వికీపీడియా:సమావేశం/ఎన్టీఆర్ ట్రస్టులో తెవికీ కార్యశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కవి సంగమం సంస్థ సభ్యులు, ఎన్టీఆర్ ట్రస్టు విద్యార్థులు, తదితరులకు కార్యశాల ఏర్పాటుచేశాం. కార్యక్రమంలో కవిసంగమం సభ్యులతో పాటుగా ఇతరులు కూడా హాజరుకావచ్చు. కార్యక్రమాన్ని తెలుగు వికీపీడియా సముదాయంలో జరిగిన చర్చలు, గత ప్రణాళికల్లోని ప్రస్తావనలు వంటివి గమనించి సందర్భానుసారం ఏర్పాటుచేస్తున్నాం.

వివరాలు[మార్చు]

 • ప్రదేశం: స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్, ఎన్టీఆర్ ట్రస్టు భవన్, రోడ్ నెం.2, బంజారా హిల్స్, హైదరాబాద్.
 • తేదీ, సమయం: మార్చి 20, 2016, ఉదయం 10 గంటల నుంచి

కార్యక్రమ నిర్వాహకులు[మార్చు]

సహకారం[మార్చు]

కార్యక్రమానికి ముందస్తు నమోదు[మార్చు]

నివేదిక[మార్చు]

కార్యక్రమంలో ముందస్తుగా కవిసంగమం సంస్థ సభ్యులు, ఎన్టీఆర్ ట్రస్టు స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ సభ్యులు, ఇతర ఔత్సాహికులకు ప్రధానంగా కార్యశాల నిర్వహించాలని భావించాం. అయితే తెలియని కారణాల, ముందుగా సామాజిక మాధ్యమాల్లో రిజిస్టర్ చేసుకున్న సంస్థ సభ్యులు కొందరు రాకున్నా ఎన్టీఆర్ ట్రస్టు స్కిల్ డెవెలప్మెంట్ సెంటర్ విద్యార్థులు ఐచ్ఛికంగా కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా పవన్ సంతోష్ పాల్గొన్నవారికి తెవికీ గురించి క్లుప్త వివరణ ఇస్తూ ప్రారంభించారు. ఆపైన తెలుగు వికీపీడియన్, వృత్తిగతంగా హెచ్.ఆర్. అయిన కశ్యప్ ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు వికీపీడియా ప్లాట్ ఫాంను సమర్థంగా ఎలా వినియోగించుకోవచ్చన్న అంశాన్ని వివరించారు. పవన్ సంతోష్ వికీపీడియా మూలస్తంభాల గురించి వివరిస్తూ ఔత్సాహికులతో తెలుగు వికీపీడియాలో ఖాతా తెరిపించారు. తెలుగు వికీపీడియాలో కొత్త వ్యాసాన్ని ఎలా రాయాలన్న అంశాన్ని, వ్యాసాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న విషయాన్ని వివరిస్తూ, ఆయా అంశాలపై చిరు శిక్షణ నిర్వహించారు. గుళ్ళపల్లి, కశ్యప్, ప్రణయ్ రాజ్, పవన్ సంతోష్, రాజశేఖర్ లు తెవికీపీడియాలో సమాచారం అభివృద్ధి చేస్తున్న కొత్త వికీపీడియన్లకు సూచనలు, సహకారం అందించారు. పలువురు సభ్యులు తెవికీపీడియాలో వ్యాసాలపై కృషిచేశారు. మొత్తంగా సభ్యులు 10 కొత్త వ్యాసాలు సృష్టించబడగా, దాదాపు 17 మంది కొత్త సభ్యులు తెవికీలో ఖాతా తెరిచి మార్పులు ప్రారంభించారు. వారిలో ఇద్దరి వరకూ 20కి పైగా ఎడిట్లు చేస్తూ తెవికీలో రచనలు చురుకుగా చేస్తున్నారు.

కొత్త వాడుకరులు[మార్చు]

 1. చెరుకు హరీష్
 2. అజయ్ బంబి
 3. రామాంజులు డేగని
 4. గుండా హరీష్
 5. క్రిష్ణ బొల్లినేని
 6. అబ్దుల్ జిలానీ
 7. శ్రీకుమార్
 8. మహేష్ మామిడాల
 9. సంధ్యాసాయి పొన్నూరి
 10. రాకేష్ కత్తి
 11. శ్రీకాంత్ గౌడ్
 12. మోహన్
 13. రాజు రూలర్
 14. జి. వరహాలబాబు
 15. ఇమ్రాన్
 16. అనంద్ చౌదరి
 17. ఉప్పు సంతోష్
 18. శ్రవణ్ ఉప్పు

హాజరైన వికీపీడియన్లు[మార్చు]

 1. డా.రాజశేఖర్
 2. గుళ్లపల్లి నాగేశ్వరరావు
 3. క్రుపాల్ కశ్యప్
 4. పవన్ సంతోష్
 5. ప్రణయ్ రాజ్ వంగరి

చిత్రమాలిక[మార్చు]