Jump to content

వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు/సూచనలు

వికీపీడియా నుండి
ప్రధాన పేజీచర్చప్రతిపాదనలుపునస్సమీక్షసూచనలుప్రమాణాలునివేదికసహాయ కేంద్రం
మంచి వ్యాసం ప్రతిపాదనలు
మంచి వ్యాసం ప్రతిపాదనలు

మంచి వ్యాసం సమీక్ష కోసం వ్యాసాన్ని ప్రతిపాదించడం, సమీక్షించడం ఎలాగో వివరించే పేజీ ఇది. ప్రతిపాదించేవారికి, సమీక్షించేవారికీ కూడా ఇందులో సూచనలున్నాయి. బాట్ చేసే పనులు హైలైటు చేసి ఉన్నాయి.

ప్రతిపాదనలు ఎవరైనా చెయ్యవచ్చు. అయితే వ్యాసంలో ఎక్కువ మార్పుచేర్పులు చేసినవారు, వ్యాస విషయం పట్ల అవగాహన కలిగి ఉన్న వారు ప్రతిపాదిస్తే మంచిది. సమీక్షించేవారు మాత్రం, ఆ వ్యాసంలో ఎక్కువ మార్పుచేర్పులు చేసి ఉండకూడదు. ప్రతిపాదించినవారే సమీక్షించకూడదు.

సమీక్షా క్రమంలో ఉపయోగించే పేజీలు

[మార్చు]

మంచి వ్యాసం ఎంపిక ప్రక్రియలో కింది పేజీలు, మూసలను వాడుతారు.

పేజీలు

[మార్చు]
  • వ్యాసం పేజీ: సమీక్షించబోయే వ్యాసం పేజీ
  • వ్యాసం చర్చా పేజీ: ప్రతిపాదన, సమీక్ష ప్రక్రియలో పంపించుకునే సందేశాలు ఈ పేజీలో చేస్తారు.
  • సమీక్షా పేజీ: సమీక్ష1 అనే పేరుతో ఈ పేజీ తయారౌతుంది. 1 అనే అంకె ఎన్నవ సమీక్షో సూచిస్తుంది. సమీక్ష మొదలైనపుడు మాత్రమే ఈ పేజీ సృష్టి జరుగుతుంది. సమీక్షకుడు సమీక్షాంశాలన్నీ ఇక్కడే రాస్తారు.
  • ప్రతిపాదనల పేజీ: ప్రతిపాదనలన్నీ ఈ పేజీలో చేరుతాయి. ఇక్కడ జరిగే మార్పుచేర్పులు దాదాపుగా అన్నిటినీ బాట్ చేస్తుంది.

మూసలు

[మార్చు]
  • {{GAN}}: ప్రతిపాదించే మూస
  • {{GA nominee}}: సమీక్షకుడు, ప్రతిపాదకుడూ పరస్పరం వివిధ సందేశాలను పంపించుకునే మూస.
  • {{GANotice}}: బాట్ ఈ మూస ద్వారా ప్రతిపాదకుడు, సమీక్షకులకు సందేశాలు పంపిస్తుంది.

ప్రతిపాదించడం

[మార్చు]

మెట్టు 1: వ్యాసాన్ని సిద్ధం చెయ్యడం

[మార్చు]

ముందుగా వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు - తటస్థ దృక్కోణం, నిర్ధారకత్వం, మౌలిక పరిశోధన కూడదు, విషయ ప్రాముఖ్యత మొదలైన వాటికి - అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి. తరువాత మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చూసి, అవసరమైన మార్పుచేర్పులు చెయ్యండి. ప్రతిపాదించేవారు వ్యాసంలో పెద్దగా పాటుపడిన వారు కాకపోతే, అందులో బాగా కృషి చేసినవారిని వ్యాసపు చర్చా పేజీలో ప్రతిపాదించే ముందు సంప్రదించాలి. సమీక్షకుడు సమీక్షించే క్రమంలో వ్యాసాన్ని మెరుగుపరచేందుకు సూచనలు చేస్తూంటారు. సదరు సూచనలను అమలు చేసేందుకు, ప్రతిపాదకులుగా మీరు సమీక్షలో చురుగ్గా పాల్గొనాలి. అందుచేత ప్రతిపాదించే ముందు, ఆ సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేసేందుకు తగు సమయం ఉంటుందని నిర్ధారించుకోండి.

