వికీపీడియా:సమిష్టి వ్యాసం/2007 24వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు 1940, 50 లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించిన వారిలో ప్రకాశం ఒకడు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.

1953 అక్టోబర్‌ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నదిపై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి.

టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5 న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఈ వ్యాసాన్ని మెరుగుపరుద్దాం రండి