వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సాహిత్యం/విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


విశ్వనాథ వరలక్ష్మి వ్యాసం గురించి విషయప్రాముఖ్యత అంశం[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ భార్య వరలక్ష్మి ఆయన జీవితంలో అత్యంత ప్రాధాన్యత వున్న వ్యక్తి. ఏ భార్య అయినా సదరు భర్త జీవితంలో ప్రాధాన్యత వున్నవారేనని కొట్టిపారేయవచ్చు కానీ విశ్వనాథ సత్యనారాయణ జీవితంలో మాత్రం ఆమెకు సాధించుకున్న ప్రాధాన్యత వేరు. సత్యనారాయణ-వరలక్ష్మి గార్ల దాంపత్యంలో ఆయనను సామాన్యుడైన కవి నుంచి మహాకవి స్థాయికి పెంచినవ్యక్తి ఆమె. ఆయన రచనలలో ఆవిడ ప్రమేయం ఎంతో వుంది. వేయిపడగలు నవల చదివినవారికి అందులోని దేవదాసి పాత్ర గుర్తుండేవుంటుంది. ఆ అపురూపమైన పాత్ర ఆమె సృష్టే. ఆ పాత్రతో వేరుగా ఓ నవల రాద్దామని ఆ దంపతులు భావించారు. ఐతే వరలక్ష్మి మరణానంతరం ఆయన ఆ పాత్రను వేయిపడగలులో వినియోగించారు. ఇలా జీవించివుండగా అనేకానేక పాత్రల సృష్టికర్తగానే కాక ఆయన జీవితంలో మాధుర్యం నింపి, అపురూపమైన మహాకవిగా మలచడం వరకూ ఆమె లేనిదే ఆయన వేరేదో అయివుండొచ్చు.
ఇక ఆమె మరణం ఇక ఆయనను శతాబ్దంలోకెల్లా గొప్ప సాహిత్యవేత్తల్లో ఒకరిగా మలిచారు. ఆమె మరణం తీవ్రమైన వేదనకు గురిచేసి వేయిపడగలు వంటి నవలలో నాయికగా నిలిపింది. మరణించిన సంవత్సరాల పాటుగా తన బాధలో ఆశువుగా వచ్చిన పద్యాలు వ్రాసుకుని మూడు శతకాలు డైరీలో చేర్చుకున్నారు(తర్వాత ఆయన డైరీ నుంచి ఆ గ్రంథాన్ని ప్రచురించారు.) ఆపైన జీవితమంతా వేదనతోనే వున్నారు. తనకు భార్యావియోగ దు:ఖం తెలిసి రామాయణ మహాకావ్యం వ్రాసేందుకే ఆ రామచంద్రమూర్తి తనకీ మహా దు:ఖాన్ని కలిగించాడని వ్రాసుకున్నారు. రామాయణంలో అనేకానేకమైన తావుల్లో ఆ మహాపతివ్రత, మహాపండితురాలి ముద్ర కనిపిస్తుందన్నారు.
ఇంతే కాక స్వతంత్రమైన అనేక మూలాల్లో ఆమె గురించి, ఆమె విశ్వనాథ వారిని మహాకవిగా మలిచిన విషయాన్ని గురించి వ్రాశారు. మూలాలు ప్రతి విషయానికి సమర్పించగలను. ఇప్పుడు నా సందేహమల్లా ఆవిడ వ్యాసం వ్రాయాలంటే విషయప్రాముఖ్యత వున్నట్టేనా? వైజాసత్య, రాజశేఖర్ గార్లు ఈ విషయంపై నాకేమైనా సూచన చేయగలరా?--పవన్ సంతోష్ (చర్చ) 15:41, 16 నవంబర్ 2014 (UTC)

పవన్ సంతోష్ గారూ, మీరు చెప్పినదాన్ని బట్టి, అనేక మూలలున్న విషయాన్ని బట్టి ఈవిడకు ప్రత్యేకమైన వ్యాసం ఉండేంత ప్రాధాన్యత ఉన్నదని భావిస్తున్నాను. అయితే విశ్వనాథ గారికి ప్రేరణనిచ్చి ప్రోత్సహించడం తప్ప, ఈమె సొంతగా సాధించిన ఇతర కార్యాలు లేకపోవచ్చు అన్న కారణంచే వ్యాసం సృష్టించడానికి కాస్త వెనుకాడుతున్నాను. ప్రస్తుతానికి విశ్వనాథ వారి వ్యాసంలోనే ఈవిడ గురించి విస్తరించి వ్రాయండి. చాలా సమాచారం చేరిందనుకున్నప్పుడు ఆ సమాచారంతోనే ప్రత్యేక వ్యాసం సృష్టించవచ్చు. --వైజాసత్య (చర్చ) 02:20, 17 నవంబర్ 2014 (UTC)
వైజాసత్య గారూ సరేనండీ. వెంటనే స్పందించి సలహా ఇచ్చినందుకు థాంక్స్.--పవన్ సంతోష్ (చర్చ) 04:37, 17 నవంబర్ 2014 (UTC)