మెట్టు 2: వ్యాసాన్ని ప్రతిపాదించడం

[మార్చు]
  1. వ్యాసపు చర్చా పేజీలో పైన {{subst:GAN|subtopic=}} అనే మూసను పెట్టండి. దాన్ని వేరే మూసలో పెట్టకండి.
  2. |subtopic= పరామితి కోసం, బాగా సరిపోయే ప్రధాన వర్గాన్ని ఇవ్వండి. ఏ వర్గానికి చెందుతుందో ఇదమిత్ఠంగా తేల్చుకోలేకపోతే, ఖాళీగా వదిలెయ్యండి.
  3. పేజీని భద్రపరచండి. ఈ పని బాట్ చేస్తుంది|ప్రతిపాదనల పేజీలో సంబంధిత విభాగంలో మీ ప్రతిపాదన కనిపిస్తుంది. వ్యాసం సమీక్ష కోసం సిద్ధంగా ఉందని ఈ విధంగా తెలుస్తుంది.
  4. దీనితో ప్రతిపాదించడం అయిపోయింది. ఇప్పుడు, మీ అనుకూలతను బట్టి, ఈసరికే సమీక్ష కోసం వేచి ఉన్న వ్యాసాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుని సమీక్షించండి. (ఇది తప్పనిసరేమీ కాదు.)

మెట్టు 3: వేచి ఉండటం

[మార్చు]

వ్యాసాన్ని ప్రతిపాదించిన తరువాత సమీక్షించేందుకు ఎవరైనా ముందుకు వచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చు. లేదంటే వెంటనే జరగవచ్చు కూడా. సమీక్ష పేజీని మీరే మొదలుపెట్టవద్దు. అలా చేస్తే సమీక్షించదలచిన వారు, సమీక్ష మొదలైపోయిందని భావించి తప్పుకోవచ్చు.

సమీక్ష మొదలయ్యాక, వారిచ్చే సూచనలను అమలు చేసేందుకు మీరు అందుబాటులో ఉండాలి. ఏ కారణం వల్లనైనా మీరు అందుబాటులో ఉండకపోతే, అదే విషయాన్ని మూస ద్వారా తెలియజెయ్యండి: {{GA nominee}} మూసలో |note= అనే పరామితిలో మీ సందేశాన్ని చొప్పించి సమీక్షా పేజీలో పెట్టండి. ఉదాహరణకు: {{GA nominee|...|note=ఒక వారం పాటు నేను అందుబాటులో ఉండను. ~~~~}}. పేజీని భద్రపరచండి. ఈ పని బాట్ చేస్తుంది|ప్రతిపాదనల పేజీలో ప్రతిపాదన పక్కనే మీ సందేశం కనిపిస్తుంది.

వెనక్కి తీసుకోవడం: సమీక్ష మొదలయ్యే ముందే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడానికి, వ్యాసపు చర్చా పేజీ నుండి {{GA nominee}} మూసను తీసివేస్తే చాలు. సమీక్ష మొదలయ్యాక ఉపసంహరించుకోవాలంటే, సమీక్షకుడికి తెలియజెయ్యండి. సమీక్షకుడు వ్యాసాన్ని ఫెయిల్ చేస్తాడు.

మెట్టు 4: సమీక్షా సమయంలో ఏం చెయ్యాలి

[మార్చు]

సమీక్షా సమయంలో సమీక్షకుడు సూచించే మార్పులు చేర్పులు సకాలంలో చేసేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. (అనివార్యమైన పరిస్థితుల కారణంగా అలా వీలుకాని పక్షంలో ఆ పనులు చేసేందుకు మరొక వాడుకరిని చూడండి). ఇతర వాడుకరులు కూడా సూచనలు చెయ్యవచ్చు, మార్పు చేర్పులూ చెయ్యవచ్చు. సమీక్షపై తుది నిర్ణయం మాత్రం తొలి సమీక్షకుడిదే. సమీక్షకు సాధారణంగా 7 రోజుల సమయం సరిపోతుంది. తన సూచనలను అమలు చేసేందుకు సమయమిచ్చేందుకు గాను సమీక్షకుడు ఓ 7 రోజుల పాటు సమీక్షను నిలిపి ఉంచవచ్చు (సమీక్షకులు దీన్ని తగ్గించ వచ్చు, పొడిగించనూ వచ్చు). మంచి వ్యాసం ప్రమాణాల విషయమై ప్రతిపాదకుడికి, సమీక్షకుడికీ అభిప్రాయభేదాలు వస్తే ప్రతిపాదనల చర్చా పేజీలో పెట్టి సహాయం కోరవచ్చు.

