వికీపీడియా:వికీప్రాజెక్టు/సాహిత్యం/విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆయన ప్రతిభ భావనాత్మకమే కాదు-ఆలోచనాత్మకం కూడా. ఆపైన అభౌతిక దర్శనాశక్తి-ఆయన భావనకు తత్వపరిపూర్ణతను ఇచ్చినది. వేయిపడగలు ఒక చిన్నసైజు విజ్ఞాన సర్వస్వం. దానిని చదవడం ఒక అపురూపమైన అనుభవం. ఏకవీర కావ్యమైన నవల. రవీంద్రనాథ టాగూరు వంటి ప్రతిభావంతుడు విశ్వనాథ

-ఆర్.ఎస్.సుదర్శనం

మన సంస్కృతి లోతుపాతులను తెలిసికొనకయే దానిని క్షుద్రబుద్ధితో విమర్శించుట నేడొక ఫ్యాషన్ గా పరిణమించుటవలన అట్టి ప్రవృత్తులను తెగనరుకుటయందు ఆయన కలము పరుగెత్తినది

-పి.వి.నరసింహారావు

'మదరాసు నగరపు వీథుల్లో ఆకలితో మాడుతూ తిరుగుతున్న రోజుల్లో నా ప్రాణాన్ని నిలబెట్టినవి రెండే -కార్పొరేషన్ కుళాయి వాళ్ళు, విశ్వనాథ సత్యనారాయణ కవితా

-శ్రీశ్రీ

తెలుగు సాహిత్యంలో, మరీ ముఖ్యంగా 20వ శతాబ్దిలో అపురూపమైన రచనలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన విరాణ్మూర్తులలో అగ్రగణ్యులు విశ్వనాథ సత్యనారాయణ. భావకవిత్వంలో కీలకమైన ముగ్గురు మూర్తుల్లో ఒకరిగా, నవ్యసంప్రదాయవాదానికి మూలమైన రచయితగా ఆయన గత శతాబ్దిలో గుర్తించబడితే ప్రస్తుతం వలసవాద వ్యతిరేకోద్యమంలో కీలకమైన కృషి చేసిన వ్యక్తిగా గణింపబడుతున్నారు. తెలుగు సాహిత్యానికి తొలి జ్ఞానపీఠ గౌరవాన్ని అందించినా, ఆస్థానకవిగా, శాసనమండలి సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడెమీ అధ్యక్షునిగా ఎన్నెన్నో గౌరవాలు పొందినా వారి సాహిత్య కృషి ముందు చిన్నవే. ఆయన రచించిన వేయిపడగలు, రామాయణ కల్పవృక్షం, కిన్నెరసాని పాటలు వంటి అనేకానేక రచనలు జీవితాన్ని, సమాజాన్ని, యుగసంధియైన కాలాన్ని ఆవిష్కరిస్తూ తెలుగు వారి సొత్తుగా మిగిలాయి. ఎన్నో ప్రక్రియల్లో శతాధిక గ్రంథ రచన చేసిన వారి జీవితం, సాహిత్యం, ప్రభావాలు, అడాప్టేషన్లు వంటి వాటిపై సమగ్రమైన వ్యాసాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలకు మార్గసూచిగా నిలవడం ఈ ప్రాజెక్టు ఉపపేజీ లక్ష్యం. 2014-15 సంవత్సరం విశ్వనాథ సత్యనారాయణ 120వ జయంత్యుత్సవ సంవత్సరం కావడం చేతను కూడా ఆయన జీవితం, సాహిత్యాలకు సంబంధించిన వ్యాసాలను వికీ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ విజ్ఞాన సర్వస్వ వ్యాసాలుగా అభివృద్ధి చేసి ఘనమైన నివాళినర్పించవచ్చని మరో ఆలోచన.

నేపథ్యం[మార్చు]

తెలుగు వికీపీడియా నాణ్యతా ప్రమాణాలు అభివృద్ధి క్రమంగా ఎన్నెన్నో ఏళ్ళ నుంచి జరుగుతూనే వున్నది. గతంలో పలువురు వికీకృషీవలురి శ్రమ వలన ముఖ్యులైన సాహిత్యవేత్తలు, రాజకీయనేతలు, స్వాతంత్రపోరాట యోధులు, పరిపాలకులు మొదలైన పలువురి వ్యాసాలు రచించారు. వీటిలో అతికొద్ది వ్యాసాలు చాలా మంచి వ్యాసాలుగా తయారయ్యాయి. ముఖ్యమైన చాలా వ్యాసాల పరిస్థితి సమాచార ప్రోవుగానే వుంది తప్ప ఉత్తమ స్థాయి విజ్ఞానదాయకమైన వ్యాసంగా ఇంకా రూపొందాల్సే వుందని గమనించవచ్చు. ముఖ్యమైన వ్యాసాలను సాధ్యమైనంత సమగ్రంగా మలిచే ప్రయత్నం ప్రారంభిద్దామనుకున్నప్పుడు ముందుగా విశ్వనాథ సత్యనారాయణ వ్యాసాలను అలా అభివృద్ధి చేయవచ్చని భావించాను. విశ్వనాథ సత్యనారాయణ జీవితం గురించి, ఆయన సాహిత్యం గురించి విస్తారమైన ప్రామాణిక వ్యాసాలు, మరీ మాట్లాడితే పరిశోధన వ్యాసాలు, విమర్శ గ్రంథాలు లెక్కకు మిక్కిలి లభిస్తున్నాయి. ఆయన రచనలు కూడా నేరుగా స్వానుభవం, స్వంత పరిశీలనల్లోంచి వచ్చినవే కావడం, మరీ ముఖ్యంగా వేయిపడగలు వంటి గొప్ప రచన ఆత్మకథాత్మకం కావడం వంటి కారణాలతో వారి జీవితాన్ని గురించి, సాహిత్యం గురించి లోతుగా, విస్తారంగా వ్యాసాలను అభివృద్ధి చేసే వీలుదొరుకుతోంది. అందుకే ఆయన రచనలు స్వీకరించొచ్చు.

