అనేది మానవాళి తరతరాలుగా సమకూర్చుకున్న సామూహిక జ్ఞానం అని దీనిని విస్తృత అర్థంలో చూడాలని పేర్కొన్నారు. తెలంగాణా విభిన్న కళారూపాలు మరియు గొప్ప సంస్కృతి, వారసత్వాలకు నిలయమని, వీటిని వికీపీడియన్లు భవిషత్ తరాలకోసం అందచేయటం చాలా అవసరం అని అన్నారు. దీనికై భాష మరియు సాంస్కృతిక శాఖ తన సహకారాన్ని ఇప్పటికే అందిస్తోందని, భవిష్యత్తులో కూడా తెలుగు వికిపీడియాకు తోడ్పాటు కొనసాగిస్తుందని శ్రీ హరికృష్ణ హామీ ఇచ్చారు.
మాజీ ఎంఎల్‌సి ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, సమాచార సృష్టికి సంబంధించిన సవాళ్ళు అన్న అంశంపై ఉపన్యసించారు. వికీపీడియా ఔత్సాహికులు విషయ వ్యాప్తి కోసం కొత్త టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లను అన్వయించుకోవాలని ఆయన సూచించారు. సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వికీపీడియా సరికొ త్త సాంకేతిక వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు. సమాచార సృష్టి, దిద్దుబాటు , నవీకరణ మరియు వినియోగం సమాచారాన్ని నాలుగు పార్శ్వాలని అయన అన్నారు. వికీపీడియాలో ఏమయినా అంశం చేర్చేముందు వికీపీడియన్లు సమగ్ర పరిశోధన చేయాలని లేదా విశ్వసనీయమైన వనరులపై ఆధారపడాలని కోరారు. సమాచార వ్యాప్తికి అన్ని సాంకేతిక వేదికలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని ఇప్పుడు సమాచార లభ్యత, నాణ్యతపై దృష్టి పెట్టాలని శ్రీ నాగేశ్వర్ చెప్పారు. వికీలలో ఉపయోగించే భాష సామాన్య ప్రజలు ఉపయోగించే భాషకు సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి అని ఆయన సూచించారు.
శ్రీ మాధవ్ ముడుంబై మాట్లాడుతూ, అంతర్జాతీయ సంస్థ ICANN ప్రకారం, తదుపరి 100 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు భారతదేశం మరియు చైనా నుండి వస్తారని మరియు వారిలో ఎక్కువ మంది మాతృభాషలో సమాచారాన్ని చదవడానికి ఇష్టపడతారని పేర్కొన్నారు. చౌకైన డేటా రేట్లు మరియు ధరల తగ్గుదల కారణంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ అక్షరాస్యత మరియు తెలుగు కంటెంట్‌ను డిజిటలైజ్ చేయడం అనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోందని అన్నారు. ఐటీ శాఖ సమాచార స్థానికీకరణను ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని, ప్రాజెక్ట్ తెలుగు వికీ దానిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలలో ఒకటని అన్నారు. ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో సమాచారాన్ని తయారు చేస్తాయని, ఇది వికీ వ్యాసాలకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రోజు దేశాన్ని పీడిస్తున్న నకిలీ వార్తలు/ తప్పుడు సమాచారం బెడదను కూడా వికీపీడియా ఎదుర్కోగలదని ఆయన స్పష్టం చేసారు.
.
మధ్యాహ్రం జరిగిన రౌండ్‌టేబుల్ కార్యక్రమం లో సభ్యుల పరిచయం , ఇప్పటివరకు సాధించ ప్రగతి , సవాళ్లు , ఆధునిక సాంకేతిక రంగంలో తెలుగు వికీపీడియా వినియోగం, వికీలో వాడే తెలుగు భాష, పరిశోధనల్ని ప్రోత్సహించటం, తాజా పరిశోధనలను తెలుగు ప్రజలకు అందించటం, తెలుగు వికీపీడియా పట్ల జనానురక్తిని పెంపుచేయటం మీద చర్చ జరిగినది రౌండ్‌టేబుల్ కార్యక్రమం తరువాత ఐఐఐటీ తెవికీ ప్రాజెక్టు సభ్యులు, తెలుగు వీకీపీడియన్ లకు జరిగిన చర్చలో వికీలో సవివరమైన డాక్యుమెంటేషన్, వికీమీడియా ప్రాజెక్టు నిర్వహణా పద్ధతుల అనుసరణ, గురించి చర్చ జరిగినది ఈ సందర్భంగా ప్రాజెక్టు విషయమై తెవికీ పరంగా చూస్తున్న ఇబ్బందులు, సమస్యలు తెలుపుతూ ప్రణాళిక సవివరంగా రాసి, సముదాయంతో చర్చించాలి అని,తెలుగు వికీమీడియా సముదాయం ఎప్పుడూ కలసిపనిచేస్తాం అన్నవారికి సహకారమే ఇస్తుంది అని సముదాయ సభ్యులు తెలిపారు ఇందులో పవన్ సంతోష్, చదువరి , ప్రణయ్ రాజ్ , వీవెన్,తెలుగు వికీమీడియా సముదాయం తరుపున పాల్గొన్నారు