సమీక్షకుడు తప్పుకుంటే: సమీక్షకుడు సమీక్షను సకాలంలో పూర్తి చేసేందుకు బద్ధుడై ఉండాలి. కానీ తప్పనిసరి పరిస్థితులలో సమీక్ష నుంచి తప్పుకోవచ్చు. ఆ సందర్భంలో ముందుగా మీరు సమీక్షకుడిని సంప్రదించాలి. పరిష్కారం దొరక్కపోతే, వేరే సమీక్షకుడి కోసం చూడాలి. అందు కోసం వ్యాసపు చర్చాపేజీలోని {{GA nominee}} మూసలోని |page= పరామితిలో విలువను మార్చండి -"page=1" నుండి "page=2" ఇలాగ. |status= పరామితి విలువ "status=సమీక్షలో ఉంది" లేదా "status=నిలిపి ఉంచాను" అని ఉంటే దాన్ని ఖాళీగా పెట్టండి -"status=" ఇలాగ. అప్పటి వరకూ జరిగిన సమీక్ష వ్యాసపు చర్చాపేజీలోకి ట్రాంస్‌క్లూడు అయి ఉంటుంది. దాన్ని తీసివెయ్యవచ్చు. అయితే ఆవశ్యకమేమీ కాదు. పేజీని భద్రపరచండి. ఈ పని బాట్ చేస్తుంది|ప్రతిపాదనల పేజీలో ఈ వ్యాసం స్థితి తిరిగి మొదటి స్థితికి వస్తుంది. క్యూలో అది ఇదివరకటి స్థానంలోనే ఉంటుంది సమీక్షను మొదలుపెట్టడం తప్ప, సమీక్షకుడు వ్యాఖ్యలేమీ చేసి ఉండకపోతే, సమీక్ష పేజీని తొలగించమని అభ్యర్ధించవచ్చు.

మెట్టు 5: సమీక్ష తరువాత

[మార్చు]

సమీక్షాంతంలో సమీక్షకుడు వ్యాసాన్ని సఫలం లేదా విఫలం చేస్తారు. ప్రతిపాదన విఫలమైతే, సమీక్షకుడి సూచనలను అమలుచేసి, వ్యాసాన్ని తిరిగి ప్రతిపాదించవచ్చు. తగినంత వివరంగా సమీక్ష జరగలేదని మీరు భావిస్తే పునస్సమీక్ష కోసం వెనువెంటనే దాన్ని ప్రతిపాదించవచ్చు.

సమీక్షించడం

[మార్చు]

మెట్టు 1: మంచి వ్యాసం ప్రమాణాల గురించి వివరంగా తెలుసుకోండి

[మార్చు]

సమీక్ష మొదలుపెట్టబోయే ముందు, మంచి వ్యాసం ప్రమాణాల గురించి వివరంగా తెలుసుకోవాలి. ఈ విషయమై మంచి వ్యాసాలను సమీక్షించడం, వికీపీడియా:మంచివ్యాసాలు కానివి ఏవి (en) వ్యాసాలు ఉపయోగపడతాయి. వ్యాసం విధానాలు, మార్గదర్శకాలకు - తటస్థ దృక్కోణం, నిర్ధారకత్వం, మౌలిక పరిశోధన కూడదు, విషయ ప్రాముఖ్యత మొదలైన వాటికి - అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి. ఏదైనా సాయం అవసరమైతే మంచివ్యాసం ప్రతిపాదనలు చర్చా పేజీలో రాయండి.

మెట్టు 2: సమీక్ష మొదలుపెట్టడం

[మార్చు]

వ్యాసాన్ని సమీక్షించాలంటే మీరు:

  • నమోదైన వాడుకరి అయి ఉండాలి- లాగినై ఉండాలి.
  • సమీక్షించబోయే వ్యాసాన్ని మీరే ప్రతిపాదించి ఉండకూడదు. మీరు ఆ వ్యాసంలో పెద్దగా మార్పుచేర్పులు చేసి ఉండకూడదు.
  1. వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు పేజీలోని ఏదో ఒక వ్యాసాన్ని సమీక్షకు స్వీకరించవచ్చు. అయితే:
    • సమీక్ష కోసం ఎదురు చూస్తున్న పాత ప్రతిపాదనలను ముందుగా తీసుకుంటే మంచిది.
    • మీరు సమీక్షించదలచిన వ్యాసాన్ని ఈసరికే వేరే వారు సమీక్షిస్తూంటే, సమీక్ష పేజీలో మీ వ్యాఖ్యలు రాయవచ్చు. అయితే సమీక్షా నిర్ణయం మాత్రం తొలి సమీక్షకుడిదే.
  2. సమీక్ష మొదలుపెట్టండి లింకును నొక్కండి. ఈ లింకు ప్రతిపాదనల పేజీలోనే కాక, వ్యాసపు చర్చా పేజీలో పైన కూడా ఉంటుంది. దీంతో ఒకా సమీక్షా పేజీ తయారౌతుంది. ఆ పేజీలో మీ తొలి సమీక్షా వ్యాఖ్యలు చెయ్యవచ్చు. అందుకు కొన్ని మూసలు కూడ ఉన్నాయి. వాటిని వాడవచ్చు.
  3. తరువాత ఆ పేజీని భద్రపరచండి. ఈ పని బాట్ చేస్తుంది|ప్రతిపాదనల పేజీలో ఈ వ్యాసపు ప్రతిపాదన పక్కనే సమీక్ష జరుగుతోంది అని కనిపిస్తుంది. {{GANotice}} మూస ద్వారా ప్రతిపాదకునికి కూడా సమీక్ష మొదలైందనే సందేశం వెళ్తుంది.
  4. గుర్తుంచుకోండి: సమీక్ష మొదలుపెట్టారంటే దానర్థం -ఒక నిర్ణీత వ్యవధి లోపల దాన్ని పూర్తి చేసేందుకు మీరు బద్ధులై ఉంటున్నట్టు. మధ్యలో ఆపేసి, వదిలెయ్యకండి. ఒక వ్యాసాన్ని సమీక్షించడం మొదలుపెట్టి, 7 రోజుల లోపు దాన్ని పూర్తి చెయ్యండి.

మీరు సమీక్షను పూర్తిచెయ్యలేని అనివార్య పరిస్థితిలో ఉంటే అదే సంగతి ప్రతిపాదకునికి తెలపండి. వీలైతే మరో సమీక్షకుడిని ఏర్పాటు చేసేందుకు సాయపడండి. అవసరమైతే ప్రతిపాదనల చర్చా పేజీలో కూడా సందేశం పెట్టండి.

మెట్టు 3: సమీక్షించడం

[మార్చు]
  1. వ్యాసాన్ని పూర్తిగా చదవండి. ఇచ్చిన మూలాలను అర్థం చేసుకోండి. మంచి వ్యాసం ప్రమాణాల దాన్ని వెనువెంటనే ఒప్పుకోవచ్చో లేదా తిరస్కరించవచ్చో పరిశీలించండి. లేక అది పాక్షికంగా ప్రమాణాలకు బద్ధంగా ఉందో ప్రమాణాలకు కొద్దిగా దిగువన ఉందో.. అలా ఉంటే మెరుగుపరచిన తరువాత సమీక్షలో నెగ్గుతుందేమో నిర్ణయించండి.
  2. వ్యాసం ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉంటే వెంటనే దాన్ని ఆమోదిస్తూ మీ నిర్ణయానికి సమర్ధనగా సమీక్ష రాయండి. అందుకోసం {{మూస:GATable‎‎}} మూసను కూడా వాడవచ్చు.
  3. వ్యాసం ప్రమాణాలకు బాగా దూరంగా ఉంటే ఆయా వివరాలను తెలియజేస్తూ, ప్రమాణాల స్థాయికి తీసుకురావాలంటే ఏమేం మార్పులు చెయ్యాలో సమీక్ష రాయండి.
  4. వ్యాసం ప్రమాణాలకు కొద్దిగా మాత్రమే దిగువన ఉంటే మీరే పూనుకుని ఆయా మార్పులను చేసి ప్రమాణాల స్థాయి తీసుకురావచ్చు.
  5. సమీక్షాక్రమంలో వ్యాసంలో తగు మార్పులు చేసి, ప్రమాణాల స్థాయికి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరిగితే, వ్యాసాన్ని ఆమోదించి, సమీక్షను ముగించండి. అలా ప్రమాణాల స్థాయికి తీసుకురాకపోతే, దాన్ని తిరస్కరించి సమీక్షను ముగించండి. సముచితమని మీరు భావిస్తే, మెరుగుపరచేందుకు తగు సూచనలను ఇవ్వవచ్చు.
  6. సమీక్షకుడు, ప్రతిపాదకుడు కలిసి చురుగ్గా పనిచేస్తే ఈ పనిని 7 రోజుల్లోపు పూర్తి చెయ్యగలరు. ప్రతిపాదకుని స్పందనను బట్టి, మీరు ఏడు రోజుల పాటు సమీక్షలో సూచించిన మార్పుచేర్పులు చేసేందుకు గాను, సమీక్షను "నిలిపి" ఉంచవచ్చు. సాటివారి అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. ఆమోదించడం, తిరస్కరించడం, నిలిపి ఉంచడం, సాటివారి అభిప్రాయాన్ని తీసుకోవడం ఎలాగో కింద చూడవచ్చు.