లక్ష్యాలు[మార్చు]

 • విశ్వనాథ సత్యనారాయణ వ్యాసంలో ఆయన జీవిత చరిత్రలను క్లుప్తంగానైనా, సమూలంగా, సమగ్రంగా తయారుచేయడం.
 • ఆ వ్యాసంలో ఆయన సాహిత్యం గురించిన వివరాలు, విమర్శల వివరాలు, తెలుగు సాహిత్యంలో ఆయన స్థానాన్ని గురించిన విశేషాలు ఎలా ఇవ్వాలో వింగడించుకుని అభివృద్డి చేయడం.
 • విశ్వనాథ సత్యనారాయణ రచించిన ప్రముఖమైన రచనల గురించి ఆన్లైన్లోనూ, ఆప్లైన్లోనూ లభ్యమవుతున్న వ్యాసాలు పరిశీలించి అభివృద్డి చేయడం.
 • ఆయన రచనలపై కొత్త వ్యాసాలు తయారు చేయడం.(ఇటీవల కొన్ని పుస్తకాలు పరిశీలించిన మీదట విశ్వనాథ వారి శతాధిక గ్రంథాలన్నిటి గురించీ ప్రామాణికమైన స్వతంత్ర విమర్శ రచనలు దొరుకుతున్నాయని తెలిసింది)
 • విశ్వనాథ వ్యాసంలో పెట్టేందుకు జీవితక్రమానికి తగ్గ ఫోటోలు విజయవాడకు వెళ్ళ వీలుదొరికినప్పుడు ఎవరైనా వికీపీడియన్లు తీసి, అప్లోడ్ చేసేలా ప్రోత్సహించాలి.
 • ఆయన గురించిన వ్యాసాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాకా ఆడియోగా రికార్డు చేసి ఆడియో వ్యాసంగా మలచాలి.
 • వికీకోట్స్ లో కూడా విశ్వనాథ వారి కొటేషన్లు, ఆయనపై వచ్చిన కొటేషన్లని చేర్చాలి.
 • ఆయన ప్రముఖ పాత్ర వహించిన భావ కవిత్వం, వారితోనే ప్రారంభమైన నవ్యసంప్రదాయవాదం, ప్రస్తుత సాహిత్య విమర్శ అభివృద్ధిలో భాగంగా వారి ప్రాధాన్యతను గుర్తిస్తున్న వలసపాలనానంతర వాదం వంటివాటికి వ్యాసాలు లేకుంటే అభివృధ్డి చేసి వాటిలో విశ్వనాథ ప్రాముఖ్యతను వివరించాలి.

ఔత్సాహిక సభ్యులు[మార్చు]

ఈ ప్రణాళికలో కృషి చేసేందుకు ముందుకువచ్చే సభ్యులు ఈ క్రింద తమ సంతకం చేయగలరు. ఐతే ఆయా పేజీలను అభివృద్ది చేయదలుచుంటే ఇక్కడ సభ్యత్వం నమోదుచేసుకోవడమేమీ తప్పనిసరి కాదని గుర్తుంచుకోండి.

 1. పవన్ సంతోష్ (చర్చ)
 2. --Rajasekhar1961 (చర్చ) 12:25, 16 నవంబర్ 2014 (UTC)Rajasekhar1961
 3. JVRKPRASAD (చర్చ) 05:30, 21 నవంబర్ 2014 (UTC)

ఉపకరణాలు[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ, ఆయన సాహిత్యం వంటి అంశాలపై వ్యాసాల్లో సమాచారం చేర్చేందుకు ఉపకరించే మూలాలు(వీలున్నంతవరకూ ఆన్లైన్లో ఉచితంగా దొరికేవే ఇస్తున్నాను) ఇవి:

 1. పుస్తకం.నెట్లో ఆయన జీవితంపై వచ్చిన వ్యాసాలు ఇక్కడ, ఇక్కడ.
 2. ఆంధ్రభారతి.కాంలో తెలుగు ఋతువులు కావ్యం
 3. ఆంధ్రభారతి.కాంలో ఆంధ్రప్రశస్తి గ్రంథం.
 4. సాక్షి ఫన్ డేలో విశ్వనాథ గురించిన కవర్ స్టోరీ.(శ్రీరమణ రచన)
 5. విశ్వనాథ సత్యనారాయణ జీవితాన్ని గురించి, సాహిత్యం గురించి పలువురు సన్నిహితులు, మిత్రులు, సాహిత్యవిమర్శకులు వంటివారు రచించిన వ్యాసాల సంకలనం విశ్వనాథ శారద మొదటి భాగం ఇక్కడ డీఎల్ఐలో వుంది.