వికీపీడియా వర్క్ షాప్ లో ఉపయోగించడానికి అభ్యాస కంటెంట్ సృష్టించడం కొరకు అంశాలు
[మార్చు]నమస్కారం ,
తెలుగు వికిపీడియాను ఎప్పుడైనా , ఎక్కడైనా ,వెబ్ ఆధారంగా నేర్చుకోవటం కోసం
గూగుల్ సాంకేతిక పరిజ్ఞానం ( classroom , codelabs ) ఆధారంగా కొన్ని ఆన్లైన్ పాఠాలువీడియోలు ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూపొందించదలచాము. ఇవి కొత్తగా వికీలో రాయబోయే ఔత్సాహికులను దృష్టిలో పెట్టుకొని రాసిన ప్రాధమిక జాబితా వీటిని అందరికీ అందుబాటులో ఉంచటం ద్వారా ఎవరైనా వికీలో వ్యాసం రాయగలరని మా ఆలోచన , వీటి ఆధారంగా వికీడేటా, వికీ సోదర ప్రాజెక్టులు వంటి మరిన్నిపాఠ్యాంశాలు చేర్చగలం.
ఇందులో ఈ విభాగాలుచేర్చాలని మా ఆలోచన , ఇలా చేసిన మొదటి రెండు
విభాగాలు నమూనా ను https://teluguwiki-aa8c2.web.app/ లో మీరు చూడవచ్చు , ఏమైనా సూచనలు , చేర్చదగిన అంశాలు ఉంటే మాకు తెలియచేయగలరు.
వికీపీడియా వర్క్ షాప్ లో ఉపయోగించడానికి అభ్యాస కంటెంట్ సృష్టించడం కొరకు అంశాలు
1) వికీపీడియా ఉపోద్ఘాతం , సంక్షిప్తం గా వికీపీడియా పరిచయం , వికీపీడియా - ఐదు మూలస్థంభాలు, వికీపీడియా ఆవశ్యకతలు
2) Google మూలాంశ ఉపకరణాల పొడిగింపు (డెస్క్ టాప్ )
3)వాయిస్ మరియు కీబోర్డ్ లు ఉపయోగించి మొబైల్ పరికరాల్లో తెలుగును టైప్ చేయడం ఎలా Gboard (మొబైల్ అప్లికేషన్)
4)tewiki.iiit.ac.in పరిచయం, తెవికీ ప్రయోగశాల ( Sandbox) లో నమోదు
5)తెలుగు వికీపీడియాలో లాగిన్ ప్రక్రియ, ఒక వాడుకదారుని పేజీని సృష్టించడం , స్వ పరిచయం జోడించడం
6) వికీపీడియా లో అన్వేషణ , వికీపీడియాలో ఉన్న ప్రాథమిక నావిగేషన్
7) వికీపీడియాను ఒక పరిశోధన సాధనంగా ఉపయోగించడం, వికీ పేజీ నుండి PDF గా ఎగుమతి మొదలైనవి
8)వికీ ప్రామాణిక వ్యాసం పరిచయం
9) వాడుకదారుని శాండ్ బాక్స్ లో ప్రయోగాలు చేయడం ద్వారా ఒక వ్యాసం రాయడం
10) ఎడిటింగ్ ప్రాధమిక అంశాలు
శీర్షికలు మరియు ఉపశీర్షికలు, బోల్డ్, ఇటాలిక్, లింక్ లు, రిఫరెన్సింగ్, చర్చించడం (విజువల్ ఎడిటర్)
టేబుల్స్, జాబితా, ఇండెంట్ లు , వచన దస్త్రాలు , ప్రత్యేక క్యారెక్టర్లు మరియు ఫార్ములాలు మొదలైనవి(విజువల్ ఎడిటర్)
శీర్షికలు మరియు ఉపశీర్షికలు, బోల్డ్, పట్టికలు, జాబితాలు, సూచికలు, రివర్ట్, Referencing, చర్చించడం (క్లాసిక్ ఎడిటర్)
టేబుల్స్, లిస్ట్ లు, ఇండెంట్ లు, టెక్ట్స్ ఫైళ్లు, స్పెషల్ క్యారెక్టర్లు మరియు ఫార్ములాలు మొదలైనవి(క్లాసిక్ ఎడిటర్)
మీడియా - ఇమేజ్ వినియోగం,ఆడియో వినియోగం, ఎంబెడెడ్ వీడియో, వీడియోకు లింక్ చేయడం (విజువల్ ఎడిటర్) సాంకేతిక పరిమితులు
మీడియా - ఇమేజ్ వినియోగం,ఆడియో వినియోగం, ఎంబెడెడ్ వీడియో, వీడియోకు లింక్ చేయడం (క్లాసిక్ ఎడిటర్) టెక్నికల్ పరిమితులు
11) వ్యాసం పేరు మార్చడం మరియు తొలగించటానికి నివేదించటం
12) వికీ కామన్స్ మరియు ఇతర సోదర ప్రాజెక్టులు
13) గూగుల్ డ్రైవ్ మరియు డాక్స్ లను మొబైల్ లో ఇన్ స్టాల్ చేయడం మరియు గూగుల్ డ్రైవ్ మరియు డాక్స్ లను తెలుగులో వ్యాసములు డ్రాఫ్టింగ్ చేయడం కొరకు ఎలా ఉపయోగించాలి.
