Jump to content

వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/11 జూన్ 2017

వికీపీడియా నుండి

2017 జూన్ 10, 11 తేదీల్లో సీఐఎస్-ఎ2కె నిర్వహణలో సాగిన దక్షిణ భారతదేశ వికీడేటా కార్యశాల కార్యక్రమం సందర్భంగా కొందరు తెలుగు వికీపీడియన్లు బెంగళూరు వెళ్ళడం పురస్కరించుకుని అనుకోని విధంగా జరిగిన చిరు సమావేశం. సమావేశంలో ప్రధానంగా వికీమీడియన్లు స్నేహపురస్సరంగా వ్యక్తిగతమైన అంశాలు, కొంతవరకూ తమ తమ వికీపీడియా కృషి మాట్లాడారు. తెలుగు వికీపీడియాకు సంబంధించి కీలకమైన అంశాలపై ఈ సమావేశం నుంచి ప్రతిపాదనలు ఏమీ లేవు.

సమయం, ప్రదేశం

[మార్చు]

2017 జూన్ 11 ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకూ బెంగుళూరు ఇందిరానగర్ 100 ఫీట్ రోడ్డులో ఒక రెస్టారెంట్లో అల్పాహార విందుగా జరిగింది. తెలుగు వికీపీడియన్ల రాకను తెలుసుకున్న అర్జున రావు గారు ముందురోజు రాత్రి ప్రతిపాదించడంతో చిన్నపాటి గెట్-టు-గేదర్ పద్ధతిలో జరిగింది.

చర్చించిన అంశాలు

[మార్చు]

వికీపీడియా పరంగా మాట్లాడుకున్న అంశాలు ఇవి:

  • జరుగుతున్న కార్యక్రమాల ఏమేమిటి అన్న వివరం తెలుసుకోవడం
  • హైదరాబాద్ సమావేశాలకు వేదికగా రవీంద్ర భారతిలో అవకాశం దొరకడం గురించి
  • వికీడేటా కార్యశాలలు దేశవ్యాప్తంగా దక్షిణ, ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్యభారతాల వారీగా నిర్వహించే ప్రణాళికలోని సౌలభ్యం గురించి కొంత చర్చ.

హాజరైనవారు

[మార్చు]