సమీక్షా మూసను వాడటం తప్పనిసరేమీ కాదు; అది సమీక్షకు సహయకారి అంతే. తొలిసారిగా సమీక్ష చేస్తూ ఉంటే, అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

మెట్టు 4: సమీక్షను ముగించడం

[మార్చు]

సఫలం చెయ్యడం (పాస్ చెయ్యడం)

[మార్చు]

వ్యాసం మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఉందని మీరు భావిస్తే కింది పద్ధతిలో దాన్ని ఆమొదించవచ్చు:

  1. వ్యాసపు చర్చా పేజీలో ఉన్న {{GA nominee}} మూసను తీసివేసి, దాని స్థానంలో {{GA|~~~~~|topic=|page=}} అనే మూసను పెట్టండి.
  2. ఐదు టిల్డెలు సమీక్షించిన తేదీని సూచిస్తాయి. వ్యాస విషయం (టాపిక్), పేజీ సంఖ్యను నింపండి. |topic= పరామితి వ్యాసం ఏ విషయానికి సంబంధించినదో చెబుతుంది. |page= పరామితి ఈ సమీక్ష ఈ వ్యాసానికి ఎన్నవ సమీక్షో చెబుతుంది. సమీక్షా ఉప పేజీలోని సంఖ్య ఇది{{Talk:ArticleName/GAn}}) లో n దీన్ని సూచిస్తుంది. page పరామితిగా అంకెను మాత్రమే ఇవ్వాలి.
  3. Update any WikiProject templates on the article talk page by changing the |class= parameter value to "GA".
  4. పేజీని భద్రపరచండి. ఈ పని బాట్ చేస్తుంది|వ్యాసం పేజీలో మంచి వ్యాసం ఐకను చేరుతుంది. ప్రతిపాదనల పేజీ నుండి వ్యాసం పేరును తీసేస్తుంది. {{GANotice}} మూస ద్వారా వ్యాసం సమీక్షలో సఫలమైందనే సందేశాన్ని ప్రతిపాదకునికి పంపిస్తుంది. ఐకన్‌ను మానవికంగా చేర్చరాదు.
  5. వ్యాసం మంచి వ్యాసం ఎందుకయిందో సమీక్షా పేజీలో స్పష్టం చెయ్యాలి. ప్రతిపాదకునికి అభినందన సందేశం పెట్టండి.
  6. వికీపీడియా:మంచి వ్యాసాలు పేజీలో సంబంధించిన విభాగంలో వ్యాసాన్ని చేర్చండి.

విఫలం చెయ్యడం (ఫెయిలు చెయ్యడం)

[మార్చు]

వ్యాసం మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా లేదని మీరు భావిస్తే కింది పద్ధతిలో దాన్ని విఫలం చెయ్యండి:

  1. వ్యాసం చర్చా పేజీలోని {{GA nominee}} మూసను తీసివేసి, దాని స్థానంలో {{FailedGA|~~~~~|topic=|page=}}అనే మూసను పెట్టండి.
  2. ఐదు టిల్డెలు సమీక్షించిన తేదీని సూచిస్తాయి. వ్యాస విషయం (టాపిక్), పేజీ సంఖ్యను నింపండి. |topic= పరామితి వ్యాసం ఏ విషయానికి సంబంధించినదో చెబుతుంది. |page= పరామితి ఈ సమీక్ష ఈ వ్యాసానికి ఎన్నవ సమీక్షో చెబుతుంది. సమీక్షా ఉప పేజీలోని సంఖ్య ఇది{{Talk:ArticleName/GAn}}) లో n దీన్ని సూచిస్తుంది. page పరామితిగా అంకెను మాత్రమే ఇవ్వాలి.
  3. పేజీని భద్రపరచండి. ఈ పని బాట్ చేస్తుంది|ప్రతిపాదనల పేజీ నుండి వ్యాసం పేరును తీసేస్తుంది. {{GANotice}} మూస ద్వారా వ్యాసం సమీక్షలో విఫలమైందనే సందేశాన్ని ప్రతిపాదకునికి పంపిస్తుంది.
  4. మంచి వ్యాసంగా రూపొందాలంటే వ్యాసంలో ఏయే మార్పులు చెయ్యాలో సమీక్షా పేజీలో రాయండి. అవసరమైన మార్పుచేర్పులు చేసాక మళ్ళీ ప్రతిపాదించమని ప్రతిపాదకునికి ప్రోత్సహించండి.

వ్యాసాన్ని నిలిపి ఉంచడం

[మార్చు]

వ్యాసంలో ఉన్న కొద్దిపాటి లోటుపాట్లను సవరిస్తే, అది మంచి వ్యాసం స్థాయికి వెళ్తుందని, అందుకు కొంత సమయం (సాధాఅరణంగా 7 రోజులు) ఇద్దామనీ మీరు భావిస్తే, కింది పద్ధతిలో దాన్ని నిలిపి ఉంచవచ్చు:

  1. వ్యాసం చర్చాపేజీలోని {{GA nominee}} మూసలో |status= పరామితిని "నిలిపి ఉంచాను", అని మార్చండి{{GA nominee|...|status=నిలిపి ఉంచాను}} - ఇలాగ,
  2. పేజీని భద్రపరచండి. ఈ పని బాట్ చేస్తుంది|ప్రతిపాదనల పేజీలో వ్యాసాన్ని నిలిపి ఉంచారనే సందేశం చేరుతుంది. {{GANotice}} మూస ద్వారా వ్యాసాన్ని నిలిపి ఉంచారనే సందేశాన్ని ప్రతిపాదకునికి పంపిస్తుంది.
  3. వ్యాసంలో ఏయే మార్పులు చెయ్యాలో సమీక్షా పేజీలో రాయడం మరువకండి.

రెండవ అభిప్రాయం తీసుకోవడం

[మార్చు]

ఏదైనా అంశంపై మీకు సందేహాలు ఉంటే, వేరే సమీక్షకుడు లేదా నిపుణుడి నుండి అభిప్రాయాన్ని కోరవచ్చు - కింది విధంగా:

  1. వ్యాసపు చర్చాపేజీలోని {{GA nominee}} మూసలో |status= పరామితిని "2వ అభిప్రాయం" అని మార్చండి. {{GA nominee|...|status=2వ అభిప్రాయం}} - ఇలాగ.
  2. పేజీని భద్రపరచండి. ఈ పని బాట్ చేస్తుంది|ప్రతిపాదనల పేజీలో 2వ అభిప్రాయం కోరుతున్నారనే సందేశం చేరుతుంది.
  3. సమీక్షా పేజీలో ఏ విషయమై రెండవ అభిప్రాయం కోరుతున్నారో రాయండి.

రెండవ అభిప్రాయం రాయడం

[మార్చు]

రెండవ అభిప్రాయాన్ని కింది విధంగా చెప్పవచ్చు:

  1. వ్యాసం చర్చాపేజీలోని {{GA nominee}} మూసలో |status= పరామితిని "సమీక్షలో ఉంది" అని మార్చండి.{{GA nominee|...|status=సమీక్షలో ఉంది}}
  2. పేజీని భద్రపరచండి. ఈ పని బాట్ చేస్తుంది|ప్రతిపాదనల పేజీలో 2వ అభిప్రాయం కోరుతున్నారనే సందేశాన్ని తీసేస్తుంది.
  3. కోరిన విషయంపై రెండవ అభిప్రాయాన్ని సమీక్షా పేజీలో రాయండి.

మొదటి సమీక్షకుడిని సంప్రదించకుండా సమీక్షను ముగించకండి.

సందేహాలుంటే..

[మార్చు]

ఈ పేజీలోని సమాచారానికి సంబంధించి గాని, మంచి వ్యాసాలకు సంబంధించి గానీ ఏమైనా సందేహాలుంటే మంచి వ్యాసం ప్రతిపాదనల పేజీలో గానీ రాయండి.