14)వ్యాస పరిధి ,నాణ్యత మదింపు సరైన మూలలకోసం శోధన
నాణ్యత పరిశోధన - సంబంధిత డాక్యుమెంట్ లు/ఆర్టికల్స్/పుస్తకాలను కనుగొనడం
వ్యాసమును సుసంపన్నం చేయటం
వ్యాసమును ప్రయోగశాల ( శాండ్ బాక్స్ )నుండి తెవికీ లో ప్రచురించటం
వికీపీడియాలో వ్యాసాల ను సవరించటం/ నవీకరించడం
నా స్వంత వ్యాసాలను అప్ డేట్ చేయడం
ఇతర వ్యాసాలను సంకలనం చేయడం, వ్యాసం చర్చాపేజీ
15)వికీపీడియా లో మంచి వ్యాసం ఎలా ఉండాలి?
16)ఈ ఆన్లైన్ అభ్యాసము యొక్క ఫలితం అంచనా వేయటం
ఈ పాఠ్యాంశాలు తయారు చేయటంలో ఉదాహరణకు : పరిశీలన , నాణ్యత , భాష మీద ఐఐఐటి ఇండిక్ వికీ బృందానికి సహాయపడటానికి ఎవరికైనా ఆసక్తి ఉన్నా కూడా మాకు తెలియచేయగలరు
ఇట్లు
ఇండిక్ వికీ సభ్యులు
tewiki @ iiit . ac .in
పెద్ది సాంబశివరావు నిఘంటువులను ఇండిక్ వికి ప్రాజెక్టు లో ఉపయోగించటానికి అనుమతి
[మార్చు]ఇండిక్ ప్రాజెక్టులో భాగంగా ఐఐఐటీ బృందం అనువాదం కొరకు సాఫ్టువేరు అప్లికేషన్లను రూపొందించి అందరికీ అందుబాటులో ఉంచాలని . అనువాద నాణ్యతను పరీక్షించేందుకు గాను ఎడిటర్లకు ఒక చెక్‌లిస్టును తయారు చేసి ఇవ్వడం , తరచూ వాడే పదాలు, వాటి అనువాదాల గురించి ఒక పదకోశాన్ని తయారు చేసి అందుబాటులో ఉంచడం. . కృత్రిమ మేధస్సు యంత్ర అభ్యసన కోసము మేము అనేక భాషా నిఘంటువులను క్రోడీకరించి మెరుగైన యాంత్రిక అనువాదాలు చేయాలని మా ఆలోచన,దీనికి కోసము పెద్ది సాంబశివరావు తన సంకలనం లో వచ్చిన భాషా నిఘంటువు లను ఈ ప్రాజెక్టులొ ఉపయోగించటానికి
11 సెప్టెంబర్ 2020 న అనుమతి ఇచ్చారు వీరి తోర్పాటు వలన కొత్త సాంకేతిక పదాలను , ఇతర భాషల్లో సమానార్ధాలను , యూనీకోడీకరించి ఒక రచనా సామగ్రి corpus ని తయారు చేసి తెలుగు సాంకేతిక రంగంలో పనిచేసే వారికి ఉచితంగా అందుబాటులో ఉంచాలని మా అభిలాష.ఇది మామూలు నిఘంటువు లాగా విస్తారంగా కాకుండా, ఇది కొద్ది పదాలతో (సందర్భోచితంగా ఏ పదాన్ని వాడాలో తెలిపేలా) మాత్రమే కూడుకుని ఉంటుంది . దీనికోసం మేము అనేక భాషా నిఘంటువుల నుండి లభ్యమవుతున్నతెలుగు పదాలను క్రోడీకరిస్తున్నాము.వాటిని https://te.wiktionary.org/ , https://www.wikidata.org , ఇతర భాషా సంబంధిత సాంకేతిక ఉపకరణాల లలో చేర్చి ఇండిక్ వికీ ప్రాజెక్టు కోసము వినియోగిస్తాము.
ఇట్లు
ఇండిక్ వికీ సభ్యులు